14/11/2024
EEMT పరీక్షలు ఒక జీవితాన్ని మార్చగలవు. గతంలో మార్చాయి కూడా.
తమ పిల్లవాడి ప్రతిభ తెలియక బడి మానిపించి పనికిపంపుదామని, పది తరువాత అమ్మాయికి పెళ్ళి చేసేయాలని భావించిన తల్లితండ్రులు ఈ పరీక్షల్లో తమ పిల్లల ప్రతిభ చూసి మనసు మార్చుకున్న సందర్భాలున్నాయి.
ఈ పరీక్షల్లో అందిన ఆర్థిక సహకారం (3 వేల నుంచి, 30 వేలదాకా నగదు బహుమతులు) పిల్లల పైచదువులకు ఆసరాగా నిలిచిన సందర్భముంది.
ఆర్థిక సహాయం కాకపోయినా, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయి లో వారి ప్రతిభకు ప్రోత్సాహం మరియుఅభినందనలు వారిలో ఇంకా బాగా చదవాలన్న పట్టుదలకు EEMT ఒక చక్కటి మార్గమవుతుంది
ఈ సారి ఆ అవకాశం మనకు తెలిసిన, మనఊరు, మన మండలలేదా జిల్లా విద్యార్థిదే కావచ్చు. మీకు తెలిసిన ఉపాధ్యాయుల పిల్లలు కావచ్చు...మీకు తెలిసిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 వ తరగతి పిల్లలకు ఈ సమాచారాన్ని చేరవేయండి లేదా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు తెలియచేయండి.
రిజిష్ట్రేషన్లకు గడువు 23 నవంబరు వరకు పొడిగించబడింది...
https://www.educationalepiphany.org/eemt2025/registrations2025.php
“EDUCATIONAL EPIPHANY” organization is dedicated to educate and motivate the students of government schools towards continuity in learning by organizing the merit tests.