Kriya

Kriya KRIYA is a non-profit, non-government voluntary organisation

Kriya conducts competitions, workshops and support to children who go to higher education with scholarships.

One more ….
31/12/2024

One more ….

30/12/2024
Day 2 Winners
30/12/2024

Day 2 Winners

Day-1 Winners list updated
28/12/2024

Day-1 Winners list updated

KRIYA Children Festival 2024
19/11/2024

KRIYA Children Festival 2024

గతేడాది క్రియ నవోదయ, NMMS పరీక్షలకు విజిఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్ లోని 458 ప్రభుత్వ  పాఠశాలలలో 7388 మ...
02/08/2024

గతేడాది క్రియ నవోదయ, NMMS పరీక్షలకు విజిఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్ లోని 458 ప్రభుత్వ పాఠశాలలలో 7388 మంది పిల్లలకు ఇచ్చాం.

863 నవోదయ తెలుగు మీడియం
516 నవోదయ ఇంగ్లీషు మీడియం
1205 NMMS తెలుగు మీడియం
4804 NMMS ఇంగ్లీషు మీడియం
7388 మెత్తం

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం పది వేల పుస్తకాలు అవసరమౌతాయని అంచనా. ఖర్చు అంచనా పది లక్షలు.

ఎవరైనా వ్యక్తులు కాని, సంస్థలు కాని స్పందించ వలసినదిగా మనవి.

ఉదయం నాకో కొత్త నెంబరు నుంచి ఫోన్ వచ్చింది, ఆన్సర్ చేసాను, రికార్డెడ్ వాయిస్ ఇంగ్లీషులో. విషయం ఏంటంటే, నా పార్సిల్ ఏదో ర...
10/07/2024

ఉదయం నాకో కొత్త నెంబరు నుంచి ఫోన్ వచ్చింది, ఆన్సర్ చేసాను, రికార్డెడ్ వాయిస్ ఇంగ్లీషులో. విషయం ఏంటంటే, నా పార్సిల్ ఏదో రిజక్ట అయిందని, వివరాలు కావాలంటే ఏవో అంకెలు నొక్కమంది. నేనేదో హడావుడిలో ఉండి కట్ చేసేసాను.

ఓ అరగంట తర్వాత మళ్ళీ అదే కాల్ వేరే నెంబరు నించి. ఈ సారి పార్సిల్ అసలు ఎవరు పంపారో తెలుసుకుందామని ఆ రికార్డెడ్ వాయిస్ నొక్కమన్న అంకె నొక్కాను. కాసేపు మ్యూజిక్ తర్వాత ఒకడు లైన్లోకి వచ్చాడు, వాడు చెప్పింది ఏంటంటే నేను ఫెడ్ ఎక్స్ ద్వారా ముంబాయి నుంచి థాయిలాండ్ బుక్ చేసిన పార్సిల్ రిజెక్టయిందని. నేనేపార్సిల్ బుక్ చేయలేదన్నాను, నా పేరు, స్పెల్లింగ్ అడిగాడు, చెప్పాను. నా పేరు, నా ఫోన్ నెంబరు, నా ఆధార్ నెంబరుతో పార్సిల్ బుక్ అయిందని చెప్పి, మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పారేసుకున్నారా, కొత్త వాళ్ళకెవరికైనా ఆధార్ నెంబరు ఇచ్చారా అని అడిగాడు. పారేసుకోలేదుగాని, చాలా చోట్ల ఆధార్ నెంబరు ఇస్తాను కదా అన్నాను. అయితే మీ పేరుతో ఎవరో ముంబాయి అంధేరీ ఈస్ట్ బ్రాంచ్ నుంచి బుక్ చేసారు, అందులో 140 గ్రాముల M**A అనే డ్రగ్ ఉంది, అది బ్యాన్ చేసిన డ్రగ్, అందుకే రిజెక్ట చేసాము అన్నాడు. ముంబాయి సైబర్ క్రైమ్ కి రిపోర్టు చేయడం మంచిది, నేను సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ కి ఫోన్ కలపనా, లేదా మీరే వోన్ గా కంప్లైంట్ ఇచ్చుకుంటారా అన్నాడు, కలుపైతే అన్నాను, వాళ్ళు చాలా వివరాలు అడుగుతారు, పెన్ పేపర్ తీసుకుని రాసుకోండి అన్నాడు. వాడు చెప్పిన వివరాలు:
వాడి పేరు: రవి కుమార్
ఫెడ్ ఎక్స ఎంప్లాయీ ఐడి: 88789
పార్సిల్ నెంబరు: 2289321291
పార్సిల్ టు ఎడ్రస్:
Scaiyo sanun
+6629020299
38/62, Soilance Road
Bangkok, Thailand
Pin: 10400
పార్సిల్ కంటెంట్స్:
5 పాస్ పోర్టులు
3 క్రెడిట్ కార్డులు
140 గ్రాముల M**A
4 కెజీ క్లాత్స్
1 లాప్ టాప్
ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు నెంబరు 5961 ద్వారా పార్సిల్ ఛార్జీలు 15,625/- పే చేయడం జరిగింది.
పార్సిల్ బుకింగ్ తేదీ: 3.7.24

