Friends HOPE Helping Hands Foundation

Friends HOPE Helping Hands Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Friends HOPE Helping Hands Foundation, Nonprofit Organization, Hyderabad.

"Together,Let's Build a Hunger-Free Society Any Body Can Do Social [email protected]/- per Month-Friends HOPE HELPING HANDS Foundation

❤️❤️ మీ చిన్న సహాయం… మరొకరి ముఖంలో చిరునవ్వు!నెలకు ₹200… ఆకలితో ఉన్నవారికి అన్నదానంగా… అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా మార...
12/09/2026

❤️❤️ మీ చిన్న సహాయం… మరొకరి ముఖంలో చిరునవ్వు!

నెలకు ₹200… ఆకలితో ఉన్నవారికి అన్నదానంగా… అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా మారేందుకు తోడ్పడుతుంది. 🙏

2016 నుంచి సేవ చేస్తున్న మన Friends HOPE Helping Hands Foundationతో చేతులు కలపండి. 🤝

₹200 Monthly AutoPay ద్వారా… ప్రతి నెలా హోప్ ఫౌండేషన్ ప్రయాణం లో భాగమవ్వండి. ❤️

మీరు Join అవ్వండి… మీ Family & Friendsకి కూడా పరిచయం చేయండి.

👇 మీ సహాయ ప్రయాణం ఇక్కడ ప్రారంభించండి:

https://tinyurl.com/hope200ngo



Friends HOPE Helping Hands Foundation

FRIENDS HOPE HELPING HANDS FOUNDATION 1133/2018

❤️❤️❤️FRIENDS HOPE HELPING HANDS FOUNDATION-₹200 MONTHLY AUTO DONATION❤️❤️❤️Dear HOPE Foundation Family 🙏❤️ఇకపై మన Frien...
11/09/2026

❤️❤️❤️FRIENDS HOPE HELPING HANDS FOUNDATION-₹200 MONTHLY AUTO DONATION❤️❤️❤️

Dear HOPE Foundation Family 🙏❤️

ఇకపై మన Friends HOPE Helping Hands Foundationలో కొత్తగా Memberగా Join అయ్యే ప్రతి ఒక్కరినీ సాధ్యమైనంత వరకు ₹200 Monthly Auto Donation ద్వారా మన సేవా ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని మా ఆలోచన.

అదే సమయంలో…

ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా మన Foundationతో కలిసి నడుస్తున్న Membersకి కూడా ఒక చిన్న Request. ❤️

Donation చేయాలనే మనసు మనలో చాలామందికి ఉంటుంది…

కానీ…

Job Pressure…
Business…
Family Responsibilities…
Daily Busy Life…

ఇవన్నీ మధ్యలో కొన్ని నెలలు Donation చేయడం మర్చిపోవచ్చు.

మనం సహాయం చెయ్యాలి అనే మంచి ఆలోచన మన మనసు మర్చిపోదు…
కానీ Busy Lifeలో Date మాత్రం మర్చిపోవచ్చు. ❤️

అందుకే ఇకపై మన ఫౌండేషన్ ని Journey 2.0 ని Systematic way లో తీసుకు వెళ్లాలని దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

👇 ఈ కింద ఉన్న Link మీద Click చేసి ₹200 ఒకసారి Payment చేసి Monthly AutoPay Authorize చేస్తే చాలు.

ఆ తర్వాత ప్రతి నెలా Donation Automatically Process అవుతుంది.

అప్పుడు…

Memberకి ప్రతి నెలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది…

Foundationకి ప్రతి నెలా ఎంత Regular Support వస్తుందో ఒక Clear Picture వస్తుంది.

ఆ Clarityతో…

ఎన్ని Familiesకి Monthly Groceries ఇవ్వగలం…
ఎంత Medical Support చేయగలం…
ఎంత Education Support అందించగలం…
ఎన్ని Annadanam కార్యక్రమాలు Regularగా చేయగలం…

అనేది ముందుగానే ఒక Proper Systemగా Plan చేసుకోగలం. 🙏

One-time Donation ఒక అవసరాన్ని తీర్చవచ్చు…
Regular Donation ఒక Support Systemని Build చేస్తుంది. ❤️

₹200 ఒకరికి చాలా Small Amount కావచ్చు…

కానీ అదే ₹200 ప్రతి నెలా Regularగా వస్తే…

ఎవరో ఒక Familyకి Groceriesగా…
ఒక Patientకి Medicineగా…
ఒక Studentకి Education Supportగా…
ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి Mealగా మారవచ్చు.

ఇప్పటికే HOPE Member అయితే…

మీ Regular Donationని Monthly Auto Donationగా మార్చుకోండి.

కొత్తగా ఈ సేవా ప్రయాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే…

₹200 Monthly Auto Donationతో HOPE Familyలో Join అవ్వండి.

👉 ₹200 Monthly Auto Donation

*https://tinyurl.com/hope200ngo*

మనసులో Service ఉండటం గొప్ప విషయం…

ఆ Serviceని Regularగా కొనసాగించే System ఉండటం ఇంకా గొప్ప విషయం. ❤️

System is always System…
మనిషి Busy అవ్వొచ్చు…
కానీ ఒక మంచి System మన సేవను Continue చేస్తూనే ఉంటుంది. 🙏❤️.

రెండు నిమిషాలు మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ సపోర్ట్ అందించండి 🙏❤️

FRIENDS HOPE HELPING HANDS FOUNDATION 1133/2018

Friends HOPE Helping Hands Foundation

Together We Can Make a Difference.మీ Kindness… ఎవరో ఒకరి జీవితంలో HOPE అవుతుంది. ❤️👉 Join show your Humanity  https://ti...
10/09/2026

Together We Can Make a Difference.

మీ Kindness… ఎవరో ఒకరి జీవితంలో HOPE అవుతుంది. ❤️

👉 Join show your Humanity

https://tinyurl.com/hope200ngo

Friends Hope Helping Hands Foundation
For a Better Society 🙏❤️





వాస్తవానికి మనం చేస్తున్నది చాలా చిన్న ప్రయత్నమే అనుకున్నాం…కానీ ₹200 డొనేషన్‌తో మొదలైన మన ప్రయాణం, ఈ రోజు వరకు సుమారు ₹...
02/09/2026

వాస్తవానికి మనం చేస్తున్నది చాలా చిన్న ప్రయత్నమే అనుకున్నాం…

కానీ ₹200 డొనేషన్‌తో మొదలైన మన ప్రయాణం, ఈ రోజు వరకు సుమారు ₹200 లక్షలు — అంటే ₹2 కోట్లు అవసరంలో ఉన్నవారికి అందించగలిగిందంటే… మన ఫౌండేషన్ సామర్థ్యాన్ని మనమే కొంచెం తక్కువగా అంచనా వేసుకున్నట్టే అనిపిస్తోంది. ❤️

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే…

ఎక్కడా పెద్ద Infrastructure ఖర్చులు లేకుండా, Donations నుండి unnecessary expenses తీసుకోకుండా, ఫౌండేషన్‌కి వచ్చే ప్రతి రూపాయిని ఒక చిన్న మొబైల్ ఫోన్, సోషల్ మీడియా సహాయంతో నేరుగా అవసరంలో ఉన్నవారికి చేరవేయగలగడం నిజంగా చాలా గొప్ప విషయం.

మన Foundation Family బలం ఈ రోజు 2500+ Members.

ఇందులో సుమారు 35% మంది మాత్రమే ప్రతి నెలా ₹200 లేదా సంవత్సరంలో ఒకసారి తమకు వీలైనంత Donation అందిస్తూ వచ్చారు.

కేవలం ఈ support తోనే మనం ₹2 కోట్ల సేవా ప్రయాణాన్ని చేరగలిగాం అంటే…

ఒక్కసారి ఊహించండి…

మన Foundation లో ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా, బాధ్యతగా ప్రతి నెలా ₹200 Donation అందిస్తే మనం ఇంకెంత సేవ చేయగలం?

అది ఊహించుకుంటేనే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. 🙏❤️

ఇలాంటి ఒక Disciplined NGO System తయారవ్వడం సాధారణ విషయం కాదు. మీ అందరి నమ్మకం, సహకారం వల్లే అది సాధ్యమైంది.

@⁨all⁩ ఇప్పుడు దీనిని Next Level కి తీసుకెళ్లే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంది.

మనం చేయవలసింది చాలా చిన్న పని…

మన బాధ్యతగా ప్రతి నెలా ₹200 Donation సమయానికి Foundation కి అందేలా చూసుకోవడం.

📲 PhonePe / Google Pay:
7060273747
Friends HOPE Helping Hands Foundation

ఇప్పుడు PhonePe / Google Pay ద్వారా కొన్ని సెకన్లలోనే Donation చేయవచ్చు.

అయితే పని ఒత్తిడి వల్ల ఏదైనా నెలలో మర్చిపోతామేమో అనిపిస్తే, మన Foundation ₹200 Monthly Auto Donation Option కూడా సిద్ధంగా ఉంది:

👉 https://tinyurl.com/hope200ngo

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ మన Foundation ఏమి చేయగలదో ఇప్పటికే ఒక అంచనా వచ్చిందని భావిస్తున్నాం.

మనకు లక్షల మంది అవసరం లేదు…

మన దగ్గరే 2500+ Members ఉన్నారు.

మనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన ₹200 Donation అందిస్తూ, మన Family & Friends Circle లో కనీసం కొద్దిమందికి Foundation చేస్తున్న సేవలను నిజాయితీగా పరిచయం చేస్తే…

10,000 Helping Hands అనేది అసాధ్యమైన లక్ష్యం కాదు. 💪❤️

ఒక్కసారి ఊహించండి…

10,000 Helping Hands × ₹200 ప్రతి నెల

అంటే Foundation కి ప్రతి నెలా ₹20 లక్షల సేవా శక్తి.

ఆ శక్తితో ఎంతమందికి…

ఉపాధి కల్పించవచ్చు,
వైద్య సహాయం అందించవచ్చు,
విద్యకు తోడ్పడవచ్చు,
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టవచ్చు,
అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవవచ్చు…

అనే దానికి మనమే ఒక కొత్త ఉదాహరణగా నిలవవచ్చు.

నేను వ్యక్తిగతంగా నాకు ఉన్న Friends Circle లో మన Foundation చేస్తున్న సేవలను గర్వంగా పరిచయం చేస్తూ, నాకు పరిచయం ఉన్నవారిని కూడా ఈ ప్రయాణంలో భాగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను.

మీ అందరూ కూడా కొంచెం Support గా నిలబడండి.

ఖచ్చితంగా మనం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చేసి చూపించగలం.

ఇందులో ఎలాంటి బలవంతం లేదు.

కానీ మీకు మనస్ఫూర్తిగా ఈ Foundation ప్రయాణం నచ్చి, మనం చేస్తున్న సేవలపై నమ్మకం ఉంటే…

ప్రతి నెలా మీ ₹200 Donation ను:

📲 PhonePe / Google Pay:
7060273747

లేదా

🔁 ₹200 Monthly Auto Donation:
👉 https://tinyurl.com/hope200ngo

ద్వారా అందించి మీ Support కొనసాగించండి.

మీరు మాపై కొంచెం నమ్మకంతో నిలబడండి…

రాబోయే రోజుల్లో
“నేను కూడా ఒక గొప్ప Foundation లో Member ని”
అని మీరు గర్వంగా చెప్పుకునే స్థాయికి Friends HOPE Helping Hands Foundation ను తీసుకెళ్లే బాధ్యతను మన Admin Team తీసుకుంటుంది. ❤️🙏

మన ₹200 చిన్నదే కావచ్చు…
కానీ 10,000 Helping Hands కలిస్తే అది ఒక గొప్ప మార్పుకు ఆరంభం.

HOPE 2.0 — HOPE & HUMANITY
10,000 Helping Hands • ₹200 Per Month • One Humanity Mission

Friends HOPE Helping Hands Foundation
For a Better Society ❤️

Friends HOPE Helping Hands Foundation

FRIENDS HOPE HELPING HANDS FOUNDATION 1133/2018

 #ఆగస్టు_23 — మన HOPE ఫౌండేషన్ ప్రయాణం లో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు ❤️సెప్టెంబర్ 1, 2016…“నెలకు కేవలం ₹200తో మన చుట్ట...
23/08/2026

#ఆగస్టు_23 — మన HOPE ఫౌండేషన్ ప్రయాణం లో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు ❤️

సెప్టెంబర్ 1, 2016…

“నెలకు కేవలం ₹200తో మన చుట్టూ ఉన్న కొందరి ఆకలైనా తీరుద్దాం” అనే చిన్న ఆలోచనతో మన సేవా ప్రయాణం ప్రారంభమైన రోజు

అప్పుడు ఎటువంటి పెద్ద పెద్ద గోల్స్ లేవు……
పేరున్న వ్యక్తుల అండ లేదు…

కానీ మనసులో మానవత్వం, చేతుల్లో సేవ చేయాలనే సంకల్పం, మన వెంట నడిచిన కొద్దిమంది నిజమైన Helping Hands మాత్రమే ఉన్నారు. 🤝

ఆ చిన్న ఆలోచనే ఎంతోమంది మంచి మనసులను కలిపింది.
ఒకరి ఆశ మరొకరి బాధ్యతగా మారింది…
ఒకరి కష్టం అందరి కష్టంగా మారింది…
అలా స్నేహితులతో ప్రారంభమైన సేవా ప్రయాణం
Friends HOPE Helping Hands Foundationగా రూపుదిద్దుకుంది.

ఈ ప్రయాణంలో మరో చారిత్రక అడుగు…

23 ఆగస్టు 2018

ఈ రోజునే మన Friends HOPE Helping Hands Foundation, తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం–2001 ప్రకారం అధికారికంగా సొసైటీగా నమోదు చేయబడింది.

📜 రిజిస్ట్రేషన్ నంబర్: 1133/2018

2016లో పుట్టిన సేవా సంకల్పానికి…
2018లో చట్టబద్ధమైన గుర్తింపు లభించింది.

రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు…
మన సేవకు వచ్చిన బాధ్యత!
మనపై మన డోనార్స్ ఉంచిన నమ్మకం!
మన ప్రయాణానికి లభించిన శాశ్వత గుర్తింపు!

అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నదానం, నిత్యావసర సరుకులు, వైద్య సహాయం, విద్యా సహకారం, వృద్ధులు–దివ్యాంగులకు చేయూత వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా అవసరంలో ఉన్నవారికి మన HOPE కుటుంబం అండగా నిలుస్తోంది. 🙏

ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ ఒక అన్నపు ముద్దగా…
ఎక్కడ కన్నీరు ఉంటే అక్కడ ఒక ఓదార్పుగా…
ఎక్కడ నిరాశ ఉంటే అక్కడ ఒక HOPEగా…
మన Helping Hands సేవా ప్రయాణం నిరంతరం కొనసాగుతోంది.

ఈరోజుతో మన ఫౌండేషన్ చట్టబద్ధంగా నమోదై 8 సంవత్సరాలు పూర్తయ్యాయి.
అదే సమయంలో, సెప్టెంబర్ 1, 2016న ప్రారంభమైన మన సేవా ప్రయాణం విజయవంతమైన పది సంవత్సరాల మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. ❤️

ఈ మహత్తర ప్రయాణంలో భాగమైన ప్రతి సభ్యుడికి, అడ్మిన్‌కు, వాలంటీర్‌కు, దాతకు, శ్రేయోభిలాషికి మరియు ప్రతి Helping Hand‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 💐

మీరు అందించిన ప్రతి ₹200…
ఎవరో ఒకరి ఆకలిని తీర్చింది.
మీరు చాచిన ప్రతి చేయి…
ఎవరో ఒకరి జీవితంలో ఆశను నింపింది.

వ్యక్తులు మారవచ్చు…
కాలం మారవచ్చు…
కానీ మన సేవా సంకల్పం మారకూడదు!

మన మొదటి పది సంవత్సరాలు HOPEకు బలమైన పునాది…
ఇక ప్రారంభమయ్యేది మరింత బాధ్యతతో కూడిన
HOPE FOUNDATION 2.0 – నిజమైన సేవా ప్రయాణం!

“మనం చేసే మంచి కనిపించాలి…
కానీ మనిషి కనిపించనవసరం లేదు.”

❤️ Friends HOPE Helping Hands Foundation
📜 Reg. No: 1133/2018
🌱 Since 2016
🤝 Hope • Humanity • Helping Hands
✨ For a Better Society

FRIENDS HOPE HELPING HANDS FOUNDATION 1133/2018








❤️ FRIENDS HOPE HELPING HANDS FOUNDATION – *ముఖ్య సమాచారం* ❤️🫀 *చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు – NIMS, హైదరాబాద్...
13/08/2026

❤️ FRIENDS HOPE HELPING HANDS FOUNDATION – *ముఖ్య సమాచారం* ❤️

🫀 *చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు – NIMS, హైదరాబాద్*

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే సమాచారం. 🙏

🏥 Nizam’s Institute of Medical Sciences (NIMS), Hyderabad లో

*ఈ ఆగస్టు 13, 2026 నుండి ఒక వారం పాటు చిన్నారులకు అవసరమైన గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించనున్నట్లు సమాచారం*.

🔹 గుండె శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులను ముందుగా పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

🔹 శస్త్రచికిత్సకు అర్హులుగా గుర్తించిన చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తారు.

🔹 *ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు*.

🔹 *గతంలో చేయించిన వైద్య పరీక్షలు, రిపోర్టులు ఉంటే తప్పకుండా తీసుకువెళ్లండి*.

📍 సంప్రదించవలసిన విభాగం:
CT Surgery Office
1st Floor, Old Block
NIMS, Hyderabad

🕗 సమయం:
*సోమవారం నుండి శనివారం వరకుఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు*

🙏 ముఖ్యమైన సమాచారం కాబట్టి అవసరమైన వారికి SHARE చేయండి.

గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు కుటుంబానికి ఈ సమాచారం చాలా ఉపయోగకరం

ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడే అవకాశానికి మన Share ఒక వారధి కావచ్చు. ❤️

🤝 Friends HOPE Helping Hands Foundation

FRIENDS HOPE HELPING HANDS FOUNDATION 1133/2018

For a Better Society
HOPE • HUMANITY • HELPING HANDS

🙏💞💞💞 FRIENDS HOPE HELPING HANDS FOUNDATION -NEEDY FAMILY SUPPORT (May-2026)💞💞💞🙏శారీరక వైకల్యం ఉన్నా… సేవ చేయాలనే సంకల్పా...
24/05/2026

🙏💞💞💞 FRIENDS HOPE HELPING HANDS FOUNDATION -NEEDY FAMILY SUPPORT (May-2026)💞💞💞🙏

శారీరక వైకల్యం ఉన్నా… సేవ చేయాలనే సంకల్పానికి ఎలాంటి వైకల్యం ఉండదని నిరూపిస్తున్న వ్యక్తి మన కాకినాడ హోప్ ఫౌండేషన్ అడ్మిన్ శ్రీ Suri Babu Dasari గారు.

హోప్ ఫౌండేషన్ లో కొత్తగా పరిచయం అవసరం లేని కాకినాడ జిల్లా కురాడ గ్రామానికి చెందిన శ్రీ దాసరి సూరిబాబు గారు, గత 9 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ, అవసరమైన కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ నిజమైన సేవాభావాన్ని చూపించడం నిజం గా స్ఫూర్తిదాయకం🙏❤️

శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ…
వారి ఇబ్బంది ని పక్కన పెట్టి, ఇతరుల కష్టాలను తగ్గించడానికి ముందుకు రావడం నిజంగా గొప్ప విషయం.
చేతి కర్ర సహాయంతో నడుస్తూ కూడా ఇంటింటికీ వెళ్లి కిరాణా సరుకులు అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. 🌸

