Bharatiya Kisan Sangh, Telangana State.

Bharatiya Kisan Sangh, Telangana State. BKS TS HYDERABAD - MAIN AIM IS TO CREATE AWARENESS,UNITY AMONG ALL SECTIONS OF FARMERS,INCREASE PRODUCTION PRODUCTIVITY ,DEMAND FOR BETTER MARKET PRICE.

28/02/2026
28/02/2026
28/02/2026
భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ మహాసభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలపై విస్తృత స్థాయి సమావేశం 23 జనవరి 2026న అ...
24/01/2026

భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ మహాసభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలపై విస్తృత స్థాయి సమావేశం 23 జనవరి 2026న అన్నోజిగూడలోని శ్రీ విద్యా విహార్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడింది.

ఈ సమావేశంలో అఖిల భారతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల జీవన సమస్యలు, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర, నీటి వనరుల సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, ఎరువులు–విత్తనాల లభ్యత వంటి కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.

అదేవిధంగా రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు చేయబడ్డాయి. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ రైతుల హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి వేదిక కల్పించిన శ్రీ విద్యా విహార్ స్కూల్, అన్నోజిగూడ యాజమాన్యానికి, అలాగే సమావేశం విజయవంతానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

🌸🙏 కాలనీ పెద్దలు – భారతమాత పూజ, బలరామ జయంతి ఉత్సవాలు & స్నేహసమ్మేళనం 🙏🌸మన రాఘవేంద్ర కాలనీ C బ్లాక్ కొండాపూర్ వాసులు,కాలన...
29/08/2025

🌸🙏 కాలనీ పెద్దలు – భారతమాత పూజ, బలరామ జయంతి ఉత్సవాలు & స్నేహసమ్మేళనం 🙏🌸

మన రాఘవేంద్ర కాలనీ C బ్లాక్ కొండాపూర్ వాసులు,
కాలనీ పెద్దలు కలిసి ఈ రోజు సాయంత్రం
భారతమాత పూజ, బలరామ జయంతి ఉత్సవాలు
మరియు స్నేహపూర్వక సమావేశం ఘనంగా నిర్వహించారు.

➡️ పెద్దలు వినోద్ కుమార్ రావు గారు, మురళీ మనోహర్ కులకర్ణి గారు,
స్నేహితులు సాఇకాంత్ దామ గారు హాజరై,
పాత జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

మన సమాజ బంధాలను మరింత బలపరిచే ఈ తరహా సమావేశాలు
ఇంకా కొనసాగాలని అందరం కలిసి కోరుకుంటున్నాం అని అన్నారు 🌟

🙏 శ్రీ వినాయకుని సన్నిధిలో, భారతమాత పూజతో
మన కాలనీ పెద్దలు అందరం కలిసి
భక్తి – దేశభక్తి వాతావరణంలో
సాంస్కృతిక వేడుకలకు శ్రీకారం చుట్టారు.
🌸 గణేశ్ ఉత్సవం – 2025 🌸
మన రాఘవేంద్ర కాలనీ C బ్లాక్ పెద్దలు,
వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆయంగారి సురేందర్ రెడ్డి మరియు సభ్యులు కలిసి
భక్తిశ్రద్ధలతో బలరామ జయంతి వేడుకలు
గణేశ్ ఉత్సవాల భాగంగా ఘనంగా నిర్వహించారు.
అందరూ ఉత్సాహంగా పాల్గొని, ఆనందోత్సాహాలతో
సంబరాలు చేసుకున్నారు.

Address

G2-RAJPUTH RESIDENCY, NEAR NALLAKUNTA FEVER HOSPITAL
Hyderabad
500044

Alerts

Be the first to know and let us send you an email when Bharatiya Kisan Sangh, Telangana State. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share