Ambedkar Knowledge Center

Ambedkar Knowledge Center Ambedkar Knowledge Center is committed to uplifting marginalized communities in India. Ambedkar and Gautama Buddha.

Ambedkar Knowledge Center (AKC) is an initiative by the Navayan Buddhist Society, dedicated to promoting education, empowerment, and equality for Dalit Bahujans. Our mission is to provide quality education, technical skills, and modern literacy to uplift marginalized communities. AKC envisions a society where education breaks the chains of discrimination and opens doors to brighter futures. Join us in our journey towards social justice, inspired by the teachings of Dr. B.R.

🌟 ప్రొఫెసర్ కుమార్ మోలుగారం గారికి ఓస్మానియా యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైనందుకు హృదయపూర్వక అభినందనలు! ...
24/10/2024

🌟 ప్రొఫెసర్ కుమార్ మోలుగారం గారికి ఓస్మానియా యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైనందుకు హృదయపూర్వక అభినందనలు! 🎉

🎓 స్టడీ అబ్రాడ్ (బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాల్లో విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేసే సంస్థ) కోర్ మెంబర్, యాక్టివిస్ట్, మరియు ఎన్‌ఆర్‌ఐ అయిన బిందు గొంగటి గారితో కలిసి ప్రొఫెసర్ కుమార్ గారిని కలుసుకుని అభినందించాము.

ప్రొఫెసర్ కుమార్ గారు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఓస్మానియా యూనివర్సిటీలో తొలి దళిత వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. విద్యా రంగంలో ఆయనకున్న అనుభవం, చక్కటి నాయకత్వం యూనివర్సిటీకి గణనీయమైన మార్పులను తీసుకురావడంలో సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాం.

ప్రాజెక్ట్ నావయాన్ - హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్‌ ద్వారా విజ్ఞాన కేంద్రాల నిర్మాణం, విద్యా కార్యక్రమాలు, అలాగే స్టడీ అబ్రాడ్ కార్యక్రమాలను ఓస్మానియా యూనివర్సిటీ విద్యా వాతావరణంతో కలిపి ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించాం.

Looking forward to contributing together towards a brighter and more inclusive educational future. 🌍📚

విజయ్ వంగలపూడి
ఫౌండర్ & డైరెక్టర్, ప్రాజెక్ట్ నవయాన్

Today, I had the privilege of meeting Telangana Deputy CM Batti Vikrama Garu along with an NRI friend who is actively in...
22/10/2024

Today, I had the privilege of meeting Telangana Deputy CM Batti Vikrama Garu along with an NRI friend who is actively involved in education initiatives for underprivileged communities. This meeting focused on an important educational program aimed at uplifting marginalized sections through education. 🌍📚

Together, we are taking steps towards a more inclusive and brighter future. 🙌✨

- Vijay Kumar Vangalapudi
Founder & Director, Project NAVAYAN

మీకు ఉపయోగంలో లేని పాత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే, కృష్ణ ప్రియ గారికి డొనేషన్‌గా ఇవ్వాలని మనస్పూర్తిగా అభ్యర్థిస్తు...
22/09/2024

మీకు ఉపయోగంలో లేని పాత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే, కృష్ణ ప్రియ గారికి డొనేషన్‌గా ఇవ్వాలని మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నాం. 🙏💻

రెండు రోజుల క్రితం "కంప్యూటర్ సాఫ్ట్వేర్" ఇన్‌స్టాలేషన్ కోసం సిస్టమ్ ఇంజనీర్ కావాలని కృష్ణ ప్రియ గారి పోస్ట్ చూసిన తర్వాత, వారి ఇంటికి వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేశాను. ప్రస్తుతానికి ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ, ఆ కంప్యూటర్ చాలా పాతది, డిస్ప్లే గీతలు పడి పాడయింది. 😕

ఇటీవలే ప్రసాద్ చరసాల గారు కృష్ణ ప్రియ గారికి కొత్త ప్రింటర్ డొనేషన్‌గా ఇచ్చారు కానీ, ఇప్పటికీ వారు చాలా పాత కంప్యూటర్‌ వాడుతూ, దాని ద్వారా డిటిపి (DTP) పనులు చేసుకుంటూ తన జీవనోపాధిని పొందుతున్నారు. ఒక మంచి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే, అది ఆమెకు స్వయం సమర్థతతో మరింత ఆత్మగౌరవంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. 💪🖥️

కృష్ణప్రియ గారు శారీరక దివ్యాంగులై ఉండి, "ఆద్య హోమ్" పేరుతో హైదరాబాద్‌లోని చెంగిచెర్ల లో అద్దె ఇంట్లో దివ్యాంగుల కోసం ఒక ఆశ్రమం నడుపుతున్నారు. అక్కడ దివ్యాంగుల వివాహాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆమె ఒక యాక్టివిస్ట్ గానూ సేవలందిస్తున్నారు. 🏠💒

