Hira Foundation Karimnagar INDIA

Hira Foundation Karimnagar INDIA This organization is being run by highly educated Islamic scholars and highly educated people their aim is to serve the needy and please ALLAH.

02/03/2026
Ramazan Food Packs Distribution for the Needy - 2026
01/03/2026

Ramazan Food Packs Distribution for the Needy - 2026

పేదలకు ఆసరాగా హిరా ఫౌండేషన్ కరీంనగర్ సేవలుపవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సరకుల పంపిణీ గ్రామాల్లో మసీదుల నిర్మాణం, మౌలిక వసత...
24/03/2025

పేదలకు ఆసరాగా హిరా ఫౌండేషన్ కరీంనగర్ సేవలు

పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సరకుల పంపిణీ

గ్రామాల్లో మసీదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన

పేద విద్యార్థులకు విద్యాభ్యాసం, ఉచిత వసతి

చైర్మన్ షేక్ అబూబకర్ ఖాలీద్ తోపాటు పలువురు దాతల ఆర్థిక మద్దతు

హిరా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముస్తీ ఘియాస్ మొహియుద్దీన్ వెల్లడి

కరీంనగర్, మార్చి 22:-

పేదలకు ఆర్ధిక చేయూతనం దిస్తూ, వారి ముఖాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తోంది హిరా ఫౌండేషన్ కరీంనగర్.. ముస్లింలు అత్యంత పర్వదినంగా భావించే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆ నెలంతా పండగలా భావిస్తారు. కానీ తామున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు పండుగ జరుపుకోవడమే కష్టంగా భావించే పేద వర్గాలకు రంజాన్ మాసానికి సరిపడా నిత్యావసర వస్తువులను అందించి వారి ముఖాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈ సంస్థ... ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లోని పేద కుటుంబాలకు ఆసరగా నిలుస్తూ గ్రామాల్లో కొత్తగా నిర్మాణాలు, ఇప్పటికే ఉన్న మసీదుల్లో మంచినీరు తదితర మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటునందిస్తోంది. సంస్థ స్థాపించిన 19 సంవత్సరాలుగా హిరా ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు, ఫౌండేషన్ చైర్మన్ షేఖ్ అబూ బకర్ ఖాలీద్ తో పాటు పలువురు దాతలు ఆర్థిక సాయం అందిస్తూ తోడ్పాటు నందిస్తున్నట్లు ట్రస్టీ ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ తెలిపారు.

రంజాన్ మాసంలో :

నిరు పేదలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో పేద కుటుంబాల వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. 2005లో సంస్థ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు గత 19 సంవత్సరాల్లో ఏటా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 2 వేల కుటుంబాలకు చేయూ తనందిస్తున్నారు.

మస్జిద్లలో మౌలిక వసతుల కల్పన

ప్రతి రంజాన్ మాసం పురస్కరంచుకొని గ్రామీణ ప్రాంతాల్లోని మసీదుల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. మసీదులే లేని గ్రామాల్లో కొత్తగా నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మస్జిద్ లలో పనిచేసే ఇమామ్లకు వేతనాలందిస్తున్నారు.

వింతంతు, దివ్యాంగులకు పింఛన్లు:

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద వర్గాలకు చెందిన వితంతువులు, దివ్యాంగులతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి నెల, నెలా కొంత మొత్తాన్ని వారికి పింఛన్లుగా అందించి వారికి ఆర్థిక చేయూత నందిస్తూ అండగా నిలుస్తున్నారు.

ఉచిత విద్య, వసతి:

గ్రామీణ ప్రాంతా ల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన బాలబాలికలతో పాటు, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుం బాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య నందిస్తు న్నారు. ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి యువతకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నారు. బాలబాలికలకు విద్యతో పాటు అవసరమైన వారికి ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.

జకాత్ ద్వారా ఆర్థిక వెసులుబాటు :

రంజాన్ సందర్భంగా సంపన్న కుటుంబాల వారు జకాత్ పాటిస్తారు. జకాత్ అంటే తాము సంపాదించిన దాంట్లో రెం డున్నర శాతం పేద వర్గాలకు ఖర్చు చేయాలి. ఇలా జకాత్ ద్వారా ఏటా సంస్థకు కొంత నిధులు వస్తాయని, హిరా సంస్థ చైర్మన్ సహా పలువురు దాతలు సంస్థ నిర్వహణకు ఇతోధికంగా ఆర్థిక సాయం అందిస్తున్నారని మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ తెలిపారు.

ఉచితంగా అన్నదాన కార్యక్రమం,.

అంతేకాకుండా ప్రతీ సోమ, గురువారాల్లో నగరంలోని మాతాశిశుసంక్షేమ ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణుల కోసం సహాయంగా వచ్చే సుమారు 300 మంది కుటుంబసభ్యులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుస్తారు.

