05/05/2026
*ప్రపంచంలోనే అరుదైన గొంతు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ వైద్యులు*
కాకినాడ: మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడలోని ఈఎన్‌టీ విభాగం వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఎం దుర్గ అనే మహిళ గొంతుకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్, వైద్యురాలు డా నికిత రెడ్డి గారు అత్యాధునిక పద్ధతులతో చికిత్స అందించి ఆరోగ్యవంతునిగా మార్చారు.ఈ సందర్భంగా ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ నిఖిత రెడ్డి గారు మాట్లాడుతూ, “మహిళ గొంతులో ఏర్పడిన అరుదైన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో మరియు ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి పరిశీలన అనంతరం, శస్త్రచికిత్సే ఉత్తమ మార్గమని నిర్ణయించి, మా నిపుణుల బృందంతో కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించాం. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది,” అని తెలిపారు.ఇటువంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, గొంతు సంబంధిత ఇబ్బందులు, శ్వాసలో ఇబ్బంది, దీర్ఘకాలిక గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ సెంటర్ హెడ్ శ్రీ ఎన్. అంజిబాబు గారు మాట్లాడుతూ, “మా ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉండటం వల్ల క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం మా ప్రధాన లక్ష్యం,” అని తెలిపారు.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించుకుంది.