Project Navayan - Human Rights Initiative

Project Navayan - Human Rights Initiative Your support matters! 🤝🏽💙

Visit: https://navayan.org

🌟Join Project NAVAYAN's transformative journey in constructing India's first Ambedkar Knowledge Center & Buddha Vihar, promoting education, community development, and empowering the youth.

31/10/2024
🌟 ప్రొఫెసర్ కుమార్ మోలుగారం గారికి ఓస్మానియా యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైనందుకు హృదయపూర్వక అభినందనలు! ...
24/10/2024

🌟 ప్రొఫెసర్ కుమార్ మోలుగారం గారికి ఓస్మానియా యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైనందుకు హృదయపూర్వక అభినందనలు! 🎉

🎓 స్టడీ అబ్రాడ్ (బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాల్లో విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేసే సంస్థ) కోర్ మెంబర్, యాక్టివిస్ట్, మరియు ఎన్‌ఆర్‌ఐ అయిన బిందు గొంగటి గారితో కలిసి ప్రొఫెసర్ కుమార్ గారిని కలుసుకుని అభినందించాము.

ప్రొఫెసర్ కుమార్ గారు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఓస్మానియా యూనివర్సిటీలో తొలి దళిత వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. విద్యా రంగంలో ఆయనకున్న అనుభవం, చక్కటి నాయకత్వం యూనివర్సిటీకి గణనీయమైన మార్పులను తీసుకురావడంలో సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాం.

ప్రాజెక్ట్ నావయాన్ - హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్‌ ద్వారా విజ్ఞాన కేంద్రాల నిర్మాణం, విద్యా కార్యక్రమాలు, అలాగే స్టడీ అబ్రాడ్ కార్యక్రమాలను ఓస్మానియా యూనివర్సిటీ విద్యా వాతావరణంతో కలిపి ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించాం.

Looking forward to contributing together towards a brighter and more inclusive educational future. 🌍📚

విజయ్ వంగలపూడి
ఫౌండర్ & డైరెక్టర్, ప్రాజెక్ట్ నవయాన్

Today, I had the privilege of meeting Telangana Deputy CM Batti Vikrama Garu along with an NRI friend who is actively in...
22/10/2024

Today, I had the privilege of meeting Telangana Deputy CM Batti Vikrama Garu along with an NRI friend who is actively involved in education initiatives for underprivileged communities. This meeting focused on an important educational program aimed at uplifting marginalized sections through education. 🌍📚

Together, we are taking steps towards a more inclusive and brighter future. 🙌✨

- Vijay Kumar Vangalapudi
Founder & Director, Project NAVAYAN

కొన్ని రోజుల క్రితం Marupaka Krishnapriya  గారు తన  ఫేస్‌బుక్‌లో  సిస్టం ఇంజినీర్ కావాలని కోరుతూ పోస్ట్ చేశారు, ఆ పోస్ట్...
04/10/2024

కొన్ని రోజుల క్రితం Marupaka Krishnapriya గారు తన ఫేస్‌బుక్‌లో సిస్టం ఇంజినీర్ కావాలని కోరుతూ పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ చూసి నేను కృష్ణ ప్రియ గారి ఇంటికి వెళ్ళి సమస్య పరిష్కరించాను, అప్పటికి సాఫ్ట్వేర్ సమస్య పరిష్కారమైనా, వారికి ఉన్న కంప్యూటర్ అయిపోవడంతో, వారి అవసరాలను బట్టి కొత్త కంప్యూటర్ అవసరం ఉందని నాకు అర్థమై సోషల్ మీడియా వేదికగా కృష్ణ ప్రియ గారికి కంప్యూటరు డొనేషన్ కావాలని పోస్ట్ పెట్టాను.

తన అవసరాల కన్నా పక్క వారి గురించి ఆలోచించే కృష్ణ ప్రియ గారి మనసు చాలా పెద్దది. నేను వారికి కంప్యూటర్ కావాలని పెట్టిన పోస్టు చూసి నా ఇన్బాక్స్ లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు.