కాబట్టి, మీ వద్ద 5 సంవత్సరాల కంటే పాతది కాని కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే దయచేసి విరాళంగా ఇవ్వండి. అందుబాటులో ఉన్నవారు తార్నాక లో ఉన్న నా ఆఫీసుకు పంపవచ్చు లేదా మీ హైదరాబాద్ అడ్రస్ షేర్ చేస్తే నేను స్వయంగా వచ్చి తీసుకుంటాను. మీరు అందించే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ను శుభ్రపరచి, అవసరమైన సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసి కృష్ణ ప్రియ గారికి అందిస్తాను. 😊💻

ఒకటి కన్నా ఎక్కువ ఎవరైనా డొనేషన్ ఇస్తే, వాటిని ద్వారా విద్యార్థులు, వారి విద్య కోసం ల్యాప్‌టాప్‌లు డొనేట్ చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ల్యాప్‌టాప్‌లను వారి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. 🎓💻

విజయ్ వంగలపూడి
సామాజిక కార్యకర్త
PH: 9492739099

కృష్ణ ప్రియ గారి ఫోన్
PH: 8341913891

"మనిషి మనిషిగా ఎదగాలంటే మత ధర్మాలు, అంధ విశ్వాసాలు, కులాల కంకణాలు తొలగించుకోవాలి."  - పెరియార్ రామస్వామి
17/09/2024

"మనిషి మనిషిగా ఎదగాలంటే మత ధర్మాలు, అంధ విశ్వాసాలు, కులాల కంకణాలు తొలగించుకోవాలి." - పెరియార్ రామస్వామి

దళిత మహాసభ: ఆత్మగౌరవం కోసం ప్రారంభమైన పోరాటం🌿 “దళిత మహాసభ” భారతదేశంలో దళితుల హక్కుల కోసం కొనసాగిన అతి శక్తివంతమైన ఉద్యమా...
07/09/2024

దళిత మహాసభ: ఆత్మగౌరవం కోసం ప్రారంభమైన పోరాటం

🌿 “దళిత మహాసభ” భారతదేశంలో దళితుల హక్కుల కోసం కొనసాగిన అతి శక్తివంతమైన ఉద్యమాలలో ఒకటి. కరంచేడు మారణకాండతో ప్రారంభమైన ఈ ఉద్యమం, దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సాగిన నిరంతర పోరాటానికి ప్రతీకగా నిలిచింది. Dr కత్తి పద్మారావు వంటి దళిత హక్కుల కోసం అంకితమై పనిచేసిన నాయకుల నాయకత్వంలో “దళిత మహాసభ” ఆవిర్భవించింది, ఇది దళితుల ఆత్మగౌరవం మరియు సమానత్వం కోసం పోరాటంలో కీలకంగా మారింది.

🌿 కారంచేడు మారణకాండ - 1985
కారంచేడు (జూలై 17, 1985) సంఘటన దళిత చరిత్రలో మరచిపోలేని ఘోరం. కమ్మ కులానికి చెందిన హంతకులు, మాదిగలపై అమానుష దాడులు జరిపి, ఆరు మందిని హత్య చేశారు. మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. ఈ ఘోరమైన ఘటన దళితులకు పెద్దగా న్యాయం లభించలేదు. ఈ సంఘటన తర్వాత, కత్తి పద్మారావు దళితులపై కొనసాగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా “దళిత మహాసభ”ను స్థాపించారు. దళిత మహాసభ ఏర్పడిన తరువాత, దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా అనేక నిరసనలు, ధర్నాలు చేపట్టింది.

🌿 చుండూరు మారణకాండ - 1991
1991 ఆగష్టు 6న రెడ్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది మాలలు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ద్వారా “దళిత మహాసభ” జాతీయ స్థాయిలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈ మారణఖాండ తర్వాత "దళిత మహాసభ" పోరాటం ద్వారా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారించారు.
చుండూరు ఘటనపై కేసులు కోర్టులలో నడిచినా, దళితులకు పూర్తిస్థాయిలో న్యాయం పొందడానికి చాలా సమయం పట్టింది.

🌿 దళిత హక్కుల కోసం మహాసభ పోరాటాలు
దళిత మహాసభ దళితుల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల్లో గణనీయమైనది. Dr కత్తి పద్మారావు నాయకత్వంలో దళిత మహాసభ ఆత్మగౌరవం, భూమి హక్కులు, మరియు దళితుల సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేసింది. ఇది కేవలం సామాజిక స్థాయిలోనే కాక, రాజకీయ రంగంలో కూడా దళితుల ప్రాతినిధ్యాన్ని పెంపొందించేలా మారింది. ఈ ఉద్యమం దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, మరియు ఆర్థిక దోపిడీలను ఎదుర్కొనే కీలక శక్తిగా మారింది.

