20/04/2026
⛪✝️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా, జీవముగల దేవుని సేవకులైన బిషప్స్, పాస్టర్స్, క్రైస్తవ నాయకులు అందరూ ఆయన కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయవలసిందిగా వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను.
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల వారికి సమాన న్యాయం జరిగేలా, జ్ఞానముగల ఆలోచనలు ప్రసాదించే ఏసు ప్రభువు, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ప్రసాదించి, ఆయనను ముందుకు నడిపించాలని ప్రార్థిద్దాం.
సర్వమానవాళి పాపాల కొరకు తన ప్రాణం అర్పించి, మూడవ దినమున సజీవుడై తిరిగి లేచి, 40 రోజుల పాటు భూమిపై ఉండి, 500 మందికి పైగా ప్రజలకు కనబడి, "మరల వచ్చెదను" అని వాగ్దానం చేసి, పరలోకమునుండి సమస్తమును చూచుచున్న జీవముగల ప్రభువైన ఏసుక్రీస్తు, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మనమందరం ప్రార్థిద్దాం.
ప్రొఫెసర్ డా. జోసఫ్ మోసిగంటి
B.Tech, M.Tech, Ph.D
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు &
మేనేజింగ్ డైరెక్టర్ (MD)
సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ కాలేజస్, గుంటూరు