సేవ చేయడానికి శరీర బలం కాదు… మనసులో ఉన్న మానవత్వం ముఖ్యం అని చెప్తున్న సూరిబాబు గారి జీవితం సోషల్ సర్వీస్ మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం

వారి సహకారంతో ఈ మే-2026 నెలలో కూడా కురాడ – కాకినాడ ప్రాంతంలో పలువురు అతి పేద, వృద్ధులు మరియు అవసరమైన కుటుంబాలకు ఫ్రెండ్స్ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరపున కిరాణా సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. 🛍️🤝

ఈ సేవల వెనుక ఉన్న అసలు శక్తి – ప్రతి నెల ₹200 విరాళం అందించే దాతలే.

మన నెలకు ₹200 సహాయం…
➡️ ఒక ఆకలితో ఉన్న కుటుంబానికి ఆహారం అవుతుంది
➡️ ఒక వృద్ధుడికి ఆశగా మారుతుంది
➡️ సేవ చేయాలనే మనసున్న వ్యక్తులకు బలంగా నిలుస్తుంది
➡️ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలకు అండగా ఉంటుంది ❤️

“మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు…
మన వల్ల ఎంత మంది సహాయం పొంది సంతోషంగా ఉన్నారు అనేదే నిజమైన సంపద.”

శ్రీ దాసరి సూరిబాబు గారి సేవాస్ఫూర్తికి హృదయపూర్వక అభినందనలు 💐👏
ఇలాంటి సేవామూర్తులు మన ఫౌండేషన్‌కు గర్వకారణం. 🌟

కాకినాడ ప్రాంతంలో మన ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న శ్రీ సూరిబాబు గారికి, పెద్దలు మల్లి బాబు గారికి,యరీష్ గారికి,నరేష్ గారికి హోప్ ఫౌండేషన్ తరపున హ్రుదయపూర్వక అభినందనలు 👏👏🙏🙏❤️❤️ నెలకు రెండు వందల రూపాయల డొనేషన్ తో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న మిత్రులు అందరికి ఫౌండేషన్ తరపున హ్రుదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏👏👏❣️❣️❤️❤️

Friends HOPE Helping Hands Foundation

💞💞💞 Friends Hope Helping Hands Foundation -Birthday wishes 💐💐🎂🎂❤️❤️💞💞💞ఈ రోజు పుంగనూరు మండలం ఇటుకనెల్లూరు వాస్తవ్యులు చిర...
21/05/2026

💞💞💞 Friends Hope Helping Hands Foundation -Birthday wishes 💐💐🎂🎂❤️❤️💞💞💞

ఈ రోజు పుంగనూరు మండలం ఇటుకనెల్లూరు వాస్తవ్యులు చిరంజీవి k. మొక్షిత్ సాగర్ పుట్టినరోజు సందర్భంగా

తల్లిదండ్రులు సాగర్ గారు,సువర్ణ గారు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన హోప్ ఫౌండేషన్ తరపున గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని మొల్లమాంబ వ్రుద్దుల ఆశ్రమం లో *ఉదయం వ్రుద్దులకు అల్పాహారం* మరియు ఒంగోలు దగ్గర పొదిలి ప్రాంతంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయటం జరిగింది.

అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ హోప్ ఫౌండేషన్ తరపున అన్నదానం అవకాశం కల్పిస్తున్న సాగర్ గారి కుటుంబ సభ్యులకు ఫౌండేషన్ తరపున హ్రుదయపూర్వక అభినందనలతో చిరంజీవి మొక్షిత్ సాగర్ కి హోప్ ఫౌండేషన్ తరపున ప్రేమ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 👏👏🙏🙏💐💐🎂🎂❤️❤️

Friends HOPE Helping Hands Foundation

💞💞💞PROJECT-  FRIENDS HOPE HELPING HANDS FOUNDATION NGO's SUPPORT(MAY-2026)💞💞💞బిజీ జీవితాల్లో బ్రతుకుతున్న మనం ఒక అనాధ ఆశ...
21/05/2026