    పేదలకు సేవ చేయడం.. అభాగ్యులకు అండగా నిలవడం భిన్నత్వంలో ఏకత్వం హిర ఫౌండేషన్ లక్ష్యంమేనేజింగ్ ట్రస్టీ ముఫ్తి ఘియాస్ మొ...
03/12/2024




పేదలకు సేవ చేయడం.. అభాగ్యులకు అండగా నిలవడం భిన్నత్వంలో ఏకత్వం హిర ఫౌండేషన్ లక్ష్యం

మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ వెల్లడి

హిర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకుంటలో కుల, మతాలకతీతంగా 250 మంది పేదలకు బ్లాంకేట్ల పంపిణీ

కరీంనగర్ కొత్తపల్లి, డిసెంబర్ 02:-

పేదలకు సేవ చేయడం, అభాగ్యులను ఆదుకోవడమే లక్ష్యంగా హిర ఫౌండేషన్ కరీంనగర్ పనిచేస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ తెలిపారు. సోమవారం కొత్తపల్లి హవేలీ మండలం చింతకుంట శాంతినగర్ గ్రామంలో ప్రాంతంలో హిర ఫౌండేషన్ వింటర్ ప్రాజెక్టు 2024 ద్వారా ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో... హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు చెందిన దాదాపు 250 మందికి బ్లాన్కెట్లను చలికాలం దృష్ట్యా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ హిర ఫౌండేషన్ కరీంనగర్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంజాన్ మాసంలో పేదలకు నిత్యవసర సరుకులతో పాటు, బట్టలు అందించడం, బక్రీద్ మాసాన్ని పురస్కరించుకొని మాంసం పంపిణీ కార్యక్రమం, శీతాకాలంలో పేదలకు బ్లాంకెట్ల పంపిణీ, గ్రామాల్లో అవసరం ఉన్న చోట మస్జీదుల నిర్మాణం, మిలదున్నబి మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఉచిత పుస్తకాల పంపిణీ, మహనీయ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై ఆధ్యాత్మిక సదస్సులను ఏర్పాటు చేసి ముస్లిం సమాజాన్ని చెడు మార్గం గుండా వెళ్లకుండా సన్మార్గంలో తీసుకువచ్చే విధంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సదస్సులను ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలను ప్రతి ఏటా చేస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పడమే హిరా ఫౌండేషన్ లక్ష్యమని చెప్పారు. హిర ఫౌండేషన్ కరీంనగర్ కు దాతలు విరివిగా విరాళాలు అందించి, హిర ఫౌండేషన్ చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో చింతకుంట తాజా మాజీ ఎంపిటిసి బానోతు తిరుపతి నాయక్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోతు శ్రవణ్ నాయక్, హఫీస్ రిజ్వాన్ ఫలాహి, డాక్టర్ అబ్దుల్ ఖుద్దూస్, అహ్మద్ జైది, హిర ఫౌండేషన్ ప్రతినిధులు మహమ్మద్ రఫీ, హాఫిజ్ అహ్మద్ హిప్జి, కలీం శరీఫ్, ముఖరం, తదితరులు పాల్గొన్నారు.

   Please donate in this project
23/10/2024




Please donate in this project

09/06/2024


  Please help us in bringing smile to the most needy peoples this bakrid across karimnagar district by taking active par...
24/05/2024



Please help us in bringing smile to the most needy peoples this bakrid across karimnagar district by taking active participation in Qurbani project.

*Under the strict supervision of ulama

Contact:
M***i Ghiyas Mohiuddin
9346355306

𝗠𝗮𝗵𝗶𝗻, 𝟴 𝘆𝗿𝘀 𝗼𝗹𝗱 𝗴𝗶𝗿𝗹 𝘀𝘂𝗳𝗳𝗲𝗿𝗶𝗻𝗴 𝗳𝗿𝗼𝗺 𝗯𝗿𝗮𝗶𝗻 𝗰𝗮𝗻𝗰𝗲𝗿She is currently undergoing treatment in the ICU at Glenfield Mallaredd...
07/05/2024

𝗠𝗮𝗵𝗶𝗻, 𝟴 𝘆𝗿𝘀 𝗼𝗹𝗱 𝗴𝗶𝗿𝗹 𝘀𝘂𝗳𝗳𝗲𝗿𝗶𝗻𝗴 𝗳𝗿𝗼𝗺 𝗯𝗿𝗮𝗶𝗻 𝗰𝗮𝗻𝗰𝗲𝗿

She is currently undergoing treatment in the ICU at Glenfield Mallareddy Brain Heart Hospital. An amount of Two lakh fifty thousand is urgently needed.
Later, more money may be required for treatment.

𝗬𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝗶𝘀 𝗻𝗲𝗲𝗱𝗲𝗱 𝘁𝗼 𝘀𝗮𝘃𝗲 𝗠𝗮𝗵𝗶𝗻'𝘀 𝗹𝗶𝗳𝗲.

