Ram Charan yuva foundation -RCYF

Ram Charan yuva foundation -RCYF The foundation make to service the poor people , blood arrangements for emergency cases etc......
RAM CHARAN YOUA FOUNDATION KADIRI.

అనంతపురం నందు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో మన రామ్ చరణ్ పౌండేషన్ తరఫున ...
03/11/2021

అనంతపురం నందు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో మన రామ్ చరణ్ పౌండేషన్ తరఫున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు, వృద్ధాశ్రమంలో మంచినీటి సమస్యను పరిష్కరించడం, మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా గురుకులం ఆవరణంలో మొక్కలు నాటడం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవి కుమార్ గారికి,వ్యవస్థాపకులు శ్రీ రవణం స్వామి నాయుడు గారికి,అధ్యక్షులు శ్రీ చింతామణి మహేష్ గారికి మరియు, సభ్యులకు రాంచరణ్ యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ కడప సుధాకర్ రెడ్డి గారు మరియు కదిరి అధ్యక్షులు చేసినటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.
ఇట్లు,
RC యువ ఫౌండేషన్,
ధర్మవరం,కదిరి.

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50 వ పుట్టిన రోజు సందర్భంగా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు Jsp All నియోజక వర...
01/09/2021

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50 వ పుట్టిన రోజు సందర్భంగా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు Jsp All నియోజక వర్గం టీమ్,రామ్ చరణ్ యువ ఫౌండేషన్,విద్యార్థి విభాగం వారు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో జన సైనికులు,కార్యకర్తలు,మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొని విజయవంతం చెయ్యడం జరిగింది. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి,రక్తదానం గురించి కదిరి సూపరిడెంట్ Dr. టిప్పెంద్ర నాయక్ సార్ గారు ,బ్లడ్ బ్యాంక్ ఇంచార్జీ శ్రీ వహీదా మేడం గారు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సమాజ సేవలగురించి ప్రస్తావిస్తూ, బ్లడ్ బ్యాంక్ నందు ఉత్తమమైన సేవల అందించిన శ్రీ స్వర్ణలత గారిని సభ్యుల సమక్షంలో సన్మానించడం జరిగింది.
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
జై జన సేన 🔯
జై పవన్ కళ్యాణ్ గారు ✊

మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా మన కదిరి నియోజకవర్గం జనసైనికుల ఆద్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు ...
31/08/2021

మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా మన కదిరి నియోజకవర్గం జనసైనికుల ఆద్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది.
ఈ మహా రక్తదానం లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ రేపు ఉదయం మన కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు కల కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశం జరుగుతుంది.కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు అయ్యి రక్తదానం చెయ్యాలని కోరుకుంటున్నాము.
🩸🩸 రక్తదానం - మహా దానం 🩸🩸
రక్తదాతలు స్ఫూర్తి ప్రదాతలు
రక్తదానం చేద్దాం - ఆపదలో ఉన్నవారికి సహాయం అందిద్దాం.

సమయం : ఉదయం 10.00 AM నుంచి మధ్యాహ్నం 2.00 PM వరకు.
తేదీ : 01.09.21
స్థలం : కదిరి గవర్నమెంట్ హాస్పిటల్.
మిగతా వివరాలకు సంప్రదించగలరు.
Cell:9515006006
9966678437
8328335259.
ఇట్లు,
*Jsp All నియోజక వర్గం కదిరి టీమ్*
*రామ్ చరణ్ యువ ఫౌండేషన్ టీమ్*

దయచేసి అందరూ జాగ్రత్త వహించండి.*1.మాస్క్ ధరించండి.*2.భౌతిక దూరం పాటించండి.*3.చేతుల్ని సబ్బుతో కానీ,సానిటైజర్ తోగానీ శుభ్...
16/04/2021

దయచేసి అందరూ జాగ్రత్త వహించండి.
*1.మాస్క్ ధరించండి.
*2.భౌతిక దూరం పాటించండి.
*3.చేతుల్ని సబ్బుతో కానీ,సానిటైజర్ తోగానీ శుభ్రం చేసుకోండి.
*మన భద్రత మన చేతుల్లోనే*
దేశంలో,రాష్ట్రంలో,మన జిల్లాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ నడుస్తోంది ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించండి. 🙏🙏🙏
ఇట్లు ,
RC YUVA FOUNDATION,
KADIRI.

మెగా పవర్ స్టార్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కదిరి జన సేన పార్టీ తరపున,మెగా ఫ్యామిలీ అభిమానుల తరపున మర...
27/03/2021