దాని సారాంశం: "ఒక దివ్యాంగుడు తన ఊర్లో పంచాయతీ ఆఫీస్ పక్కన xerox షాప్ పెట్టుకుని జీవనం సాగించాలని ప్రయత్నిస్తున్నారు. అతనికి కంప్యూటర్ లేదు. మీ పోస్టుకు స్పందించి ఎవరైనా ముందుకు వస్తే, దయచేసి కంప్యూటర్ ముందుగా వారికి ఇవ్వండి. నాకు పాత కంప్యూటర్‌ ఉన్నా సరిపోతుంది, కానీ వారికి అది కూడా లేదని చెప్పారు" ఆ మెసేజ్ చూసి నా గుండె బరువెక్కింది,

ఇది కాక ఆ పోస్ట్ చూసి నాకు ఇన్బాక్స్ లో మొదటి తరం కాలేజీ కి వెళ్తున్న కొందరు నిరుపేద స్టూడెంట్స్ తమ చదువుకి computers తప్పనిసరి మాకు కూడా ధాతల నుంచి computers కావాలని అభ్యర్ధన చేశారు.

కంప్యూటర్ల కొరకు నేను పెట్టిన పోస్ట్ చూసి ఇమ్రాన్ గారు మింట్ కండిషన్‌లో ఉన్న LED స్క్రీన్, మౌస్, కీబోర్డ్ పంపించారు. విగ్నేష్ గారు పాత i7 ల్యాప్‌టాప్‌ని అప్గ్రేడ్ చేసి ఇచ్చారు. (వీరు తమ పేర్లను టాగ్ చేయొద్దని కోరారు, కాబట్టి పూర్తి పేర్లు వ్రాయడం లేదు.) ఈరోజు వారి ఆద్య నిలయం నందు Laptop & LED Display అందించాను.

కొందరు పాత కంప్యూటర్లు ఇస్తామన్నారు, కానీ వాటి వల్ల ముందు ముందు రిపేర్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు కాబట్టి, వాటిని తిరస్కరించాల్సి వచ్చింది. మరికొందరు సమయం తీసుకుని కొత్త కంప్యూటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

మనకు అన్ని సౌకర్యాలుండి కూడా ఎన్ని ఇబ్బందులు పడతామో తెలుసు. కానీ 50 నుంచి 90 శాతం వికలాంగులు రోజువారీ జీవనం కోసం ఇంకా ఎన్ని కష్టాలు పడుతారో ఆలోచించండి. చిన్న సహాయం కూడా వారికి ఎంతో ఆత్మగౌరవంతో జీవించడానికి దోహదం చేస్తుంది.

ఈ విన్నపానికి స్పందించిన ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏

మీకు ఉపయోగంలో లేని పాత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే, కృష్ణ ప్రియ గారికి డొనేషన్‌గా ఇవ్వాలని మనస్పూర్తిగా అభ్యర్థిస్తు...
22/09/2024

మీకు ఉపయోగంలో లేని పాత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే, కృష్ణ ప్రియ గారికి డొనేషన్‌గా ఇవ్వాలని మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నాం. 🙏💻

రెండు రోజుల క్రితం "కంప్యూటర్ సాఫ్ట్వేర్" ఇన్‌స్టాలేషన్ కోసం సిస్టమ్ ఇంజనీర్ కావాలని కృష్ణ ప్రియ గారి పోస్ట్ చూసిన తర్వాత, వారి ఇంటికి వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేశాను. ప్రస్తుతానికి ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ, ఆ కంప్యూటర్ చాలా పాతది, డిస్ప్లే గీతలు పడి పాడయింది. 😕

ఇటీవలే ప్రసాద్ చరసాల గారు కృష్ణ ప్రియ గారికి కొత్త ప్రింటర్ డొనేషన్‌గా ఇచ్చారు కానీ, ఇప్పటికీ వారు చాలా పాత కంప్యూటర్‌ వాడుతూ, దాని ద్వారా డిటిపి (DTP) పనులు చేసుకుంటూ తన జీవనోపాధిని పొందుతున్నారు. ఒక మంచి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే, అది ఆమెకు స్వయం సమర్థతతో మరింత ఆత్మగౌరవంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. 💪🖥️

