Telangana Jagruthi

Telangana Jagruthi TELANGANA JAGRUTHI karimnagar district unit

ఈ ఫోటో వయస్సు 12 ఏండ్లు ! సరిగ్గా ఈరోజే అంటే ఫిబ్రవరి 4 న 2012 లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్ విగ్రహ ఆవిష్కారణ సందర్భం...
04/02/2024

ఈ ఫోటో వయస్సు 12 ఏండ్లు ! సరిగ్గా ఈరోజే అంటే ఫిబ్రవరి 4 న 2012 లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్ విగ్రహ ఆవిష్కారణ సందర్భంగా జరిగిన సమావేశం లోనిది ! పూలే విగ్రహాన్ని అసెంబ్లీ లో ఏర్పాటు చేయాలనీ మా నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ప్రభుత్వాన్ని కోరడం పై కొద్ది మంది మితృలు విమర్శలు గుప్పిస్తున్నరు ! ఈ సందర్భంగా కవిత గారి కార్యాచరణ ను మితృలకు గుర్తు చేయాల్సిన బాధ్యత అప్పటి కార్యకర్తగా నాపై ఉన్నది ! మహనీయుల విగ్రహాల ఏర్పాటు అనేది తెలంగాణ జాగృతి సంస్థ ఆశయాల్లో ఒకటి ! అందుకే జయశంకర్ సర్ మరణ అనంతరం వారి నిలువెత్తు విగ్రహాన్ని రాష్ట్రం లో అందరికంటే ముందు కవిత గారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిండ్రు ! కొమురం భీం విగ్రహాన్ని మహా ముత్తారం మండలం యామాన్ పల్లి లో ఏర్పాటుకు వెళుతుంటే కాటారం లో అప్పటి ప్రభుత్వం వారిని అరెస్టు చేసింది ! అంతకు ముందు రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహాదేవ్ పూర్ మండల కేంద్రం లో ఆవిష్కరించిండ్రు ! దానికి సభా అధ్యక్షున్ని నేనే ! ఈ విగ్రహ ఆవిష్కరణ లకు ఒకరోజు ముందు మంథని కి చేరుకున్న వారిని అప్పటి స్వపక్ష నాయకులు వారించిండ్రు ! వద్దు అమ్మ అరెస్టు చేస్తరు అని భయపెట్టిండ్రు ! అయినా ఏం చేస్తరో చూద్దాం అని ముందుకు కదిలిండ్రు ! ఈ పరిణామ క్రమం లోనే 9 వ తరగతి సాఘీక శాస్త్రం లో కొమురంభీం పాఠ్యాంశంగా వచ్చింది! 7 వ తరగతిలో సమ్మక్క -సారక్క పాఠ్యాంశం , 8 వ తరగతిలో హైదరబాద్ రాష్ట్ర విశేషాలు పాఠ్యాంశంగా వచ్చినవి! వారు చేసిన కృషి మూలంగా తెలంగాణ చరిత్ర , సంస్కృతులకు ప్రాదాన్యత లభించింది! తెలంగాణ పండుగలు , జానపదాలు పుస్తకాల్లో అచ్చయినయి! ప్రాచీన శాసనం లో తెలంగాణ పురం అన్న ప్రస్తావన ఉండడం తో రాం చంద్రాపూర్ లోని తెల్లాపూర్ గ్రామానికి తెలంగాణ పురంగా పేరుపెట్టాలని డిమాండ్ చేసి సాదించిండ్రు ! అప్పటి సినిమాల్లో తెలంగాణ భాష , యాసలను కించపరిచే వైనాన్ని ప్రశ్నించిండ్రు ! ఆ క్రమం లోనే సినిమాల్లో తెలంగాణ కు ప్రాదాన్యత పెరుగుతూ వచ్చింది! వట్టికోట అళ్వారు స్వామీ లాంటి అనేకమంది తెలంగాణ సాహితీ శిఖరాలను గుర్తుకు తెచ్చిండ్రు ! నిజాం రాష్ట్రాంద్ర మహా సభలు , మొదటి , రెండవ గ్రంథాలను పునహ్ ముద్రణ చేసిండ్రు ! తెలంగాణ మరో వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికను గ్రంథస్థం చేసిండ్రు ! రెండు జిల్లాల్లో జరుపుకొనే అట్లతద్దె గురించి అచ్చు వేసిండ్రు కాని ప్రపంచం లోనే మహిళలు అతి పెద్దగా జరుపుకొనే బతుకమ్మ గురించి అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు ! దాంతో బతుకమ్మ అంశాన్ని ప్రపంచం వీక్షించేలా చేసిండ్రు ! తొమ్మిది రోజుల పాటు టివి లు చర్చకు పెట్టే అనివార్య పరిస్థితులు కల్పించబడ్డాయి ! బతుకమ్మ పాఠ్య పుస్తకం లో ఓ పాఠ్యాంశం అయ్యింది ! మరుగున పడ్డ కళలు సాంకృతిక అంశాలు అక్షర రూపం దాల్చాయి ! క్రమం తప్పని కార్యక్రమాలు , సమావేశాల తో నిత్యం తెలంగాణ భావజాలాన్ని తనదైన పద్దతిలో విస్తృతం చేసిండ్రు ! బౌద్దం అంటే అమరావతి అనుకొనే పరిస్థితి నుండి వెయ్యేండ్ల చరిత్ర గలిగిన దూళికట్ట వెలుగులోకి వచ్చింది ! తెలుగుకు ప్రాచీన హోదా కొరకు కావలసిన ఆధారాల కై ఆంధ్రాలో వెతికే ఆర్కియాలజీ శాఖ తెలంగాణ గడ్డను తవ్వింది ! ఆ గడ్డలోనే అసలైన మూలాలు ఉన్నయని కేంద్రమూ అంగీకరించింది ! పోలవరం ముంపు గ్రామాల కొరకై వారు న్యాయ పోరాటం కూడా చేసిండ్రు ! చారిత్రిక ప్రదేశాల సందర్శన! సాంస్కృతిక ,సాహిత్య కార్యక్రమాలు! కవి సమ్మేళనాలు , పుస్తక సమీక్షలు , ప్రచురణలు ! విద్యార్థులు , యువకులు , వివిధ సమస్యలు ! సహాయ సహకారాలు ! తెలంగాణ ప్రత్యెక రాష్ట్ర స్పుహ, సభలు , సమావేశాలు , దీక్షలు , ధర్నాలు , రాస్తారోకోలు! పచ్చదనం పరిశుభ్రత , మొక్కలు నాటుట! ఆరోగ్య అవగాహన , మెడికల్ క్యాంప్ లు , మందుల పంపిణి ! మహిళలు స్వావలంబన , కుట్టు మిషన్ ల పంపిణి ! క్రీడల నిర్వహణ ! సభ్యులకు తగు శిక్షణ ద్వారా, రక రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ భావజాలాన్ని విస్తృతం చేసిండ్రు ! ఇప్పుడు కూడా తంగేడు అనే సాహిత్య మాస పత్రికకు తనే సంపాదకులుగా వ్యవహరిస్తూ పాఠకుల్లో సాహిత్య స్పృహ ను కలిగిస్తున్నారు ! రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణ లో పెట్టాలని డిమాండ్ చేసి సాదించిండ్రు ! వారి కృషిని అప్పటి అసెంబ్లీ స్పీకర్ లేఖ లో అభినందించిండ్రు ! ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణ లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నరు ! కనుక మితృలు కవిత గారి కార్యాచరణ కు మద్దతు పలకాలని కోరుతున్న !

Address

8-3-278/4, Near Saibaba Temple, Ramchandrapur Colony
Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Telangana Jagruthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share