19/04/2025
*విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవాలి*
*మల్యాల రాకేష్ - ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి*
ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈరోజు విద్యార్థుల కోసం పాలిసెట్ ఉచిత బోధనా తరగతులను జ్యోతి ప్రజ్వల చేసి వందేమాతరం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ గారు మాట్లాడుతూ
"విద్యార్థులు సామాజిక స్పృహ, సేవ భావం కలిగి ఉండాలన్నారు."
ఏబీవీపీ కార్యకర్తలు ఆచరించే జ్ఞానం, శీలం,ఏకత నుండి ప్రతి విద్యార్థి ప్రేరణ పొందాలన్నారు ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై దేశ సమస్యలపై సామాజిక సమస్యలపై ఆందోళనాత్మక కార్యక్రమాలు చేస్తూనే మరొక పక్క నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేస్తుందన్నారు. అందులో భాగంగానే రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత బోధనా తరగతులు, మహిళలకు ఆత్మ రక్షణ కోసం మెలుకువలు నేర్పించడానికి మిషన్ సాహసి , పర్యావరణ పరిరక్షణకు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు ఏబీవీపీ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు అదేవిధంగా అన్ని వర్గాల విద్యార్థుల కోసం ఏబీవీపీ పని చేస్తుందన్నారు కులాలకు మతాలకు అతీతంగా ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఐక్యత తీసుకురావడానికి పనిచేస్తుందన్నారు కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో తిష్ట వేసిన దేశ వ్యతిరేక శక్తులను తరిమికొట్టడానికి ప్రతి విద్యార్థి పని చేయాలన్నారు అందుకొరకు దేశ భక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులు స్వీట్ కోటెడ్ పాయిజన్ లాంటివారన్నారు కమ్యూనిస్టులు , సోషలిస్టులు రాజ్యాంగానికి ప్రధాన శత్రువులని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారన్నారు దేశం కోసం మరియు విద్యార్థుల కోసం గత 77 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎబివిపి ద్వారా విద్యార్థులు దేశం కోసం పనిచేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉచిత బోధనా తరగతులు నిర్వహిస్తున్న కరీంనగర్ ఏబీవీపీ శాఖను వారు అభినందించారు
నిరుపేద విద్యార్థులు ఈ ఉచిత బోధనా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు".
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, గోపి,కుమారస్వామి కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామాండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నాడి శ్రీ వర్ధన్, జోనల్ ఇన్చార్జిలు యోగేష్, సాయి చరణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.