కృష్ణప్రియ గారు శారీరక దివ్యాంగులై ఉండి, "ఆద్య హోమ్" పేరుతో హైదరాబాద్‌లోని చెంగిచెర్ల లో అద్దె ఇంట్లో దివ్యాంగుల కోసం ఒక ఆశ్రమం నడుపుతున్నారు. అక్కడ దివ్యాంగుల వివాహాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆమె ఒక యాక్టివిస్ట్ గానూ సేవలందిస్తున్నారు. 🏠💒

కాబట్టి, మీ వద్ద 5 సంవత్సరాల కంటే పాతది కాని కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే దయచేసి విరాళంగా ఇవ్వండి. అందుబాటులో ఉన్నవారు తార్నాక లో ఉన్న నా ఆఫీసుకు పంపవచ్చు లేదా మీ హైదరాబాద్ అడ్రస్ షేర్ చేస్తే నేను స్వయంగా వచ్చి తీసుకుంటాను. మీరు అందించే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ను శుభ్రపరచి, అవసరమైన సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసి కృష్ణ ప్రియ గారికి అందిస్తాను. 😊💻

ఒకటి కన్నా ఎక్కువ ఎవరైనా డొనేషన్ ఇస్తే, వాటిని ద్వారా విద్యార్థులు, వారి విద్య కోసం ల్యాప్‌టాప్‌లు డొనేట్ చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ల్యాప్‌టాప్‌లను వారి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. 🎓💻

విజయ్ వంగలపూడి
సామాజిక కార్యకర్త
PH: 9492739099

కృష్ణ ప్రియ గారి ఫోన్
PH: 8341913891

"మనిషి మనిషిగా ఎదగాలంటే మత ధర్మాలు, అంధ విశ్వాసాలు, కులాల కంకణాలు తొలగించుకోవాలి."  - పెరియార్ రామస్వామి
17/09/2024

"మనిషి మనిషిగా ఎదగాలంటే మత ధర్మాలు, అంధ విశ్వాసాలు, కులాల కంకణాలు తొలగించుకోవాలి." - పెరియార్ రామస్వామి

దళిత మహాసభ: ఆత్మగౌరవం కోసం ప్రారంభమైన పోరాటం🌿 “దళిత మహాసభ” భారతదేశంలో దళితుల హక్కుల కోసం కొనసాగిన అతి శక్తివంతమైన ఉద్యమా...
07/09/2024

దళిత మహాసభ: ఆత్మగౌరవం కోసం ప్రారంభమైన పోరాటం

🌿 “దళిత మహాసభ” భారతదేశంలో దళితుల హక్కుల కోసం కొనసాగిన అతి శక్తివంతమైన ఉద్యమాలలో ఒకటి. కరంచేడు మారణకాండతో ప్రారంభమైన ఈ ఉద్యమం, దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సాగిన నిరంతర పోరాటానికి ప్రతీకగా నిలిచింది. Dr కత్తి పద్మారావు వంటి దళిత హక్కుల కోసం అంకితమై పనిచేసిన నాయకుల నాయకత్వంలో “దళిత మహాసభ” ఆవిర్భవించింది, ఇది దళితుల ఆత్మగౌరవం మరియు సమానత్వం కోసం పోరాటంలో కీలకంగా మారింది.

🌿 కారంచేడు మారణకాండ - 1985
కారంచేడు (జూలై 17, 1985) సంఘటన దళిత చరిత్రలో మరచిపోలేని ఘోరం. కమ్మ కులానికి చెందిన హంతకులు, మాదిగలపై అమానుష దాడులు జరిపి, ఆరు మందిని హత్య చేశారు. మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. ఈ ఘోరమైన ఘటన దళితులకు పెద్దగా న్యాయం లభించలేదు. ఈ సంఘటన తర్వాత, కత్తి పద్మారావు దళితులపై కొనసాగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా “దళిత మహాసభ”ను స్థాపించారు. దళిత మహాసభ ఏర్పడిన తరువాత, దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా అనేక నిరసనలు, ధర్నాలు చేపట్టింది.

