09/08/2026
#42వ సుజన ఫౌండేషన్ వైద్య శిబిరం
చిట్టినగర్ సర్కిల్–1 కార్యాలయం వద్ద వైద్య శిబిరం, 157 మందికి వైద్య సేవలు.
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న మొబైల్ మెడికల్ క్యాంపులలో భాగంగా శనివారం చిట్టినగర్ సర్కిల్–1 కార్యాలయం వద్ద ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించగా, 157 మంది వైద్య సేవలు పొందారు.
కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్ తో పాటు బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, రక్త పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు.
సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు శిబిర నిర్వహణలో తమ సేవలను అందించారు.