Anti Red Eye Vara Lakshmi

Anti Red Eye Vara Lakshmi Founder President For ANTI RED EYE INDIA

10 సంవత్సరాల పోరాటానికి ఫలితం  భారత్ మాతాకీ జై
20/06/2026

10 సంవత్సరాల పోరాటానికి ఫలితం భారత్ మాతాకీ జై

28/04/2026
➡️ మహిళా భద్రత కోసం 'షీ నేత్ర టీమ్స్'!➡️ జోన్‌కో బృందం చొప్పున 7 ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు➡️ అత్యాధునిక కెమెరా డిటెక్టర్లన...
11/04/2026

➡️ మహిళా భద్రత కోసం 'షీ నేత్ర టీమ్స్'!

➡️ జోన్‌కో బృందం చొప్పున 7 ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు

➡️ అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందజేసిన సీపీ సజ్జనర్

మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసు విభాగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యా సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య స‌ముదాయాల్లో నిఘా కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు షీ నేత్ర టీమ్స్ ను ఏర్పాటు చేసింది.

నగర కమిషనరేట్‌ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు షీ నేత్ర ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది. ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగం, తనిఖీల సమయంలో పాటించాల్సిన నిబంధనల ఎస్‌వోపీపై రెండు దశల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు.

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హైద‌రాబాద్ పోలీస్‌ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఈ ప్రత్యేక బృందాలకు కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాపింగ్‌ మాల్స్‌లోని ట్రయల్‌ రూమ్‌లు, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఏడు బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

తమ ప్రాంగణాల్లోని ప్రైవేటు ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, అజాగ్రత్తగా ఉన్నా లేదా కెమెరాలు లభ్యమైనా సంబంధిత యాజమాన్యాలపై అత్యంత కఠినమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఆయా సంస్థలను, బాధ్యులైన ఉద్యోగులను బ్లాక్ లిస్ట్ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

ప్రతి సంస్థ తప్పనిసరిగా 'కస్టమర్ సేఫ్టీ ఇన్ చార్జీ'ని నియమించుకోవాలని, వీరు షీ టీమ్స్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని, కెమెరా డిటెక్టర్లను యాజమాన్యం సమకూర్చుకోవాలని తెలిపారు. నిరంతరం తనిఖీలు చేస్తూ తమ ప్రాంగణం సురక్షితమని ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు.

మహిళల భద్రత సమిష్టి బాధ్యతని, ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులను గుర్తిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ నంబర్ 9490616555 కు సమాచారం అందించాలని కోరారు.

06/01/2026

బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. థియేటర్‌లోని లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా కలకలం రేగింది.
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రీ-రిలీజ్ కావడంతో ప్రేక్షకులు భారీగా థియేటర్‌కు తరలివచ్చిన సమయంలో, ఓ మహిళ లేడీస్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాను గుర్తించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన ప్రేక్షకులు థియేటర్ సిబ్బందిలో ఒకరిని పట్టుకొని దాడికి పాల్పడ్డారు. దీంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, థియేటర్‌లో పనిచేసే ఓ బాలుడు (మైనర్) లేడీస్ వాష్‌రూమ్ వద్ద రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు గుర్తించారు.








12/12/2025

గోవాకు వెళ్ళే జంటలు జాగ్రత్త!?

గోవాలో ప్రేమ జంట వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేసిన హోటల్ యజమాని

మరొకరితో పెళ్లయిందని, వదిలేయమని వేడుకున్నా వినకుండా బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హైదరాబాద్ – ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మహిళ(35), తన పెళ్లికిముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లగా, వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్(40) అనే వ్యక్తి

ఇటీవల మహిళకు ఫోన్ చేసి, గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశానని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన యశ్వంత్

తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకున్నా యశ్వంత్ వినకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సనత్‌నగర్ పోలీసులు

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Anti Red Eye Vara Lakshmi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anti Red Eye Vara Lakshmi:

Shortcuts

Share