🌿 చుండూరు మారణకాండ - 1991
1991 ఆగష్టు 6న రెడ్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది మాలలు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ద్వారా “దళిత మహాసభ” జాతీయ స్థాయిలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈ మారణఖాండ తర్వాత "దళిత మహాసభ" పోరాటం ద్వారా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారించారు.
చుండూరు ఘటనపై కేసులు కోర్టులలో నడిచినా, దళితులకు పూర్తిస్థాయిలో న్యాయం పొందడానికి చాలా సమయం పట్టింది.

🌿 దళిత హక్కుల కోసం మహాసభ పోరాటాలు
దళిత మహాసభ దళితుల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల్లో గణనీయమైనది. Dr కత్తి పద్మారావు నాయకత్వంలో దళిత మహాసభ ఆత్మగౌరవం, భూమి హక్కులు, మరియు దళితుల సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేసింది. ఇది కేవలం సామాజిక స్థాయిలోనే కాక, రాజకీయ రంగంలో కూడా దళితుల ప్రాతినిధ్యాన్ని పెంపొందించేలా మారింది. ఈ ఉద్యమం దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, మరియు ఆర్థిక దోపిడీలను ఎదుర్కొనే కీలక శక్తిగా మారింది.

🌿 భారత రాజ్యాంగం మరియు దళిత చట్టాలు
దళిత మహాసభ పోరాటం కారణంగా 1989లో ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం (SC/ST Prevention of Atrocities Act) అమల్లోకి వచ్చింది. ఈ చట్టం దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొనే మార్గాన్ని సుగమం చేసింది. ఈ చట్టం ద్వారా దళితులు కేవలం బాధితులుగా మాత్రమే కాకుండా, సంఘంలో న్యాయమైన హక్కులను సాధించేందుకు అవకాశం పొందారు.

🌿 కోర్టు కేసులు మరియు న్యాయం కోసం పోరాటం
దళిత మహాసభ ఎన్నో కోర్టు కేసుల ద్వారా దళితులకు న్యాయం పొందడానికి కృషి చేసింది. ముఖ్యంగా కారంచేడు, చుండూరు వంటి మారణఖండాల కేసులు కోర్టుల్లో నడవగా, ఈ ఘటనల్లో బాధితుల తరఫున దళిత మహాసభ పోరాటం చేసింది. సుప్రీం కోర్టు నుండి కొన్ని కేసుల్లో కీలక తీర్పులు వెలువడినా, మరికొన్ని తీర్పులు తగిన విధంగా రాలేదు. ఈ కేసులు దళిత ఉద్యమాలకు న్యాయపరంగా బలం చేకూర్చాయి, కానీ న్యాయం పొందడానికి దళితులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

🌿 దళిత మహాసభ దళిత ఉద్యమాలకు ఒక మార్గదర్శకశక్తిగా నిలిచి, ఆత్మగౌరవం కోసం, విద్య, భూమి, రాజకీయాలు వంటి రంగాల్లో దళితులు ముందడుగు వేయడానికి మార్గం చూపింది. దళిత సమాజం ఆర్థిక స్వాతంత్రం, విద్యా అవకాశాలు పొందడానికి ఈ ఉద్యమం ప్రేరణగా నిలిచింది. ఈ పోరాటం ద్వారా దళితులు తమ హక్కులను చట్టపరంగా సాధించేందుకు శక్తి పొందారు.

🌿 చివరిగా: “దళిత మహాసభ” కేవలం ఒక చరిత్ర కాదు, దళిత ఉద్యమాలకు బలమైన పునాది, అది ఒక శక్తి. కత్తి పద్మారావు నాయకత్వంలో ఈ ఉద్యమం, దళితుల హక్కుల సాధనలో మార్గదర్శకంగా నిలిచి, న్యాయం కోసం సాగిన అణచలేని పోరాటంగా మిగిలింది. ఈ ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, దళితుల ఆత్మగౌరవం మరియు సమానత్వం కోసం నిత్యం ప్రజలకు ప్రేరణనిచ్చింది. 🌿

నోట్: ఈ వ్యాసానికి కారణం కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

సామాజిక ఉద్యమాభివందనాలు
విజయ్ వంగలపూడి - మానవ హక్కుల కార్యకర్త
జాన్ పేట - కైకలూరు
- Director - ProjectNAVAYAN
- Tech Support Engineer

