06/07/2024
చేయూత సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించి తన వంతు సహకారం అందిస్తానని తెలియచేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ IAS
కాకినాడ కలెక్టరేట్: సమాజానికి విభిన్న రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న చేయూత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా.యం.రవికుమార్ ను మరియు వారి సభ్యులను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు... ఈ సందర్భముగా గత 1150రోజులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకు అన్నదానం, 30వేలకు పైగా రక్త దాతల ద్వారా రక్తదానం చేయించడం, 40మంది చిన్నారులకు ఉచిత విద్య, వైద్యం వసతి భోజన సదుపాయం కల్పించడం, 18మందికి కిరాణా షాపుల స్వయం ఉపాధి కల్పించడం , 70 మంది ఆర్ధిక భారంతో చదువు కొనసాగించలేని నిరుపేద విద్యార్థులకు విద్యని అందించడం, 42 మంది నిరుపేదలకు వైద్య చికిత్స నిమిత్తం ఆర్ధిక సహాయం అందించడం, పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడం, బీచ్ శుభ్రత ఇలా అనేక సేవాక్రమాలను చేయడం జరుగుతుందనీ రవికుమార్ తెలిపి కలెక్టర్ సన్మోహన్ కి మొక్కని అందించడం జరిగింది... ఈ కార్యక్రమంలో చేయూత సంస్థ కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సురభి శారద, సభ్యులు డాక్టర్ సలాడి కిరణ్ కుమార్,చింతా పవన్ కళ్యాణ్, విష్ణు, మనోజ్ చూగని, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు..