Sri Sankara Vidya Bharathi Gowsamrakshana Charitable trust

Sri Sankara Vidya Bharathi Gowsamrakshana Charitable trust Protection of cows is the single-most important principle towards saving the whole world from both moral and spiritual degradation.

We will Rescue,Rehabilitate,Adopt,Educate & Advocacy to the Old Age Cows. It is a rehabilitation Center for the cows.

🌿🌼 స్కంధ షష్ఠి 🌼🌿సుబ్రహ్మణ్యుని, షష్ఠి దేవిని ఆరాధించండితారాకాసుర సంహారం కోసం శివుని తేజస్సు నుంచి జన్మించిన కుమారస్వామి...
07/11/2024

🌿🌼 స్కంధ షష్ఠి 🌼🌿

సుబ్రహ్మణ్యుని, షష్ఠి దేవిని ఆరాధించండి

తారాకాసుర సంహారం కోసం శివుని తేజస్సు నుంచి జన్మించిన కుమారస్వామి.స్కంధ షష్టి రోజున శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి కళ్యాణం.
సుబ్రమణ్య షష్టి నాడు పాలు, పంచదారతో స్వామికి కావడి సమర్పిస్తారు.తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

పురాణగాథల ప్రకారం.. పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెళ్లి వనంలో (శరవనం ) చిక్కుకొని ఆరు ముఖాలు (షణ్ముఖాలు) పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమార స్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు. కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు.

సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.

ఓం శ్రీ షష్ఠి దేవిని ఆరాధించండి
ఓం శం శరవణభవ

29/10/2024

*"బలగం" సినిమా లో "కాకి" అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు... అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది... ఎందుకంటే కాకి - "కాలజ్ఞాని" అంటారు"..!*(

*®️వేకువ జామునే "(బ్రహ్మ ముహూర్తంలో)" మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.*

*®️"కావు కావు" అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు... ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ "కావు కావు" అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి.*

*®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న "అన్ని కాకులకు" సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.*

*®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి "సంఘటితంగా పోరాటం" చేపట్టేవి కాకులు.*

*®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి, అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.*

*®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే...*

*®️సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే...*

*®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా...*

*®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి... అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే అందుకే "కాకులు దూరని కారడవి" అంటారు.*

*®️కాకులు అరుస్తోంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.*

*®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.*

*®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.*

*®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.*

*®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.*

*®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.*

*®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు.!*

*®️కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి...!!*

*®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే. సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్యా ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.*
-----------------------------------------------
*ఇది చదివాక, కాకి జీవనంలో ఇంత తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా!!!!! అనిపించింది.*

*ఇది వీలైనంతమందికి పంచితే మంచిదేమో !... అనిపిస్తుంది పంపుతారు గదూ!

*సేకరణ:- ఒక మిత్రుడు ద్వారా వచ్చింది ,నాకు బాగా నచ్చింది, ఇందులో మంచి మేసేజ్ కూడిన నిజాలు ఉన్నాయి కనుక ఈ మెసేజ్ అందరి వద్దకు చేరేలా ప్రయత్నించండి.

*సత్యమేవ - జయతే 🙏

05/09/2024
https://youtu.be/53IdPd1aOxw?si=SSmMqjdKisLGBBHm
11/04/2024

https://youtu.be/53IdPd1aOxw?si=SSmMqjdKisLGBBHm

Watch► గోమయంతో రామదర్భార్... గోప్రేమికులకు చిన్న విన్నపం || Importance of Goseva || Kuppa Srinivasa Prasad || Hit TvWelcome to AV TV Telugu, Your One Stop De...

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కల...
08/04/2024

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది

Watch► ఉగాది పండుగ జరుకోవడం వెనుక ఉన్న అసలైన కారణం ఇదే..| Ugadi Panchanga Sravanam | Kuppa Srinivasa PrasadWelcome to AV TV Telugu, Your One Stop Destination...

https://youtu.be/R29a86JUIQ0?si=BbJwFdkjoXbF5DHb
03/04/2024

https://youtu.be/R29a86JUIQ0?si=BbJwFdkjoXbF5DHb

గోశాలలో పుట్టినరోజులు జరుపుకుంటే కలిగే ప్రయోజనాలు | Kuppa Srinivasa Prasad | Bhaktione ...

Address

New Nallakunta
Hyderabad
500044

Alerts

Be the first to know and let us send you an email when Sri Sankara Vidya Bharathi Gowsamrakshana Charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sri Sankara Vidya Bharathi Gowsamrakshana Charitable trust:

Share