26/10/2025
మొన్నోసారి నా అకౌంట్లో 2600 వచ్చాయి, మా షాప్ కస్టమర్స్ అనుకున్నా,లేదా స్కాం ఏమో అనుకున్నా.మా డబ్బులు తిరిగి వేయండి అని మెసేజ్ ఉంది,కాల్ మి అని రిప్లై ఇచ్చా,నాకు తెలిసిన వాళ్ళయితే కాల్ చేస్తారు లే అనుకున్నా...మరుసటి రోజు చూస్తే మీ నంబర్ లేదు plz తిరిగి వేయండి అని చాలా అంటే చాలా మెసేజ్ లు ఉన్నాయి.ఆమె నంబర్ పెట్టింది కాల్ చేశాను, హాస్పిటల్ లో ఉన్న బిడ్డకు ఆరోగ్యం బాలేదు మెడికల్ షాప్ కు వేయబోయాను మీకు వచ్చాయి, నంబర్ చూపించడం లేదు కాల్ చేద్దామంటే అని చెప్పింది, వెంటనే డబ్బులు తిరిగి వేశాను.ఇంకోసారి జాగ్రత్త మా ఇలా.చేయకు నీకు phonepay వాడడం రాకపోతే మానేయి అని చెప్పాను.
"చాలా కృతజ్ఞతలు అక్క మీరు కాబట్టి వేశారు ఇంకొకరు అయ్యుంటే వేసేవారు కాదు, ఇప్పుడు కూడా ఆస్పత్రి లోనే ఉన్నాను,రాత్రంతా బాధపడ్డాను ఎలా దేవుడా" అని బాధపడింది.
ఇదేమీ గొప్ప కాదు, అదే మరి మానవత్వము అంటే,అందుకే మమ్మల్ని మనిషి అని పిలిచేది...
ఇది వాస్తవ ఉదాహరణ మాత్రమే, కొందరు రకరకాలుగా మోసాలు, నమ్మక ద్రోహాలు చేస్తూ ఉంటారు...
జాగ్రత్త మనము తీర్పుదినాన అల్లాహ్ కు జవాబుదారి చెప్పుకోవలసి ఉంది,ఒకరికి మోసం చేసేముందు అల్లాహ్ కు భయపడుతూ బతుకుదాము.
team kadapa