కుల, మతాలకు అతీతంగా మనసున్న మారాజులు ఈ సమయంలో భాదితులకు కావాల్సిన సహాయాన్ని అందిస్తుంటే, కులాల మద్య చిచ్చు పెట్టడానికి మ...
06/09/2024

కుల, మతాలకు అతీతంగా మనసున్న మారాజులు ఈ సమయంలో భాదితులకు కావాల్సిన సహాయాన్ని అందిస్తుంటే, కులాల మద్య చిచ్చు పెట్టడానికి ముందుండే వర్గాలు - వర్షం ఆగే సమయానికి ఎందుకూ పనికి రాని పూజల్లో మునిగితేలుతున్నారు.

వాస్తు అబద్దం, దేవుడు ఊహ, ప్రకృతి నిజం...
06/09/2024

వాస్తు అబద్దం, దేవుడు ఊహ, ప్రకృతి నిజం...

SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల  #మానవ_హక్కులకు సంబంధించిన అంశం. 🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర...
01/09/2024

SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల #మానవ_హక్కులకు సంబంధించిన అంశం.

🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర్వేషన్ల గురించి స్పష్టమైన అవగాహన లేని ఎస్సీ కులాలు వేలల్లో ఉన్నాయి. కేవలం కొన్ని ఎస్సీ కులాలు మాత్రమే తిరిగి తిరిగి రిజర్వేషన్ల లాభాలు పొందుతుండటంతో, అందరికీ సమానంగా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని ఈ తీర్పు ఇచ్చింది.

🎉 ఈ తీర్పు మాదిగ ఉపకులాల హక్కుల కోసం 30 సంవత్సరాలుగా పోరాడిన #మందకృష్ణ_మాదిగ గారి సుదీర్ఘ కృషి ఫలితం #మేమెంతో_మాకంత అనే నినాదంతో ప్రారంభమైన #మాదిగ_దండోరా ఉద్యమ విజయం.

🐘 ఈ తీర్పును నార్త్ లో వ్యతిరేకిస్తుంది మాదిగ సమాంతర కులం అయిన చమార్లు అయితే సౌత్ లో వ్యతిరేకిస్తుంది కొందరు మాలలు. ఇద్దరూ వ్యతిరేకిస్తుంది ఒకటే కారణం - ఇప్పటి వరకు తమ జనాభా కన్నా వారు ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందడమే.

🪜 నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో దళితులు అడుగున ఉంటే వారిలో కొన్ని ఉప కులాలు ఈ సమాజానికి అందనంత దిగువున ఉన్నాయి, దళితుల్లో కుడా పైకులానికి ఊడిగం చేస్తూ కింద కులాన్ని నిర్దయగా తొక్కేసే మనువాద భావజాలం బలంగా వుంది. ఇక్కడ ఒకటి స్పష్టం ఏ రెండు కులాలు ఒకటి కాదు, కొన్ని అంశాల్లో కలసి పని చేసినా మెజారిటీ అంశాల్లో అనేక అంతరాలు వున్నాయి. ముందుగా దళితుల్లో ఈ కుల భావన పోకుండా కలసి పోరాటం చేయడం రాజ్యాదికారం వైపు ప్రయాణం చేయడం అసాద్యం, ఈ భావన వదలకపోతే కుల వివిక్షలో భాగంగా మిగిలిపోవడం ఖాయం.

✨ ఈ సందర్భంగా అన్ని వర్గాలు సమన్వయం పాటిస్తూనే, రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కేలా ఆయా కులాల నాయకులు ప్రణాళికలు వేయాల్సిన సమయమిది.

✅ రిజర్వేషన్స్ వున్నాయి కానీ వాటిని పొందే విద్యావంతులు ఆయా కులాల్ల్లో వున్నారా?