🌿 భారత రాజ్యాంగం మరియు దళిత చట్టాలు
దళిత మహాసభ పోరాటం కారణంగా 1989లో ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం (SC/ST Prevention of Atrocities Act) అమల్లోకి వచ్చింది. ఈ చట్టం దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొనే మార్గాన్ని సుగమం చేసింది. ఈ చట్టం ద్వారా దళితులు కేవలం బాధితులుగా మాత్రమే కాకుండా, సంఘంలో న్యాయమైన హక్కులను సాధించేందుకు అవకాశం పొందారు.

🌿 కోర్టు కేసులు మరియు న్యాయం కోసం పోరాటం
దళిత మహాసభ ఎన్నో కోర్టు కేసుల ద్వారా దళితులకు న్యాయం పొందడానికి కృషి చేసింది. ముఖ్యంగా కారంచేడు, చుండూరు వంటి మారణఖండాల కేసులు కోర్టుల్లో నడవగా, ఈ ఘటనల్లో బాధితుల తరఫున దళిత మహాసభ పోరాటం చేసింది. సుప్రీం కోర్టు నుండి కొన్ని కేసుల్లో కీలక తీర్పులు వెలువడినా, మరికొన్ని తీర్పులు తగిన విధంగా రాలేదు. ఈ కేసులు దళిత ఉద్యమాలకు న్యాయపరంగా బలం చేకూర్చాయి, కానీ న్యాయం పొందడానికి దళితులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

🌿 దళిత మహాసభ దళిత ఉద్యమాలకు ఒక మార్గదర్శకశక్తిగా నిలిచి, ఆత్మగౌరవం కోసం, విద్య, భూమి, రాజకీయాలు వంటి రంగాల్లో దళితులు ముందడుగు వేయడానికి మార్గం చూపింది. దళిత సమాజం ఆర్థిక స్వాతంత్రం, విద్యా అవకాశాలు పొందడానికి ఈ ఉద్యమం ప్రేరణగా నిలిచింది. ఈ పోరాటం ద్వారా దళితులు తమ హక్కులను చట్టపరంగా సాధించేందుకు శక్తి పొందారు.

🌿 చివరిగా: “దళిత మహాసభ” కేవలం ఒక చరిత్ర కాదు, దళిత ఉద్యమాలకు బలమైన పునాది, అది ఒక శక్తి. కత్తి పద్మారావు నాయకత్వంలో ఈ ఉద్యమం, దళితుల హక్కుల సాధనలో మార్గదర్శకంగా నిలిచి, న్యాయం కోసం సాగిన అణచలేని పోరాటంగా మిగిలింది. ఈ ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, దళితుల ఆత్మగౌరవం మరియు సమానత్వం కోసం నిత్యం ప్రజలకు ప్రేరణనిచ్చింది. 🌿

నోట్: ఈ వ్యాసానికి కారణం కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

సామాజిక ఉద్యమాభివందనాలు
విజయ్ వంగలపూడి - మానవ హక్కుల కార్యకర్త
జాన్ పేట - కైకలూరు
- Director - ProjectNAVAYAN
- Tech Support Engineer

వాస్తు అబద్దం, దేవుడు ఊహ, ప్రకృతి నిజం...
06/09/2024

వాస్తు అబద్దం, దేవుడు ఊహ, ప్రకృతి నిజం...

SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల  #మానవ_హక్కులకు సంబంధించిన అంశం. 🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర...
01/09/2024

SC వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల #మానవ_హక్కులకు సంబంధించిన అంశం.

🏛️ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినా, ఇంకా రిజర్వేషన్ల గురించి స్పష్టమైన అవగాహన లేని ఎస్సీ కులాలు వేలల్లో ఉన్నాయి. కేవలం కొన్ని ఎస్సీ కులాలు మాత్రమే తిరిగి తిరిగి రిజర్వేషన్ల లాభాలు పొందుతుండటంతో, అందరికీ సమానంగా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని ఈ తీర్పు ఇచ్చింది.

🎉 ఈ తీర్పు మాదిగ ఉపకులాల హక్కుల కోసం 30 సంవత్సరాలుగా పోరాడిన #మందకృష్ణ_మాదిగ గారి సుదీర్ఘ కృషి ఫలితం #మేమెంతో_మాకంత అనే నినాదంతో ప్రారంభమైన #మాదిగ_దండోరా ఉద్యమ విజయం.

🐘 ఈ తీర్పును నార్త్ లో వ్యతిరేకిస్తుంది మాదిగ సమాంతర కులం అయిన చమార్లు అయితే సౌత్ లో వ్యతిరేకిస్తుంది కొందరు మాలలు. ఇద్దరూ వ్యతిరేకిస్తుంది ఒకటే కారణం - ఇప్పటి వరకు తమ జనాభా కన్నా వారు ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందడమే.

🪜 నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో దళితులు అడుగున ఉంటే వారిలో కొన్ని ఉప కులాలు ఈ సమాజానికి అందనంత దిగువున ఉన్నాయి, దళితుల్లో కుడా పైకులానికి ఊడిగం చేస్తూ కింద కులాన్ని నిర్దయగా తొక్కేసే మనువాద భావజాలం బలంగా వుంది. ఇక్కడ ఒకటి స్పష్టం ఏ రెండు కులాలు ఒకటి కాదు, కొన్ని అంశాల్లో కలసి పని చేసినా మెజారిటీ అంశాల్లో అనేక అంతరాలు వున్నాయి. ముందుగా దళితుల్లో ఈ కుల భావన పోకుండా కలసి పోరాటం చేయడం రాజ్యాదికారం వైపు ప్రయాణం చేయడం అసాద్యం, ఈ భావన వదలకపోతే కుల వివిక్షలో భాగంగా మిగిలిపోవడం ఖాయం.

✨ ఈ సందర్భంగా అన్ని వర్గాలు సమన్వయం పాటిస్తూనే, రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కేలా ఆయా కులాల నాయకులు ప్రణాళికలు వేయాల్సిన సమయమిది.

✅ రిజర్వేషన్స్ వున్నాయి కానీ వాటిని పొందే విద్యావంతులు ఆయా కులాల్ల్లో వున్నారా?

ఆయా సమూహాల్ల్లో రిజర్వేషన్ ఫలాలు పొందటానికి ఆవసరమైన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ సహకారంతో మారుమూల గ్రామాల్లో కుడా ఆధునిక లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ( - Human Rights Initiative ద్వారా ప్రతి వెనకబడిన గ్రామాల్లో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటుకి కృషి చేస్తున్నాం )

✅ #కుల_గణన: ఈ దేశంలో ప్రతి విషయంలో కుల అడ్డొస్తుంది, మన సమాజంలో బలంగా పాతుకుపోయింది అనే విషయాన్ని గుర్తించాలి. "మేమెంతో మాకంత" లెక్క తేలాలి అంటే దేశంలో కుల గణన జరగాలి. ప్రతి పది సంవత్సరాలకు జన గణన జరుగుతుంది కానీ కుల గణన జరగడం లేదు. వాటి ఆధారంగా రిజర్వేషన్స్ అమలు కావాలి. కుల గణన జరిగేలా ప్రభుత్వం పైన వత్తిడి తేవాలి.

✅ #ప్రైవేటు_రిజర్వేషన్స్ : ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అనేక సంస్థలు క్రమంగా ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రైవేటీకరణకు గురవుతున్న ప్రభుత్వ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం చాలా కీలకం. రిజర్వేషన్లు సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకు సహాయపడే ముఖ్యమైన సాధనాలు. ఇవి వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా, వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికే ఉద్దేశించబడ్డాయి. కనుక, ప్రైవేటీకరణ జరుగుతున్నా కూడా, ఈ రిజర్వేషన్ల ప్రాధాన్యతను కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అందించేందుకు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ విధంగా, సమాజంలోని ప్రతి వర్గం ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రిజర్వేషన్స్ కొరకు ప్రభుత్వాల మీద వత్తిడి తేవాలి.

✅ #కుల_నిర్మూలన: సమాజంలో ఉన్న కులపరమైన వివక్షలను, అసమానతలను పూర్తిగా తొలగించాలంటే కుల నిర్మూలన అత్యవసరం. కులవ్యవస్థ కారణంగా ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి, అవి సామాజిక అభివృద్ధికి పెద్ద అడ్డుకట్ట అవుతున్నాయి. కాబట్టి, కుల నిర్మూలనతో పాటు భూమిని జాతీయం చేసి భూసమానత్వాన్ని తీసుకురావడం ద్వారా కులపరమైన, ఆర్థికపరమైన వివక్షలను తొలగించవచ్చు.

✅ #రిజర్వేషన్స్_అంతం_కావాలి: కుల నిర్మూలన జరిగింది, భూమి జాతీయం అయింది, అందరికి సమాన హోదా వుంది, ఇక రిజర్వేషన్స్ తో పనేముంది? ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పునరాలోచించి, నిజమైన సమాన సమాజం కోసం వాటి రద్దును కూడా పరిగణించాలి. ఈ చర్యలన్నీ కలిపి ఒక సమానత్వ సమాజం నిర్మాణానికి దారితీస్తాయి.

🤝 గమనిక: ఈ తీర్పు పై నా అభిప్రాయాలను మరియు భవిష్యత్ కోసం నా అభిప్రాయాలను ఇక్కడ పంచుకున్నాను. భారతదేశంలో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి, సమాన హక్కులు మరియు అవకాశాలు ప్రతి వర్గానికి అందేలా చేయడానికి సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలు, మరియు న్యాయవ్యవస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని నేను భావిస్తున్నాను. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు, కుల గణన, మరియు సమాన విద్యా అవకాశాలు అందించడం వంటి అంశాలు ఎంతో కీలకం. కుల నిర్మూలన సాధించడంలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మన సమాజంలో సమానత్వం సాధించడానికి మనందరం కలసి కృషి చేయాలి.

సామాజిక ఉద్యమాభివందనాలు
విజయ్ వంగలపూడి - మానవ హక్కుల కార్యకర్త
- Director - ProjectNAVAYAN

పిక్ సందర్భం: వర్గీకరణ తీర్పు అనంతరం హైదరాబాద్ విజయోత్సవ ర్యాలి తర్వాత ప్రొఫెసర్ కాశిం అన్నగారితో కలసి మందకృష్ణ మాదిగ గారి నివాసంలో కలిసి అభినందించిన సందర్భంగా...

వర్గీకరణ విజయ సారది మంద కృష్ణ మాదిగ అన్న గారు హైదరాబాద్ MRPS కార్యాలయం నందు జాతీయ జెండా  ఎగురవేసిన అనంతరం దళిత ఉద్యమ సహచ...
15/08/2024

వర్గీకరణ విజయ సారది మంద కృష్ణ మాదిగ అన్న గారు హైదరాబాద్ MRPS కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దళిత ఉద్యమ సహచరుడు, ఆప్త మిత్రుడు జయ కుమార్ తో కలిసి ఫోటో దిగిన సందర్భం..

12/08/2024

30 సంవత్సరాల  వర్గీకరణ ఉద్యమ పోరాటానికి ఫలితం దక్కిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నగారికి ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయ...
01/08/2024

30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమ పోరాటానికి ఫలితం దక్కిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నగారికి ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకుడు ఉద్యమ సహచరుడు శరత్ చమార్ సోదరుని ఆధ్వర్యంలో చారిత్రక ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో వేడుకలు.

మీ
విజయ్ వంగలపూడి.
మానవ హక్కుల కార్యకర్త

ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్, విప్లవకవి, సాహిత్య విమర్శకులు చింతకింది కాశీం గారిని కలిసే అవకాశం లభించింది. ప్ర...
26/07/2024

ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్, విప్లవకవి, సాహిత్య విమర్శకులు చింతకింది కాశీం గారిని కలిసే అవకాశం లభించింది. ప్రాజెక్ట్ నవయాన్ ద్వారా నిర్మాణం అవుతున్న కమ్యూనిటీ వెబ్సైటు గురించి వివరించి, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం బ్రోచర్ అందించి, కమ్యూనిటీ సలహాదారుల మండలి సభ్యులుగా చేరాలని ఆహ్వానించాను.

ఆహ్వానాన్ని స్వీకరించి కమ్యూనిటీ వెబ్సైట్ సలహాదారుల సభ్యునిగా చేరి ఉద్యమానికి మద్దతు తెలిపారు.

ప్రొఫెసర్ కాశీం గారు మన సమాజానికి, సాహిత్యానికి చేసిన సేవలు మాకు ఎంతో ప్రేరణ. ఆయన మద్దతుతో, ప్రాజెక్ట్ నవయాన్ మరింత బలంగా ముందుకు సాగుతుంది.

ధన్యవాదాలు 🙏

How jagan revolutionized PDS (Public Distribution System):✍️ Mohan Talari***మీరు పుట్టిన ఊరుకి అంటే అమ్మమ్మ లేదా నానమ్మ ...
03/06/2024

How jagan revolutionized PDS (Public Distribution System):
✍️ Mohan Talari
***
మీరు పుట్టిన ఊరుకి అంటే అమ్మమ్మ లేదా నానమ్మ ల ఊళ్ళకి దూరంగా ఉంటూ ఎప్పుడన్నా వేసవి కాలం వాళ్ళ ఇళ్లకు వెళితే , మీకు కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు కనబడుతూ ఉండేవి కొన్ని సంవత్సారల క్రితం.

ఎవరిదైనా కొంచెం పెద్ద ఇంటి అరుగు మీద ఆడవాళ్ళు , కొంచెం ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు చేట లో బియ్యం పోసుకుని చెరుగుతూ, ఏరుతూ ఉండే వాళ్ళు . ఏమి ఏరేసే వాళ్ళు ఆ బియ్యం లో నుంచి
రాళ్ళు , చిన్న చిన్న పెంకులు( Inorganic matter)
వడ్లు (Organic matter)
మాడు గింజలు(Damaged grains)
బాగా పాయ పడిన లేదా పసుపు రంగుకి మారిన గింజలు(Discoloured grains)
కుదిరిన మేర నూకలు(Broken Rice)
నిజానికి government రేషన్ ద్వారా సప్లయ్ చేసిన బియ్యాన్ని ఇలా ఏరుకుని తినవలసిన అవసరం ప్రజలకు ఉండకూడదు. నేరుగా తినేయగలగాలి.
ఎప్పుడు ?
ఆ బియ్యం నాణ్యత FSSAI(FOOD SAFETY AND STANDARDS AUTHORITY OF INDIA) ని అనుసరించి ఉన్నప్పుడు. ఏమిటా నాణ్యతా ప్రమాణాలు ఒకసారి చూద్దాం. ఈ బియ్యం కొనుగోళ్ల సంగతి ఎప్పటి నుంచో చూసుకుంటున్నది FOOD COROPRATION OF INDIA. తెలుగులో భారత ఆహార సంస్థ.

