Vandematharam Student Federation-VSF-వందేమాతరం

  • Home
  • India
  • Jangaon
  • Vandematharam Student Federation-VSF-వందేమాతరం

Vandematharam Student Federation-VSF-వందేమాతరం తరగతి గది నుండి దేశాన్ని ప్రపంచ శక్తిగా నిర్మిద్దాం...

* Vande Mataram• వాడవాడలా వందేమాతరం!భారతదేశ సుదీర్ఘ, స్ఫూర్తిదాయక చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సంద...
07/11/2025

* Vande Mataram

• వాడవాడలా వందేమాతరం!

భారతదేశ సుదీర్ఘ, స్ఫూర్తిదాయక చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సందర్భాలెన్నో! అవి జాతి భావోద్వేగాలను వీణలా మీటి, వెన్నుతట్టి సమష్టి కార్యాచరణకు పురిగొల్పాయి. ఛత్రపతి శివాజీ సైన్యం ఉద్వేగంగా ఆలపించిన యుద్ధగీతాలు మొదలు... స్వాతంత్య్రోద్యమంలో ప్రతిధ్వనించిన దేశభక్తి గీతాలు, ఎమర్జెన్సీ కాలంలో యువగళాలు వినిపించిన ధిక్కార గీతాలు మన ఉమ్మడి చైతన్యాన్ని జాగృతపరిచాయి. వీటన్నింటిలోకీ అత్యంత ప్రత్యేకమైనది వందేమాతరం. ఈ అమర గీతం వెలువడి 150 సంవత్సరాలైనందున, నేటి నుంచి ఏడాదిపాటు దేశమంతటా ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిశ్చయించింది.

మిగతా గీతాల్లా వందేమాతరం యుద్ధ రంగంలో, పోరు బాటలో ఉద్భవించింది కాదు. కవీంద్రుడు బంకించంద్ర ఛటర్జీ ప్రశాంత, దృఢచిత్తంలో ఉద్భవించిన పాట అది. 1875లో కార్తిక శుక్ల నవమి, జగద్ధాత్రి పూజనాడు ఆయన కలం నుంచి జాలువారిన వందేమాతర గీతం... స్వాతంత్య్ర ఉద్యమ శ్లోకంగా నిలిచి నేటికీ జాతీయ రాగంగా భాసిల్లుతోంది. భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు ఈ గీతరచనకు ప్రేరణనిచ్చాయి. అధర్వణ వేదంలోని ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః...(భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను)’’ అనే శ్లోకం, సర్వ మంగళ మాంగళ్యే శివే... అంటూ సాగే దేవీమాత స్తోత్రం వందేమాతరం గీతానికి ప్రేరణలు.