అన్నీ ఓపిగ్గా రాసుకున్నాను. సంభాషణ అంతా ఇంగ్లీషులో జరిగింది. కాల్ ఫార్వాడ్ చేసాడు, కాసేపు తర్వాత మరొకడు లైనులోకి వచ్చాడు. హిందీనా, ఇంగ్లీషా అన్నాడు, ఇంగ్లీషు అన్నాను. రాసుకున్న వివరాలన్నీ చెప్పాను. సరే అయితే పోలీసు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు. నేనెక్కడ వస్తాను చాలా దూరం ఏపి లో ఉన్నాను అన్నాను. ఎలా మరి అన్నాడు. కాసేపు ఆగి, సరే అయితే వీడియోలో మీ కంప్లైంట్ తీసుకుంటాను, స్కైప్ లోడు చేసుకోండి అన్నాడు. నేను డౌన్ లోడ్ పెట్టాను, నెమ్మదిగా అవుతోంది. మధ్యలో రెండు సార్లు ఇది లేటుగా డౌన్లోడ్ అవుతోంది, కొంచెం లైన్లో ఉండండి అన్నాను, ఉన్నాడు. చివరికి డౌన్లోడ్ అయింది. కానీ పాస్ వర్డు ఇష్యూ వచ్చి ముందుకు జరగడం లేదు. అదే చెప్పి వాట్సప్ వీడియో కాల్ ఓకే కదా అన్నాను. టెలిగ్రామ్ ఉందా అన్నాడు, ఉందన్నాను. వాడు MCCDBKC అని సెర్చ్ చేయమన్నాడు, Mumbai Cyber crime Dpt అని వచ్చి పోలీసు లోగో వచ్చింది. Hello టైప్ చేయమన్నాడు, చేసాను, వీడియో కాల్ చేసాడు. రూమ్ లో ఎవరూ ఉండ కూడదు అన్నాడు. వీడియో లో నేను కనపడుతున్నాను, వాడు కనిపించడం లేదు. నువ్వెందుకు కనిపించడం లేదు అనడిగాను, కంప్లైంటు ఇచ్చేది నువ్వుగా నేనెందుకు కనిపించడం అన్నాడు, నువ్వు పోలీసువో కాదో నాకేమిటి నమ్మకం అన్నాను. అయితే నువ్వు పోలీసు స్టేషన్ కి వచ్చి కంప్లైంటు ఇవ్వు అన్నాడు. ఫోన్ కట్ చేసేసాను. డౌటొచ్చింది.
నీకు అరెస్టు వారెంట్ మీ లోకల్ పోలీసు స్టేషన్ కు పంపుతున్నా అని టెలిగ్రామ్ లో మెసేజి పెట్టాడు. డౌటు కన్ఫర్మ్ అయింది.

నా తెలివి తేటల స్థాయి ఇదన్నమాట అనుకుని, వాడు ఆడిన మైండ్ గేమ్ ని మెచ్చుకుని, ఓరినాయనో అనుకున్నా.

ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పాను ఇదంతా, వాడు పోలీసు డ్రెస్ వేసుకుని వీడియో లోకి వచ్చి ఉంటే మరి కొంత ముందుకు తీసుకెళ్లేవాడేమో అన్నాడు. కాని జనరల్ గా ఫ్రాడ్ గాళ్లు వీడియోలోకి రారు.

ఈ సంవత్సరం క్రియ స్కాలర్షిప్ ల గురించి ఒక విషయం చెప్పాలి. కల్యాణి  నీలారంభం గారు రచయిత, అనువాదకురాలు, విశ్రాంత ఆంగ్ల అధ్...
31/05/2024

ఈ సంవత్సరం క్రియ స్కాలర్షిప్ ల గురించి ఒక విషయం చెప్పాలి.

కల్యాణి నీలారంభం గారు రచయిత, అనువాదకురాలు, విశ్రాంత ఆంగ్ల అధ్యాపకురాలు, విజయవాడలో ఉండేవారు. గత సంవత్సరం ఆమెకు కలిగిన తీవ్ర అనారోగ్యం కారణంగా ఇంకెంతో సమయం లేదనే విషయం ఆమెకు అర్దమయింది. ఆవిడ సేవింగ్స్ మొత్తం పేద పిల్లల చదువుకు ఉపయోగపడాలని సేవా సంస్థలకు ఇచ్చేసారు. ఆ క్రమంలో వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారి ద్వారా క్రియ స్కాలర్షిప్ ల గురించి తెలుసుకుని యాభై వేలు క్రియ ఎకౌంటుకు బదిలీ చేసారు. తర్వాత కొద్దిరోజులకే తుది శ్వాస విడిచారు. ఆమె పార్దివ దేహాన్ని వైద్య కళాశాలకు ఆమె కోరిక మేరకు మిత్రులు అందజేసేరు.

ఈ మధ్యనే ఒక రచయితగా మరణానంతరం ఆమెకు మొల్ల పురస్కారం లభించింది. పురస్కార సభ 'యూ ట్యూబ్' లింక్ క్రింద ఇస్తున్నాను. వక్తలు మాటలు విన్నాక తెలిసింది నాకు ఆమె ఎంత గొప్ప వ్యక్తో.

https://youtu.be/RGz8XWYAUVU

క్రియ స్కాలర్ షిప్స్ 2024:  ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల నుండి మంచి మార్కులతో పదవ తరగతి పాసయిన పేద విద్యార్థులకు ఒక్...
30/05/2024

క్రియ స్కాలర్ షిప్స్ 2024:

ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల నుండి మంచి మార్కులతో పదవ తరగతి పాసయిన పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5000/- చొప్పున స్కాలర్ షిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

2011 నుంచి ఇప్పటి వరకు 620 విద్యార్ధులకు సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగం కాదలచినవారు స్పందించమని మనవి

గతంలో ఇచ్చిన స్కాలర్ షిప్స్ వివరాలు, ఫోటోలు వెబ్ సైట్లో ఉన్నాయి.

KRIYA gives scholarships to the poor and brilliant students of government schools to continue their studies after 10th class. Many children from poor families mainly in rural areas are studying up to 10th class easily as they have government school nearby and those schools offer free education and a...

Address

2-155, Mainroad, Thimmapuram
Kakinada
533005

Alerts

Be the first to know and let us send you an email when Kriya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kriya:

Share