భారత ప్రభుత్వ ఆహార సంస్థ (FCI) కి బియ్యాన్ని డెలివర్ చేసే మిల్లర్, ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.
అతను డెలివర్ చేసే బియ్యంలో నూకలు 25% , damaged grains 3% , discolored grains 3% , Inorganic and organic foreign matter రెండూ కలిపి 1% దాటి ఉండకూడదు. అంతకు మించి ఏ ఒక్కటి 0.1 % దాటి ఉన్నా భారత ఆహార సంస్థ తాలూకూ క్వాలిటి చెకింగ్ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేస్తారు.

ఈ నంబర్స్ కి ఎలా arrive అయ్యారు అంటే , చాలా మంది పెద్ద పెద్ద సైంటిస్ట్స్ రీసెర్చ్ చేసి ఈ ఈ శాతం వరకూ పైన చెప్పిన నూకలు వగైరా బియ్యంలో కలిసి ఉన్నా, అటువంటి బియ్యాన్ని వండుకు తిన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు అని, Cooking quality కి ఇబ్బంది ఉండదు అని నిర్ణయించారు. ఉదాహరణకు, నూకలు అంతకు మించి అంటే ముప్పై శాతం దాటి ఉన్నాయి అనుకోండి అన్నం మొత్తం గంజి అయిపోతుంది. డామేజ్ గింజలు 5% దాటి ఉన్నాయి అనుకోండి అటువంటి అన్నం కడుపు నొప్పికి దారి తీస్తుంది. పాయ పడిన గింజ వల్ల ఎటువంటి నష్టం లేకపోయినా, బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉండవు . చూడడానికి కూడా బాగోదు.
*****
సరే ఒకసారి ఇప్పుడు మనం అంబేద్కర్ గారిని తలుచుకుందాం .
భారతీయులని అంబేద్కర్ గారు చెడ్డవాళ్ళు(bad people) అనలేదు . నీచులు(mean people) అన్నాడు. కావాలంటే ఆయన కులనిర్మూలన పుస్తకం చదువుకోండి అందులో ఉంటుంది.

అలా ఆయన ఎందుకు అన్నాడో ఇప్పుడు నేను కింద రాసింది చదివాక మీకు అర్ధం అవుతుంది.

అభివృద్ధి చెందిన దేశాలన్నిటినీ ఒకసారి చూడండి. Food అనేదాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. దేన్ని అయినా భరిస్తారు గానీ food adulteration(ఆహారంలో కల్తీ) ని పొరపాటున కూడా భరించరు . ఎవరైనా చేస్తే భారీగా జరిమానాలు శిక్షలు ఉంటాయి.
కానీ మనం అలా కాదు. నీచులం కదా. జనాల నోట్లోకి పోయే తిండి అన్న సోయ కూడా మనవాళ్లకు ఉండదు.
చదవండి నీరసపడకండి. చచ్చిపోయే ముందు కొన్ని ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి.

2014 లో మోడీ ప్రభుత్వం రాక ముందు చాలా రాష్ట్రాలలో ధాన్యం కొనుగోళ్లు, నిలువ, పంపకాలు అన్నీ భారత ఆహార సంస్థ ( FCI ) చూసుకునేది. అప్పుడు Mill Levy system ఉండేది. అంటే మిల్లుల ఓనర్లు వాళ్ళే పెట్టుబడి పెట్టి , ధాన్యం రైతుల నుండి కొనుక్కుని , ఆడించి ఆ వచ్చిన బియ్యాన్ని FCI కి డెలివరీ చేసేవాళ్ళు. FCI ఆ మిల్లర్లకు ఆ సంవత్సరం ఉన్న MSP(Minimum Support Price) ప్రకారం చెల్లింపులు చేసేది. (మిల్లర్లు మాత్రం ముష్టి రైతుల మొహం మీద పాడేసేవారు అది వేరే టాపిక్). FCI ఆ ధాన్యాన్ని తన దగ్గర నిలవ ఉంచి దేశం మొత్తం మీద ఎక్కడ ఏ రాష్ట్రానికి అవసరమైతే ఆ రాష్ట్రాలకు సరఫరా చేసేది రకరకాల సబ్సిడీ లు ఇస్తూ. ఆయా స్టేట్ గవర్నమెంట్ లు మళ్ళా కొంత భారం వాళ్ళ మీద పెట్టుకుని అతి తక్కువ ధరకి జనాలకు బియ్యం ఇచ్చేవి. అవే రెండు రూపాయల బియ్యం , రూపాయి బియ్యం. ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా service తో కూడుకున్నది కాబట్టి , గవర్నమెంట్స్ కి కొన్ని కోట్లు దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అందుకే ఎఫ్సిఐ ని white elephant అని అంటారు.
ఇక్కడే మీరు మన భారతీయుల meanness ఏమిటన్నది తెలుసుకోవాలి.
ఎడారిలో తైలం పిండే మన భారతీయులు ఈ మొత్తం బియ్యం సరఫరా ప్రాసెస్ లో దారుణమైన అక్రమాలకు తెగబడతారు. దందా ఒక దురాశ పరుడైన fci అధికారి దగ్గర మొదలవుతుంది. 25% లోపు ఉండవలసిన నూకలు దాటి ఉన్నాయి అనుకోండి. క్వాలిటి ఇన్స్పెక్టర్ దాన్ని రిజెక్ట్ చెయ్యాలి . కానీ చేయడు . మిల్లు ఓనర్ తో భేరం పెట్టుకుంటాడు. ఒక మూడు శాతం ఎక్కువ ఉన్నాయి అనుకోండి నూకలు, దానికి పాతిక నుండి ముప్పై వేలు భేరం పెట్టుకుంటాడు. సైలెంట్ గా గోడౌన్ లోకి పంపేస్తాడు . ofcourse పై అధికారుల inspections లో పట్టుబడితే తొక్క తీస్తారు. కానీ ఈ క్రిమినల్స్ కి దొరకకుండా ఏం చేయాలో తెలుసు.

ఇప్పుడు ఈ బియ్యాన్ని Andhra Pradesh state civil supplies వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం అంటే జనాలకు రేషన్ ఇవ్వడానికి FCI దగ్గర తీసుకుంటారు. Civil supplies వాళ్ళ godowns లోకి వెళ్ళిన తరువాత 28 % ఉన్న నూక 35 శాతానికి పెరుగుతుంది. 1 % ఉన్న రాళ్ళు పెంకులు 3 శాతానికి పెరుగుతాయి. తరువాత Civil supplies godown నుంచి ఏదో ఒక ఊరు రేషన్ షాపుకి ఈ బస్తాలు వెళతాయి. నాకు తెలిసినంత వరకు వెనుకటి రోజుల్లో రేషన్ షాపులు ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న కోమటోళ్ల కంట్రోల్ లో ఉండేవి. పైన అంతమంది తిన్నాక , ఈయన మాత్రం తినకుండా ఉంటాడా పాపం. ఆయన దగ్గర 35% నుంచి నూక 40 శాతానికి పెరుగుతుంది. రాళ్ళు రప్పలు ఇంకో శాతం పెరుగుతాయి. ఇది చాలదన్నట్టు తూకాలలో అవకతవకలు , కాటాలకు చింతపండు అంటించడాలు చాలా మామూలు విషయాలు. సో చివరికి జనాలకు ఏ క్వాలిటీ బియ్యం చేరుతున్నాయో అర్ధమైంది కదా. ఇదేంటి ఇలా ఉన్నాయి అని వాళ్ళు ప్రశ్నించరు అన్న ధైర్యమే ఈ పై వాళ్ళ అక్రమాలకు ఆయువు పట్టు.

2014 తరువాత Mill Levy system పోయింది. ఏ మాత్రం లాభం లేకపోగా బోలెడంత నష్టం తెచ్చి పెడుతున్న ఎఫ్సిఐ భారాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించుకోవాలని నిర్ణయించుకుని De centralization మొదలుపెట్టింది. అంటే ధాన్యాన్ని పండించే రాష్ట్రాలు వాటి కొనుగోళ్లు , అమ్మకాల సంగతి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి అని చెప్పింది. వాళ్ళు కొనగా కొనగా ఇంకా ఏదన్నా మిగిలిపోతే దాన్ని ఎఫ్సిఐ తీసుకుంటుంది. అంటే ఇప్పటి నుంచి భారత ఆహార సంస్థ ది ఒక పర్యవేక్షకుడి పాత్ర మాత్రమే.
ఈ క్రమంలో Mill Levy system స్థానే CMR(Custom Milled Rice) system వచ్చింది. ఈ పద్దతిలో ఏమిటంటే , మిల్లర్లు ధాన్యం కొనడానికి పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. మొత్తం ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి నేరుగా ప్రభుత్వమే కొంటుంది.( దీని వల్ల మధ్యలో ఉండే దళారి, లేదా మిల్లర్ రైతును మోసం చేసే అవకాశం కాస్త తగ్గుతుంది). ఆ ధాన్యాన్ని మిల్లర్ ఆడి వచ్చిన బియ్యాన్ని state civil supplies కి గానీ, వాళ్ళ పరిమితి దాటితే FCI కి గానీ ఇవ్వాలి. 2014 లో బాబు గారి ప్రభుత్వంలో కొత్తగా ఈ సిస్టమ్ మొదలయ్యాక జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పటి నుంచో ఆకలితో ఎదురు చూస్తున్న civil supplies వాళ్ళు దొరికిన కాడికి మేసేశారు . fci లో నేరం చేయడం అంత సులువు కాదు. బోలెడు inspections ఉంటాయి. కానీ civil supplies వాళ్ళను అడిగే వాడు లేడు. నూకలు మినిమం ముప్పై శాతం . డామేజ్ గింజలు అయిదు నుంచి ఏడు శాతం చొప్పున కొనేసి అవే జనాల మొహం మీద పాడేశారు. బియ్యం బదులు చాలా చోట్ల అచ్చంగా నూకల బస్తాలు కొనేశారు అన్న వార్తలు కూడా చెవుల పడ్డాయి. అవే జీవనాధారం అయిన వాళ్ళు తిన్నారు. తినలేని వాళ్ళు అమ్మేసుకున్నారు.