మెగా పవర్ స్టార్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కదిరి జన సేన పార్టీ తరపున,మెగా ఫ్యామిలీ అభిమానుల తరపున మరియు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యులందరి తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.💐💐❤️❤️
ప్రజలకు సేవ చేయాలనే తపన ఆరాటం ఉత్సాహం కలిగి యువకులకు చిరంజీవి గారు,శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం. ఇవే ఆశయాలతో రామ్ చరణ్ గారు అభిమానుల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.అందులో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు,అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ భవానీ రవి శంకర్ గారి ఆదేశాల ప్రకారం తాగు నీటికి ఇబ్బంది పడుతున్న అమడగురు మండలం గాజుల పల్లెల్లో "మాతృశ్రీ" వృద్ధాశ్రమంలో ఉన్న వారికి మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఒక వాటర్ ప్యూరిఫైర్ ను రామ్ చరణ్ యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ కడపల సుధాకర్ రెడ్డి,కదిరి రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మంక మడక మనోహర్,మరియు టీమ్ సభ్యుల ఆద్వర్యంలో వారికి రామ్ చరణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా బహూకరించడం జరిగింది.అదే విధంగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు మాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధుల మధ్య సభ్యుల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆపదలో ఉన్న వారికి సాయం అందించడమే లక్ష్యంగా యువకులకు ఆదర్శంగా నిలిచి ఎంతో మందికి తమ చిరంజీవి బ్లడ్ & బ్యాంక్ ద్వారా సహాయం...
23/03/2021

ఆపదలో ఉన్న వారికి సాయం అందించడమే లక్ష్యంగా యువకులకు ఆదర్శంగా నిలిచి ఎంతో మందికి తమ చిరంజీవి బ్లడ్ & బ్యాంక్ ద్వారా సహాయం అందించిన ఆపద్భాందవుడు పద్మభూషణ్ Dr. చిరంజీవి గారి తనయుడు శ్రీ కొణిదెల రామ్ చరణ్ పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా మన కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు,అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ భవానీ శంకర్ గారి ఆదేశాల ప్రకారం రామ్ చరణ్ యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ కడపల సుధాకర్ రెడ్డి మరియు అధ్యక్షులు శ్రీ మంక మడక మనోహర్ గారి ఆద్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Dr. మదన్ కుమార్ సార్ గారు,కదిరి తహశీల్దార్ మారుతి ప్రసాద్ గారు,హేమంత్ సార్ గారు,కదిరి బ్లడ్ బ్యాంక్ ఇంచార్జీ వహీదా మేడం గారు విచ్చేసి రక్తదానం గురించి వారు యువకులకు తమ తమ అమూల్యమైన సందేశాలు,సూచనలు చేశారు.రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ సమయంలో వీరి సేవలకు గాను సభ్యుల ఆద్వర్యంలో సన్మానించడం జరిగింది.
"రామ్ చరణ్ యువ ఫౌండేషన్ " బ్లడ్ క్యాంప్ " కు హాజరు అయ్యి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు,కదిరి పట్టణంలో రక్తదాన గ్రూప్స్ నడుపుతున్న వారికి మన రామ్ చరణ్ యువ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఇట్లు,
రామ్ చరణ్ యువ ఫౌండేషన్ - కదిరి

✨మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడు,తన బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ✨పవర్ స్టార్ ఆశయానికి వారసుడు మెగా పవర్ స్టార్ *శ్రీ ...
20/03/2021

✨మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడు,తన బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ✨పవర్ స్టార్ ఆశయానికి వారసుడు మెగా పవర్ స్టార్ *శ్రీ కొణిదెల రామ్ చరణ్* పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా,అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు,అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ భవానీ శంకర్ గారి ఆదేశాల ప్రకారం మన రామ్ చరణ్ యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ కడపల సుధాకర్ రెడ్డి గారు,అధ్యక్షులు శ్రీ మంక మడమ మనోహర్ గారి ఆద్వర్యంలో మన *కదిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు 23.03.21 ఉదయం 9.00 AM నుంచి మధ్యాహ్నం 1.00PM వరకు ( మంగళ వారం) రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది*.
రక్తదానం చేయదలచిన వారు మన రామ్ చరణ్ యువ ఫౌండేషన్ టీమ్ సభ్యులను సంప్రదించాలని కోరుతున్నాం.
🩸🩸 రక్త దానం చెయ్యండి - ప్రాణ దాతలు అవ్వండి 🩸🩸
ఇట్లు,
*రామ్ చరణ్ యువ ఫౌండేషన్* - కదిరి.
వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు
Cell.9515006006
9966678437
8985730558

సమాజంలో అవినీతి రాజకీయ వ్యవస్థకు అడ్డుకట్ట వెయ్యడం కోసం,అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం,రాజకీయ మార్పు దిశగా అడుగులు వెయ్...
14/03/2021

సమాజంలో అవినీతి రాజకీయ వ్యవస్థకు అడ్డుకట్ట వెయ్యడం కోసం,అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం,రాజకీయ మార్పు దిశగా అడుగులు వెయ్యడం కోసం, జీరో బడ్జెట్ రాజకీయ స్థాపన కోసం,యువకులను, మహిళలను,పేద,బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా ప్రోత్సహించడం కోసం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14 వ తేదీన "జన సేన పార్టీ "ను స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ( కదిరి) టీమ్ తరపున మాధవ గురుకులంలో ఉండే నిరాశ్రిత పిల్లలకు భోజన సదుపాయం సభ్యుల ఆద్వర్యంలో కల్పించడం జరిగింది. దీనికి సహకరించిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు.

ఇట్లు,
రామ్ చరణ్ యువ ఫౌండేషన్,కదిరి

Address

Kadiri

Telephone

+918985730558

Website

Alerts

Be the first to know and let us send you an email when Ram Charan yuva foundation -RCYF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share