Hindu Spiritual & Service Fair - Bhagyanagar

Hindu Spiritual & Service Fair - Bhagyanagar HSSF showcases Hindu society's commitment to service through the efforts of various spiritual and social organizations.

15/11/2024

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనిక వీరుల సేవలు చిరస్మరణీయం అని పాట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. అటువంటి సైనిక వీరులకు వందనం చేస్తూ రూపొందించిన పరమవీర్ వందనం కార్యక్రమం చక్కటి చొరవ అని ఆయన ప్రశంసించారు. హిందూ ఆధ్యాత్మిక మరియు సేవ ఫౌండేషన్ (హెచ్ ఎస్ ఎస్ ఎఫ్) మరియు ఐ ఎం సి టి ఎఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా ప్రదర్శిని కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ముగిసింది. మూడు రోజుల కార్యక్రమంలో చివరి రోజున సైనిక వీరుల సేవలను గుర్తించుకుంటూ పరమవీర్ వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. సామాజిక సమర‌సత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ వక్తగా విచ్చేశారు. పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమానికి శోభ కల్పించారు.

15/11/2024

తల్లితండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా మాత పితృ వందనం నిర్వహించారు. తల్లిదండ్రులను పూజించడం ద్వారా కుటుంబ విలువలను తెలుసుకునేందుకు వీలవుతుంది.

ఈ తరం యువత, విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు,, విలువల పట్ల అవగాహన కల్పించేందుకు వివిధ అంశాల పట్ల వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతదేశ సంప్రదాయంలో కుటుంబ విలువలు, సామాజిక చింతన ముఖ్యం అని చాటి చెప్పేందుకు వీటిని ఉద్దేశించారు. ఇటువంటి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువతకు ఆయా అంశాల పట్ల చక్కటి అవగాహన కల్పించేందుకు వీలవుతున్నది.

14/11/2024

రామకృష్ణ మఠ్ అధ్యక్ష మహరాజ్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత సామాజిక పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వేద విద్యతో పాటుగా శాస్త్రీయ విద్యా విధానం కొనసాగే వ్యవస్థ ఉండాలన్న స్వామి వివేకానందుల ఆకాంక్షను గుర్తు చేశారు. వేద పఠనంలో ప్రాణాయామం, భక్తి, శ్రద్ధ వంటి ఎన్నో కీలకాంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. దేశంలో వేదవిద్య, ఆధ్యాత్మిక విద్యను తిరస్కరించడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే, దానిని రక్షించుకునే వారే లేరన్న నాటి వివేకానందుల ఆవేదనను సభముందుంచారు. నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగమిచ్చి తీర్చిదిత్తిన శాస్త్రవేత్త సీవీ రామన్ జీవిత ఘట్టాన్ని తెలియజేసి ఆ ఆదర్శాలను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలన్నారు. అంకితభావం గల నలంద విశ్వవిద్యాలయం గురుశిష్యుల విలువలను బోధమయానంద తెలియజేశారు.

14/11/2024

మానవుడు దైవాన్ని చేరుకునే ప్రయాణంలో సాధనగా మన రుషులు సేవామార్గాన్ని మనకు చూపించారని, HSSF సేవాప్రదర్శిని దానిని ప్రతిబింబిస్తోందని రామకృష్ణ మిషన్, విజయవాడ నుంచి విచ్చేసిన స్వామి శితికంఠానంద కొనియాడారు. సనాతన ధర్మంలో త్యాగానికి ప్రతినిధులుగా నిలిచిన దధీచి, జీమూతవాహనుడు, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు వంటి వారిని ఉదహరిస్తూ సమాజం గుర్తింపును ఆశించకుండా సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థల ఈ సేవాప్రదర్శిని ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. సేవ ద్వారా మాత్రమే అహంకారం నిర్మూలన జరుగుతుందన్న స్వామి రంగనాథానంద బోధను ప్రస్తావిస్తూ ఈ సేవా మేళాలు భాగంగా జరుగనున్న కన్యావందనం, గురువందనం, మాతా పితృ వందనం కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