అంధకారంలో... ప్రభాత గీతం

వాడవాడలా వందేమాతరం! బంకిం బాబు వందేమాతరం ప్రార్థనతో పాటు భవిష్యవాణి కూడా. అది స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాద ప్రకటనగానూ నిలిచింది. భారతదేశమంటే కేవలం భూభాగం కాదనీ, యుగాలుగా పరిఢవిల్లిన నాగరికత అనీ చాటిచెప్పింది. భారత్‌ అంటే మ్యాపు మీద కొన్ని రేఖలను కలిపితే వచ్చే ప్రదేశంకాదనీ... ఉమ్మడి సంస్కృతి, విలువలు, శౌర్యత్యాగాలను పంచుకున్న భరతమాత బిడ్డల చిరకాల ఆవాసమనీ ఘోషించింది. భారతదేశమంటే మట్టి కాదనీ... కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది. మహర్షి అరవిందుడు వర్ణించినట్లు- బంకించంద్రుడు ఆధునిక భారత రుషి. ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేల్కొలిపాయి. ఆయన రాసిన ఆనందమఠం కేవలం నవలే కాదు, గద్యరూపంలోని మహామంత్రం. నిదురిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కనుగొనేలా జాగృతం చేసిందది. ‘‘నా రచనలన్నీ గంగానదిలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు. ఈ ఒక్క దివ్యగీతం(వందేమాతరం) మాత్రం అజరామరంగా నిలిచిపోతుంది. దేశ ప్రజల మనసులను గెలుచుకునే మహత్తర గీతమది’’ అని బంకిం బాబు ఒక లేఖలో పేర్కొన్నారు. ఆయన మాటలు అక్షర సత్యాలయ్యాయి. బ్రిటిష్‌ అంధకార యుగంలో బంకించంద్రుడు రచించిన వందేమాతరం జాతికి ప్రభాత గీతమైంది. మన సంస్కృతి, నాగరికతల పట్ల గర్వాభిమానాలను రేకెత్తించే గానమైంది. అణువణువున మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడే వ్యక్తి మాత్రమే వందేమాతరం వంటి గీతం రాయగలరు. ఆ గీతానికి 1896లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బాణీ కట్టి, కలకత్తా కాంగ్రెస్‌ మహాసభల్లో ఆలపించి దానికి అమరత్వం సంతరించిపెట్టారు. వందేమాతరం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతిని కదిలించింది. తమిళనాట మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఈ గీతాన్ని తమిళంలోకి అనువదించారు. పంజాబ్‌లో విప్లవకారులు బ్రిటిష్‌ వలస పాలకులపై ధిక్కార ప్రకటనగా వందేమాతరం అంటూ నినదించారు. 1905లో బెంగాల్‌ విభజనపై నిరసన వెల్లువెత్తినప్పుడు వందేమాతరం అంతటా మార్మోగింది. దాంతో బ్రిటిష్‌ పాలకులు ఆ పాటను నిషేధించారు. కానీ, 1906 ఏప్రిల్‌ 14న బారిసాల్‌లో వేలమంది ఉద్యమకారులు ఆ నిషేధాన్ని ధిక్కరించి వందేమాతరం అంటూ ఘోషించారు. లాఠీ దెబ్బలకు రక్తమోడుతున్నా లెక్కచేయకుండా స్త్రీపురుషులు అలా ఘోషిస్తూనే ఉన్నారు. బెంగాల్‌ నుంచి వందేమాతరం విప్లవ జపమై గదర్‌ పార్టీ ద్వారా కాలిఫోర్నియా చేరి అక్కడా మార్మోగింది. సింగపూర్‌ నుంచి నేతాజీ నాయకత్వంలోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధుల ద్వారా భరతభూమికి తిరిగి వచ్చింది. 1946లో తిరుగుబాటు చేసిన రాయల్‌ ఇండియన్‌ నేవీలోని భారతీయ నావికులు వందేమాతరం అంటూ నినదిస్తూ బ్రిటిష్‌ యుద్ధనౌకలపై జాతీయ పతాకను ఆవిష్కరించారు. ఖుదీరాం బోస్‌ నుంచి అష్ఫకుల్లా ఖాన్‌ వరకు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ నుంచి తిరుపూర్‌ కుమరన్‌ వరకు విప్లవకారులందరి గళాలు వందేమాతరం అని గర్జించాయి.

వందేమాతరం ఇక ఎంతమాత్రం పాట కాదు, భారతీయాత్మ సమష్టి స్వరం. మొద్దునిద్రలో ఉన్నవారినైనా మేల్కొలిపే మంత్రశక్తి వందేమాతరానికి ఉందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. ఉదారవాదులనూ విప్లవకారులనూ విద్వాంసులనూ సైనికులనూ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమోన్ముఖుల్ని చేసిందీ గీతం. అరవిందుడు చెప్పినట్లు, అది భారతదేశ పునరుజ్జీవన మంత్రమైంది. అక్టోబరు 26 నాటి మన్‌కీ బాత్‌ ప్రసంగంలో ప్రధాని మోదీ వందేమాతరం ఉజ్జ్వల వారసత్వాన్ని జాతికి గుర్తుచేశారు. ఇప్పుడు ఏడాది ఉత్సవాల్లో భాగంగా వందేమాతరం పూర్తిరూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కీర్తిస్తూ కేంద్రం ఇటీవల ‘భారత్‌ పర్వ్‌’ నిర్వహించింది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. సర్దార్‌ సాధించిన భారతదేశ ఏకీకరణలో వందేమాతరం స్ఫూర్తి మూర్తీభవించింది.

తరతరాలకూ ఉత్తేజం

వందేమాతరం కేవలం గత వైభవ స్మరణ కాదు, ఉజ్జ్వల భవిష్యత్తును ఆవాహించే మంత్రజపం కూడా. 2047కల్లా వికసిత్‌ భారత్‌ను సాధించడానికి స్ఫూర్తి ఉత్సాహాలనిచ్చే గీతమది. ఘనమైన భారతదేశ సంస్కృతీ నాగరికతలపై మనకున్న గర్వాభిమానాలకు నిదర్శనమైన ఆ గీతస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడం మనందరి బాధ్యత. వందేమాతరం పారతంత్ర భారతదేశానికి తొలి మేల్కొలుపు. మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమది. భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామజరంగా నిలుస్తుంది. తరతరాలకు ఉత్తేజమిస్తుంది. భారతీయత అనే కోణం నుంచి మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను వీక్షించి... నిరంతరం స్ఫూర్తి పొంది... సదా కార్యాచరణలో నిమగ్నం కావాలని ప్రబోధించే దివ్య గానమే- వందేమాతరం!