Rice Bowl of South India అయిన ఆంధ్రా లో పుట్టి ఆ వరి చేలల్లో పని చేసి పంటలు పండించిన పేదలకు నాణ్యమైన బియ్యం తినే దిక్కులేని పరిస్థితి కి పాలకులు దిగజార్చేశారు. ప్రభుత్వానికి ఇచ్చేదే ఎగుమతికి , ఓపెన్ మార్కెట్ కి పనికి రాని 1001 , 1016 లాంటి లావైన బియ్యం . అందులో కూడా మళ్ళా ఇన్ని రకాల కల్తీ. మోసం.
2019 లో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో నాణ్యమైన రేషన్ బియ్యం, అది కూడా సన్న బియ్యం ఇవ్వడం ఒకటి. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మిల్లర్స్ అందరికీ strict warnings ఇచ్చారు. ఎవరు తోక జాడించినా జీవితంలో మిల్ తెరవకుండా చేస్తామని హుకుం జారీ చేశారు. FSSA, FCI వాళ్ళ లిమిట్స్ కూడా కాదనుకుని కొత్తగా JAGAN LIMITS పెట్టారు.
కొత్తగా పెట్టిన లిమిట్స్ ప్రకారం నూకలు 15 % దాటి ఉండరాదు. డామేజ్ గింజలు 1% దాటి ఉండరాదు. Discolor గింజలు 1% దాటి ఉండరాదు. గత అయిదేళ్లుగా state civil supplies ఇవే లిమిట్స్ తో రైస్ procurement( కొనుగోళ్లు) చేస్తుంది. మనవాళ్ళ meanness(నీచత్వం) అంత త్వరగా పోయేది కాదు. ఇంకా అక్కడక్కడా కొంతమంది తోక జాడిస్తూనే ఉన్నారు. ఈసారి వచ్చాక అవన్నీ పూర్తిగా కత్తిరించబడతాయి.

రేషన్ షాపుల్లో చింతపండు వేషాలు వెయ్యకుండా, ఎండలో జనాన్ని లైన్లో నిలుచోబెట్టి ప్రభుత్వం ఇచ్చే దాన్ని వాడి ఇంటి సొమ్ము ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే వాళ్ళ మూతి మీద వాత పెట్టి బియ్యాన్ని నేరుగా ఇంటికే పంపించడం పేదవాడి కి ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని భావిస్తున్నాను నేనైతే. జనాల ముందే నిక్కచ్చిగా కొలిచి ఇస్తున్నారు . చెప్పండి ఇందుకు కాదూ ఈనాడు లక్షల ఆస్తి ఉన్నా తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కమ్మ , కాపు , బ్రాహ్మణ , రెడ్డి గార్ల ఇల్లాళ్ళు చక్కగా లైన్లో నిలబడి మరీ బియ్యం తీసుకుంటుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా వీళ్ళు రేషన్ షాపుల ముందు లైన్లలో నిలబడ్డారా?
బియ్యం ఇచ్చి సోమరి పోతుల్ని చేస్తున్నారు లాంటి అరమెదడు కామెంట్స్ తో రాకండి .

ఫైనల్ గా ఒక్క మాట.

వీటిని పేదల Vs పెత్తందార్ల ఎలక్షన్లు అని ఎందుకు అంటున్నారో ఇప్పటికీ మీకు అర్ధం కాకపోతే , అంత చింతపండు నవరంధ్రాలలో కుక్కుకుని ...... డి.

Address

1-431, Buddha Vihar, John Peta, Atapaka, Eluru District
Kaikalur
521333

Alerts

Be the first to know and let us send you an email when Ambedkar Knowledge Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ambedkar Knowledge Center:

Share