14/11/2024

భారతీయ ఆత్మను ప్రతిబింబించేలా HSSF సేవాప్రదర్శిని - త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రశంస
HSSF సేవాప్రదర్శిని ప్రారంభోత్సవ సభలో ఆశీః ప్రసంగం చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ ఈ బృహత్ మేళా భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మన దేశానికి ఒక ఆత్మ ఉన్నదని చూపించే సంకల్పంతోనే ఏర్పాటైన ఈ సేవాప్రదర్శినిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విశాల హృదయం కలిగిన భారతదేశంలో వనరులకు కొరత లేదంటూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆలోచన లేని విద్యావిధానమే కొనసాగుతోందని, దేశంలో ఇప్పటికీ దాస్య భావన పోలేదని ఆవేదన చెందారు. వేద విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న భారతదేశంలో సహజత జీవించే ఉందని, మన భూమికి సహజసంపద, సౌందర్యం, సౌగంధ్యం, రుచి ఉన్నాయని జీయర్ స్వామి వివరించారు. భారతీయతను ఆచరిస్తూ లోక క్షేమాన్ని, విశ్వ కళ్యాణాన్ని కోరుకునే వ్యక్తులు సంస్థలను HSSF ఒక చోటికి చేర్చిందని ప్రశంసించారు.

13/11/2024

భాగ్యనగర్ హిందు ఆధ్యాత్మిక మరియు సేవా మేళాలో శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారి ప్రసంగం
సామాజిక సేవ చేస్తున్న వారికి మానవీయం పేరుతో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆయా సంస్థలు, వ్యక్తులు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఈ తరం యువతకు పరిచయం చేశారు.

13/11/2024

హిందు ఆధ్యాత్మిక మరియు సేవా మేళాలో శ్రీ అప్పాల ప్రసాద్ గారి ప్రసంగం

11/11/2024

ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు శ్రీ భాగయ్య ప్రసంగిస్తూ భారతీయ సమాజ మౌలిక స్థితి, సాంస్కృతిక తత్వం, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా HSSF సేవాప్రదర్శిని నిలుస్తుందన్నారు. సేవకు ప్రతిమూర్తిగా నిలిచిన శ్రీకృష్ణుడి వారసులైన భారతీయులు మన దేశంలోని ధార్మిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. బ్రిటిష్ వారు రాకముందు మనదేశంలో దారిద్ర్యమే లేదని, విదేశీ దురాక్రమణ తర్వాత కూడా మన గ్రామాలు సుసంపన్నంగానే ఉన్నాయని తెలిపారు. దేశంలోని ధర్మశాలలకు ప్రజలే దాతలుగా నిలిచారంటూ 1785 వ సంవత్సరం వరకూ తమిళనాడు నుంచి బరంపురం వరకూ ఉన్న సుమారు లక్ష పాఠశాలలకు ప్రజలు, రైతులే అండగా నిలిచారని, వాటిలో సమస్త కులాల వారు విద్యను అభ్యసించేవారని విశాల భారతీయ తత్వాన్ని సభకు తెలిపారు. రామకృష్ణ మఠం, సత్యసాయి సంస్థలు, మాతా అమృతానందమయి సంస్థలు, సేవాభారతి వంటి ఎన్నో సంస్థలు సేవానిరతిని భాగయ్య ప్రస్తావించారు. అమెరికా, కెన్యా వంటి దేశాల్లో సైతం భారతీయులందిస్తున్న సేవలను తెలియజేస్తూ HSSF సేవాప్రదర్శినిలో ఆ స్ఫూర్తిని చూడవచ్చన్నారు

11/11/2024

చక్కని అనుభూతుల మధ్య ముగిసిన సేవా ప్రదర్శిని .......
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనిక వీరుల సేవలు చిరస్మరణీయం అని పాట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. అటువంటి సైనిక వీరులకు వందనం చేస్తూ రూపొందించిన పరమవీర్ వందనం కార్యక్రమం చక్కటి చొరవ అని ఆయన ప్రశంసించారు. హిందూ ఆధ్యాత్మిక మరియు సేవ ఫౌండేషన్ (హెచ్ ఎస్ ఎస్ ఎఫ్) మరియు ఐ ఎం సి టి ఎఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా ప్రదర్శిని కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ముగిసింది. మూడు రోజుల కార్యక్రమంలో చివరి రోజున సైనిక వీరుల సేవలను గుర్తించుకుంటూ పరమవీర్ వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. సామాజిక సమర‌సత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ వక్తగా విచ్చేశారు. పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమానికి శోభ కల్పించారు.

ఈ తరం యువత, విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు,, విలువల పట్ల అవగాహన కల్పించేందుకు వివిధ అంశాల పట్ల వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతదేశ సంప్రదాయంలో కుటుంబ విలువలు, సామాజిక చింతన ముఖ్యం అని చాటి చెప్పేందుకు వీటిని ఉద్దేశించారు. ఇటువంటి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువతకు ఆయా అంశాల పట్ల చక్కటి అవగాహన కల్పించేందుకు వీలవుతున్నది.

