24/05/2016
IIIT బాసర అడ్మిషVన్ నోటిఫికేషన్ (2016-17)
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం --RGUKT-బాసర.
6 సం.సమీకృత ఇంజినీరింగ్ డిగ్రీ(2016-17) విద్య సంవత్సరానికి ప్రవేశ ప్రకటన:
👉తేది: 5-5-2016 రోజున No:1/RGUKT(TS)/B.TECH/Admissions/2016 ప్రకటన ద్వార నోటిఫికేషన్ విడుదల చేసింది.
*ప్రవేశ అర్హత*
👉SSC లేదా సమానమైన పరీక్షా 2016 లో రెగ్యులర్ విద్యార్థులుగా ప్రథమ ప్రయత్నంలో ఉతీర్ణులయి ఉండాలి.
👉 తేది: 31.12.2016 నాటికి వారి వయస్సు 18 సం. మించకూడదు.(sc/st వారికి 21 సం. వరకు)
*దరఖాస్తు చేసుకునే విధానం*
👉 కేవలం AP online సర్వీస్ ద్వార మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
👉 online లో తేది:6.5.2016 నుండి apply చేసుకోవచ్చు.
👉online లో దరఖాస్తు సమర్పించుటకీ చివరి తేది: 31.5.2016.
👉 ప్రింటౌట్ తీసిన దరఖాస్తు సమర్పించుటకు చివరి తేది: 5.6.2016.
*దరఖాస్తు ఫీజు*
👉OC, BC లకు రూ:200.
👉SC, ST లకు రూ: 150.
*గమనిక*
👉 *ఒకటికంటే ఎక్కువ సార్లు apply చేస్తే చివరగా చేసిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు*
*ఎంపిక*
👉 ప్రవేశాలు 10వ తరగతి లో సాధించిన GPA( గ్రేడ్ పాయింట్ యావరేజ్),ప్రతి సబ్జెక్టు లో అభ్యర్థి పొందిన గ్రేడ్ ప్రతిభ ల ఆధారంగా మరియు రూల్ అఫ్ రిజర్వేషన్స్ కి లోబడి వుంటాయి.
👉ప్రభుత్వ ఆదేశాలు & RGUKT నియమ నిబంధనలను అనుసరించి ప్రవేశాల కోసం Non-residential ప్రభుత్వ పాఠశాలలు,జిల్లా పరిషత్ మరియు మునిసిపల్ పాఠశాలల్లో చదివిన వారికి GPA కు అదనంగా 0.4 పాయింట్స్ డిప్రెవేషన్ స్కోర్ కలుపబడుతుంది.
👉రాష్ట్రపతి & ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మొత్తం సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకు ,15% unreserved సీట్లు తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయించబడును.
👉ఈ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కాకా వేరే రాష్ట్రాల వారికి,అంతర్జాతీయ విద్యార్థులకు మరియు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కలవు.
*దరఖాస్తు సమర్పించాక ప్రింట్ తీసుకోని దానితో పాటు జాతపరుచాల్సిన సర్టిఫికెట్స్*
👉AP online ఫీజు రిసిప్ట్.
👉 10వ తరగతి హాల్ టికెట్ XEROX.
👉 స్టడీ సర్టిఫికెట్స్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు.
👉 10వ తరగతి Result copy online లో ప్రింట్ తీసినది.
👉 కుల ధ్రువీకరణ సర్టిఫికేట్.
👉 రిజర్వు కేటగిరీ అభ్యర్థులు వారి దృవీకరణలు ఉదాహరణకు వికలాంగులు,ఆర్మీ వారి పిల్లలు,NCC, sports మొదలగునవి.
*ఎంపిక అయ్యాక వారికి పోస్టు ,మెయిల్,SMS ద్వార మరియు అధికారిక website ద్వార తెలియజేస్తారు.*
*కౌన్సిలింగ్ సమయం లో అభ్యర్థులు వ్యక్తిగతంగా RGUKT బాసర లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావలి*.
*Annual ఫీజు రూ:37,000 ఉంటుంది సెమిస్టర్ ఫీజు తో కలుపుకొని ,ఫీజు రేయింబర్స్మెంట్ ఉన్నవారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు*
*అడ్మిషన్ సమయం లో రిజిస్ట్రేషన్,caution deposit, మెడికల్ insurance అన్నీ కలుపుకొని రూ:3500 (sc, st లకు రూ:3000) కట్టాలి*
*వివరాలకు*
www.rgukt.ac.in
http:/admissions.rgukt.ac.in.
మొబైల్ no's:
9000665914.(భాను ప్రియ).
9000665814
(9:30--5:30 అన్ని పని దినములలో).