So far the expenditure has been done with the support of well-wishers like you. Your support is still desperately needed.

𝗕𝗮𝗰𝗸𝗴𝗿𝗼𝘂𝗻𝗱:
Maheen's father Maulana Munzeer Alam is an imam of a small village, Keshapur mandal, Hasanparti, Hanmakunda, Telangana, who has no means of treatment.

You may contact Hazrat Maulana
𝐀𝐫𝐬𝐡𝐚𝐝 𝐀𝐥𝐢 𝐐𝐚𝐬𝐦𝐢, Secretary, Majlis Tahafuz Khatman Nabubat, Hyderabad or M***i Mohammad Ghiyas Muhyiddin can connect with Karim Nagar (Hira Foundation) or directly support the girl's father.

𝗗𝗢𝗡𝗔𝗧𝗘 𝗡𝗢𝗪
Munazir Aalam
9182913590
G-Pay, Phone pay,

Bank Details
Md Munajir Alam
State Bank of India
A/C. 40399645980
IFSC: SBIN0020155
Branch: keswapur.
Elkaturti Mandal, Hanamkunda (TS) INDIA

Click to chat+919346355306
29/04/2024

Click to chat
+919346355306

హిర ఫౌండేషన్ కరీంనగర్ ఔదార్యం300 పేద కుటుంబాలకు రంజాన్ వంట సామగ్రి పంపిణీకరీంనగర్, మార్చి 28:- నగరంలోని 17, 18, 19 డివిజ...
01/04/2024

హిర ఫౌండేషన్ కరీంనగర్ ఔదార్యం

300 పేద కుటుంబాలకు రంజాన్ వంట సామగ్రి పంపిణీ

కరీంనగర్, మార్చి 28:-

నగరంలోని 17, 18, 19 డివిజన్లలో హిర ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో పేదలకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బియ్యం వంట సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. గురువారం నగరంలోని రేకుర్తి శేఖాన్ నగర్, షేకాబి కాలనీ, సాలం పుర, సాలెహ్ నగర్ లలో హిర ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ అబూ బకర్ ఖాలీద్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాస దీక్షలు పాటించే 200 పేద కుటుంబాలకు బియ్యం, వంట సామగ్రిని అందించామని చెప్పారు. రంజాన్ మాసం దాన, ధర్మాల మాసమని, ధనికులపై పేదలకు హక్కు కల్పించిన ధర్మం ఇస్లాం మాత్రమే నన్నారు. ఈనెలలో ఉపవాస దీక్షలు పాటించే ఏవ్యక్తి కైనా మంచి నీళ్లు మొదలు పండ్లు, డ్రైఫ్రూట్స్, వంట సామగ్రి రూపంలో సాయం అందించే వారికి సైతం ఉపవాస దీక్షలు పాటించినంత పుణ్యం లభిస్తుందని మహానియ మహమ్మద్ ప్రవక్త సల్లం సెలవిచ్చారని చెప్పారు. హిర ఫౌండేషన్ కరీంనగర్ ఈబృహత్తర కార్యక్రమాన్ని దాతల సహకారంతో చేపట్టడం, తమకు ఈ పుణ్య కార్యంలో బాగస్వామ్యులు చేయడం సంతోషాదాయకమన్నారు. హిర ఫౌండేషన్ ద్వారా కరీంనగర్ నగర మున్సిపల్ డివిజన్లతో పాటు ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో సుమారు1400 కుటుంబాల్లో రంజాన్ వంట సామాగ్రి కిట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. హీర ఫౌండేషన్ కరీంనగర్, మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువ్వత్ ట్రస్టు కరీంనగర్ శాఖలకు పెద్ద ఎత్తున జకాత్, సద్ఖాత్, అతియా, ఫిత్రాల రూపంలో విరాళాలు అందించి మారుమూల ప్రాంతాల్లో నివసించే పేదలకు సాయం అందించే యజ్ఞం లో బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 9346355306ను సంప్రదించాలని కోరారు. ఈకార్యక్రమంలో హీర ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ అబూ బకర్ ఖాలీద్, హాఫిజ్ అహ్మద్ హిప్జి, హాఫిజ్ ఫరీదోద్దీన్, కలీం షరీఫ్, మహమ్మద్ రఫీ, ముఖరం, అబ్దుల్ రాఫె, ముఫ్తి ఇంతియాజ్, కొత్తపల్లి కాంగ్రెస్ నేత ఖాజా ఖాన్, సయీద్ మౌల్విసాబ్, హాఫిజ్ హమీద్, ఖాజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Address

Sahetnagar
Karimnagar
505001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+918500044499

Alerts

Be the first to know and let us send you an email when Hira Foundation Karimnagar INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hira Foundation Karimnagar INDIA:

Share