ఆదివారం ఉదయం తల్లితండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా మాత పితృ వందనం నిర్వహించారు. తల్లిదండ్రులను పూజించడం ద్వారా కుటుంబ విలువలను తెలుసుకునేందుకు వీలవుతుంది. మాతా అమృతానందమయి ట్రస్ట్ తెలంగాణ ఇన్ ఛార్జ్ స్వామిని సువిద్యామిత్ర ముఖ్యఅతిథిగా విచ్చేశారు. స్పిరిచువల్ సైంటిస్ట్ వి ఎస్ ఆర్ మూర్తి వక్త గా హాజరై చక్కటి విలువలు తెలిపేలా ప్రసంగించారు.

సేవా ప్రదర్శిని కార్యక్రమంలో 180కు పైగా సేవా సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. వివిధ రంగాలలో సమాజం కోసం అద్భుత సేవలు అందిస్తున్న సేవా సంస్థలు ఇక్కడ కొలువు తీరాయి. ఆయా సంస్థల సేవలు పట్ల అవగాహన కల్పించేలా ప్రదర్శనలు, కరపత్రాలు, సమాచారం అందించారు. తద్వారా కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, యువత మరియు సందర్శకులకు సేవా కార్యక్రమాల పట్ల చక్కటి అవగాహన కలుగుతున్నది.

ఆదివారం మధ్యాహ్నం లో సామాజిక సేవ చేస్తున్న వారికి మానవీయం పేరుతో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆయా సంస్థలు, వ్యక్తులు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఈ తరం యువతకు పరిచయం చేశారు. రాష్ట్రీయ సేవా భారతి ట్రస్టీ ఎక్కా చంద్రశేఖర్ ప్రసంగిస్తూ సేవా కార్యక్రమాల పట్ల యువతలో అభిరుచి ఏర్పడాలని అభిలషించారు.

మూడు రోజులు పాటు జరిగిన సేవా ప్రదర్శిని కార్యక్రమానికి వేల సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు. అనేక వందన కార్యక్రమాలు, సేవ స్టాల్స్ ని సందర్శించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన హెచ్ ఎస్ ఎస్ ఎఫ్ మరియు ఐ ఎం సి టి ఎఫ్ నిర్వాహకుల్ని అభినందించారు.

11/11/2024

ముఖ్యవక్త, భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గంగాధర శాస్త్రి మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలలో ఇమిడి ఉన్న సామాజిక బాధ్యతను వివరించారు. హిందూధర్మం ఎంతో శక్తిమంతమై ఉండగా హిందువులు మాత్రం బలహీనులై ఉన్నారని ఆవేదన చెందారు. భారతదేశంలో పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం, తెలుగువారిగా పుట్టినందుకు పోతన పద్యం ఒక్కటైనా రాకపోతే మన ఉనికికి అర్థమేంటని ప్రశ్నించారు. మాతృభూమి పట్ల శ్రీరాముని గల గౌరవాన్ని తెలియజేస్తూ దేశభక్తిని చాటిన రాముని బాటలో నడవాలని పిలుపునిచ్చారు. వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు రిటైర్మెంట్ పుస్తకాలు కావని, అనునిత్యం ఆచరించాల్సినవని తెలిపారు.

11/11/2024

విశిష్ట అతిథుల్లో ఒకరైన DPS, మెరిడియన్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ గురువు అంటే కేవలం మార్కులు వేసే వ్యక్తిగా భావించరాదంటూ తన జీవితంలోని సంఘటనలను పంచుకున్నారు. తనను తీర్చిదిద్దిన గురువుల కృషిని తెలిపారు. కనిపెంచిన తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదేన్నారు.

11/11/2024

ముఖ్య అతిథిగా విచ్చేసిన మానవహక్కుల చైర్‌పర్సన్ ఎస్ విజయభారతి మాట్లాడుతూ సర్వే భవంతు సుఖినః అన్న ఆర్యోక్తిని అనుసరించి హ్యూమన్ రైట్స్ సంస్థ పని చేస్తోందన్నారు. ఈ వేదికపై చేపట్టిన కార్యక్రమాలే తమకు ఫిర్యాదులుగా వస్తాయంటూ సంస్థ పనితీరును వివరించారు. సమాజంలోని వివిధ రంగాల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.

Address

Exhibition Grounds, Nampally
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Hindu Spiritual & Service Fair - Bhagyanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hindu Spiritual & Service Fair - Bhagyanagar:

Share