ఆయా సమూహాల్ల్లో రిజర్వేషన్ ఫలాలు పొందటానికి ఆవసరమైన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ సహకారంతో మారుమూల గ్రామాల్లో కుడా ఆధునిక లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ( - Human Rights Initiative ద్వారా ప్రతి వెనకబడిన గ్రామాల్లో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి కృషి చేస్తున్నాం )

✅ #కుల_గణన: ఈ దేశంలో ప్రతి విషయంలో కుల అడ్డొస్తుంది, మన సమాజంలో బలంగా పాతుకుపోయింది అనే విషయాన్ని గుర్తించాలి. "మేమెంతో మాకంత" లెక్క తేలాలి అంటే దేశంలో కుల గణన జరగాలి. ప్రతి పది సంవత్సరాలకు జన గణన జరుగుతుంది కానీ కుల గణన జరగడం లేదు. వాటి ఆధారంగా రిజర్వేషన్స్ అమలు కావాలి. కుల గణన జరిగేలా ప్రభుత్వం పైన వత్తిడి తేవాలి.

✅ #ప్రైవేటు_రిజర్వేషన్స్ : ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అనేక సంస్థలు క్రమంగా ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రైవేటీకరణకు గురవుతున్న ప్రభుత్వ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం చాలా కీలకం. రిజర్వేషన్లు సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకు సహాయపడే ముఖ్యమైన సాధనాలు. ఇవి వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా, వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికే ఉద్దేశించబడ్డాయి. కనుక, ప్రైవేటీకరణ జరుగుతున్నా కూడా, ఈ రిజర్వేషన్ల ప్రాధాన్యతను కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అందించేందుకు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ విధంగా, సమాజంలోని ప్రతి వర్గం ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రిజర్వేషన్స్ కొరకు ప్రభుత్వాల మీద వత్తిడి తేవాలి.

✅ #కుల_నిర్మూలన: సమాజంలో ఉన్న కులపరమైన వివక్షలను, అసమానతలను పూర్తిగా తొలగించాలంటే కుల నిర్మూలన అత్యవసరం. కులవ్యవస్థ కారణంగా ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి, అవి సామాజిక అభివృద్ధికి పెద్ద అడ్డుకట్ట అవుతున్నాయి. కాబట్టి, కుల నిర్మూలనతో పాటు భూమిని జాతీయం చేసి భూసమానత్వాన్ని తీసుకురావడం ద్వారా కులపరమైన, ఆర్థికపరమైన వివక్షలను తొలగించవచ్చు.

✅ #రిజర్వేషన్స్_అంతం_కావాలి: కుల నిర్మూలన జరిగింది, భూమి జాతీయం అయింది, అందరికి సమాన హోదా వుంది, ఇక రిజర్వేషన్స్ తో పనేముంది? ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పునరాలోచించి, నిజమైన సమాన సమాజం కోసం వాటి రద్దును కూడా పరిగణించాలి. ఈ చర్యలన్నీ కలిపి ఒక సమానత్వ సమాజం నిర్మాణానికి దారితీస్తాయి.

🤝 గమనిక: ఈ తీర్పు పై నా అభిప్రాయాలను మరియు భవిష్యత్ కోసం నా అభిప్రాయాలను ఇక్కడ పంచుకున్నాను. భారతదేశంలో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి, సమాన హక్కులు మరియు అవకాశాలు ప్రతి వర్గానికి అందేలా చేయడానికి సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలు, మరియు న్యాయవ్యవస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని నేను భావిస్తున్నాను. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు, కుల గణన, మరియు సమాన విద్యా అవకాశాలు అందించడం వంటి అంశాలు ఎంతో కీలకం. కుల నిర్మూలన సాధించడంలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మన సమాజంలో సమానత్వం సాధించడానికి మనందరం కలసి కృషి చేయాలి.

సామాజిక ఉద్యమాభివందనాలు
విజయ్ వంగలపూడి - మానవ హక్కుల కార్యకర్త
- Director - ProjectNAVAYAN

పిక్ సందర్భం: వర్గీకరణ తీర్పు అనంతరం హైదరాబాద్ విజయోత్సవ ర్యాలి తర్వాత ప్రొఫెసర్ కాశిం అన్నగారితో కలసి మందకృష్ణ మాదిగ గారి నివాసంలో కలిసి అభినందించిన సందర్భంగా...

Address

1-431, John Peta, Atapaka
Kaikalur
521333

Alerts

Be the first to know and let us send you an email when Project Navayan - Human Rights Initiative posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Project Navayan - Human Rights Initiative:

Share