07/06/2026
*రెండు పేర్లతో నడుస్తున్న విశ్వ భారతి పాఠశాలను సీజ్ చేయాలి: డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ*
*యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్*
*డీఈఓకు వినతిపత్రం అందజేసిన విద్యార్థి, యువజన సంఘాలు*
వేములవాడ పట్టణంలోని విశ్వ భారతి పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండు పేర్లతో నిర్వహించబడుతోందని ఆరోపిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలు శనివారం జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి వినతిపత్రం సమర్పించాయి.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, పాఠశాల అసలు పేరు "విశ్వ భారతి" కాగా, ప్రచార ఫ్లెక్సీలు, కరపత్రాల్లో "విశ్వ భారత్" పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఒకే విద్యాసంస్థను రెండు వేర్వేరు పేర్లతో నడుపుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
ఇప్పటికే ప