#వందేమాతరం

07/11/2025

వందేమాతరం..

16/03/2025
జనగామ జిల్లాలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం...వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ నిధుల సేకరణ కొరకు ప...
16/03/2025

జనగామ జిల్లాలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం...

వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ నిధుల సేకరణ కొరకు పట్టణంలోని షాపు,షాపు కు తిరుగుతూ వినూత్నంగా భిక్షాటన చేసిన విద్యార్థులు...

వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్...

ఈరోజు వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ గేమ్స్ నిర్వహించడం జరిగింది
05/03/2025

ఈరోజు వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ గేమ్స్ నిర్వహించడం జరిగింది

13/02/2025

*స్కాలర్ షిప్స్ విడుదల చేయనందుకు నిరసనగా VSF ఆద్వర్యంలో "విద్యార్థుల భిక్షాటన"...*జనగామ జిల్లా కేంద్రంలో ఈరోజు వందేమాతరం...
13/02/2025

*స్కాలర్ షిప్స్ విడుదల చేయనందుకు నిరసనగా VSF ఆద్వర్యంలో "విద్యార్థుల భిక్షాటన"...*

జనగామ జిల్లా కేంద్రంలో ఈరోజు వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ (VSF)ఆద్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నల్ల రాహుల్ అధ్యక్షతన విద్యార్థులకు స్కాలర్షిప్ లు విడుదల చేయాలని నల్ల రిబ్బన్ చేతులకు సంకెళ్ళుగా కట్టుకొని, గాంధీ విగ్రహం ముందు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళంపల్లి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వలసిన పెండింగ్ స్కాలర్షిప్ లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సం,, కాలం ముగుస్తున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయక పోవడం దారుణం అని, విద్యార్థి డిక్లరేషన్ లో ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్క పథకం అమలు చేయలేదని, కనీసం స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని, లేకుంటే ప్రభుత్వం పై తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VSF పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్, ప్రవీణ్, చిన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు..

*- వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ (VSF)*

*"VSF రాజ్యాంగ ఉత్సవాలు
29/01/2025

*"VSF రాజ్యాంగ ఉత్సవాలు

*"VSF రాజ్యాంగ ఉత్సవాల"లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతుల ప్రదానం..*76వ గణతంత్ర దినోత్సవం జరుగుతున్న సందర్భంగా రాజ్యాంగం...
29/01/2025

*"VSF రాజ్యాంగ ఉత్సవాల"లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతుల ప్రదానం..*

76వ గణతంత్ర దినోత్సవం జరుగుతున్న సందర్భంగా రాజ్యాంగంపై పెద్ద ఎత్తున అవగాహన కలిగించేలా వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ (VSF) జిల్లా అధ్యక్షుడు నల్ల రాహుల్ అధ్యక్షతన జనగామ జిల్లా కేంద్రంలో గల పాఠశాల, కలశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా, అందులో గెలుపొందిన San Mariya, St Paul's, స్కాలర్స్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు SRR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజు గారు, VSF వ్యవస్థాపకులు మంగళంపల్లి రాజు బహుమతులు అందజేశారు. రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి VSF చేపట్టిన కార్యక్రమాలలో ఇది మొదటి అడుగు మాత్రమే అని, జనవరి 26 నుండి 14 ఏప్రిల్ వరకు "VSF రాజ్యాంగ ఉత్సవాలు" నిర్వహిస్తామని మంగళంపల్లి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో VSF పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్, జిల్లా నాయకులు బిట్ల చిన్న, కిరణ్, అరుణ్, లక్ష్మన్, ప్రవీణ్, అంజి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

*- వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ (VSF)*

23/01/2025

Address

4-5-20/9, Sanjay Nagar
Jangaon
506167

Telephone

9247896607

Alerts

Be the first to know and let us send you an email when Vandematharam Student Federation-VSF-వందేమాతరం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vandematharam Student Federation-VSF-వందేమాతరం:

Share