💞💞💞PROJECT- FRIENDS HOPE HELPING HANDS FOUNDATION NGO's SUPPORT(MAY-2026)💞💞💞

బిజీ జీవితాల్లో బ్రతుకుతున్న మనం ఒక అనాధ ఆశ్రమాన్నో , వ్రుద్దాశ్రమాన్నో పెట్టి సర్వీస్ చెయ్యలేక పోవచ్చు కానీ అలా పెట్టి నిజాయితీగా నడుపుతున్న వారికి కనీసం సపోర్ట్ చెయ్యగలం అనే ఆలోచనతో మొదలైనదే మన *HOPE HELPING HANDS FOUNDATION - NGO's SUPPORT*

ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నిజాయితీగా, సోషల్ సర్వీస్ నే జీవితం గా భావించి ఎవరైతే అనాధ ఆశ్రమాలు, వ్రుద్దుల ఆశ్రమాలకు నడుపుతున్నారో అలాంటి NGO's లో ఆశ్రయం ఇచ్చిన వారికి బోజన సౌకర్యాలు కొసం ఇబ్బంది పడుకుండా చూడటం

ఇలాంటి ఉద్దేశ్యం తోనే November -2024 నుంచి ప్రారంభమైన ఈ ప్రాజెక్టు లో ఈ MAY-2026 నెలకు సంబంధించి

25 సంవత్సరాలుగా ఎందరో వ్రుద్దులకు ఆశ్రయం ఇస్తూ గుంటూరు జిల్లా , బాపట్ల జిల్లా లలో 4 వుద్దాశ్రమాలను నడిపిస్తున్న ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ గ్రూప్ కి సంబంధించి

1.బాపట్ల జిల్లా, పర్చూరు మండలం నూతలపాడు లోని ఆశ్రయ వ్రుద్దుల ఆశ్రమానికి,

2.ఇంకొల్లు ప్రాంతం వంకాయలపాడు లో ఉన్న ఆసరా వ్రుద్దాశ్రమానికి నెలా వారి బోజనానికి అవసరం ఉన్న నిత్యావసర వస్తువుల అందించడం లో భాగంగా ఈ May -2026 నెలకు సంబంధించి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది

అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏🩷🩷🩷

FRIENDS HOPE HELPING HANDS FOUNDATION 1133/2018

Friends HOPE Helping Hands Foundation

💞💞💞 FRIENDS HOPE HELPING HANDS FOUNDATION – BIRTHDAY WISHES 🎂🎂💐💐❤️❤️💞💞💞On this joyful occasion, Friends Hope Helping Han...
20/05/2026

💞💞💞 FRIENDS HOPE HELPING HANDS FOUNDATION – BIRTHDAY WISHES 🎂🎂💐💐❤️❤️💞💞💞

On this joyful occasion, Friends Hope Helping Hands Foundation extends heartfelt birthday wishes to our valued supporters and well-wishers:

🌸 Ms. Sai Sathisha Garu
🌸 Sri Chintapalli Venkatesh Garu
🌸 Sri Kunapureddy Prasad Garu
🌸 Sri Chadalavada Siva Balakrishna Garu

Your kindness, encouragement, and support inspire us to continue our journey of service and compassion. Every helping hand, every positive thought, and every act of humanity strengthens our mission to build a better society.

May this special year bless you with:

✨ Good Health
✨ Endless Happiness
✨ Great Success
✨ Prosperity and Peace
✨ Beautiful Memories with Family & Friends

As Friends Hope Helping Hands Foundation moves proudly towards completing 10 years of service, we are grateful to have compassionate people like you walking beside us in this journey of hope.

🎉 May your birthdays be filled with smiles, love, and blessings, and may your lives continue to inspire many more hearts.

With warm wishes and gratitude,

Friends HOPE Helping Hands Foundation

“Together We Care • Together We Serve • Together We Change Lives” ❤️🙏

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Friends HOPE Helping Hands Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Friends HOPE Helping Hands Foundation:

Shortcuts

Share