Jana Vignana Vedika Hyderabad

Jana Vignana Vedika Hyderabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jana Vignana Vedika Hyderabad, Hyderabad.

            *వేసవి సృజనోత్సవం కార్యక్రమాలు విజ్ఞాన భాండాగారాలు.. జన విజ్ఞాన వేదిక(JVV)* జన విజ్ఞాన వేదిక  జూబ్లీహిల్స్ జ...
23/05/2026


*వేసవి సృజనోత్సవం కార్యక్రమాలు విజ్ఞాన భాండాగారాలు.. జన విజ్ఞాన వేదిక(JVV)*

జన విజ్ఞాన వేదిక జూబ్లీహిల్స్ జోన్ కమిటీ (Hyderabad) ఆధ్వర్యంలో బ్రహ్మం టాలెంట్ స్కూల్ వెంగళరావు నగర్ లో నిర్వహించిన సమ్మర్ సైన్స్ క్యాంపు ఆరు రోజుల పాటు ఉత్సాహభరితంగా కొనసాగి విజయవంతంగా ఈరోజు ముగిసింది.

స్టోరీ టెల్లింగ్ ,సరదా సైన్స్, ఫన్ మాథ్స్ ,మూఢనమ్మకాలు - సైన్స్ ,పాడుతాం పాటలు, ఖగోళం కనుక్కుందాం, ఓరుగామి లాంటి అంశాలపై విద్యార్థులకు ఆయా రంగాల్లో నిపుణులు అవగాహన కల్పించారు.జరిగింది.ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులు తము నేర్చుకున్న నైపుణ్యాలను ఆనందంగా ప్రదర్శించారు.

రిసోర్స్ పర్సన్లు చంద్రయ్య, వి.ఆర్ శర్మ, రమణ, దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ రుక్మిణి, నాగరాజు , విజయ్ కుమార్ తమ అనుభవాలను పంచుకుంటూ, విద్యార్థులలో వచ్చిన మార్పులను వివరించారు.

ఈ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించిన జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ గౌరవ అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర రావు విద్యార్థులతో మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే ప్రశ్నించే స్వభావం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, శాస్త్రీయ దృక్పథం పాఠశాల దశలోనే అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.

ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం .శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థులకు అనుభవాధారిత విద్య ( అందించబడింది. శాస్త్రీయ ప్రయోగాలు, సమకాలీన అంశాలపై చర్చలు, ఇండోర్ గేమ్స్, హాబీల అభివృద్ధి వంటి విభిన్న కార్యకలాపాలు విద్యార్థులలో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందించాయి.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

జన విజ్ఞాన వేదిక సమతా విభాగ రాష్ట్ర ఉప కన్వీనర్ డాక్టర్ పి.రజిని మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు ల ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని ,సమాజంపై అవగాహనను పెంచుతున్నామని చెప్పారు. సమాజముతోనే సైన్సు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సైన్స్ రంగాన్ని పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సైన్స్ పరిశోధనలకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపించారు. సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులకు వివిధ అంశాల పైన సంపూర్ణ అవగాహన కల్పించామని చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెట్టడానికి సైన్స్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.

వేసవికాలంలో విద్యార్థులకు నిర్వహించే సమ్మర్ క్యాంపులు వారిలో విజ్ఞానాన్ని పెంచడానికి ఎంతో దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ట్రెజరర్ నాగరాజు అన్నారు.

జె వి వి సీనియర్ నాయకులు మరియు ఉపాధ్యాయులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సమ్మర్ సైన్స్ క్యాంపు ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.

జె వి వి సీనియర్ నాయకులు ఎస్ జితిన్ ప్రసాద్ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని.. వారికి సమాజం పట్ల సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరం అన్నారు.

ఈ సందర్భంగా క్యాంప్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు మరియు బహుమతులు బ్రహ్మం టాలెంట్ స్కూల్ డైరెక్టర్ కె హరీష్ చేతుల మీదుగా అందజేశారు.

ఆరు రోజులు పాటు పిల్లలకు అల్పాహారం ఏర్పాట్లు చేసిన జెవివి జోన్ కార్యదర్శి వై.యాదగిరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన బ్రహ్మం టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర ప్రధాన కార్యదర్శి ఎం రవీంద్రబాబు, జూబ్లీహిల్స్ జోన్ ప్రధాన కార్యదర్శి వై యాదగిరి, సహాయ కార్యదర్శి జి .రాజశేఖర్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఎస్ జితిన్ ప్రసాద్, ఎన్.పాపారావు, ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

JVV Telangana online Study Circle
18/04/2026

JVV Telangana online Study Circle

రాష్ట్ర సమతా సబ్ కమిటీ ఆధ్వర్యంలో10-01-2026) మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని గబ్బిలాల్ పేట్ బస్తీలో సావిత్రిబాయి, ఫాతిమా ...
11/01/2026

రాష్ట్ర సమతా సబ్ కమిటీ ఆధ్వర్యంలో10-01-2026) మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని గబ్బిలాల్ పేట్ బస్తీలో సావిత్రిబాయి, ఫాతిమా షేక్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. బస్తీ పిల్లలు సావిత్రిబాయి, ఫాతిమా షేక్ జీవిత గాథను నాటకంగా ప్రదర్శించారు. సాయి గాయత్రి, హరి పిల్లలకు కెరీర్ గైడెన్స్ సెషన్స్ నిర్వహించారు. కుమారి గ్రీష్మ బృందం చేసిన కూచిపూడి నృత్య రూపకం ఈ కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. చివరలో తెలంగాణ సమతా సబ్ కమిటీ కన్వీనర్ విమల జన విజ్ఞాన వేదిక ప్రచురించిన పుస్తకాలను పిల్లలకు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సమత సబ్ కమిటీ కన్వీనర్ శాంతి ఈశాన్, CRY మేడ్చల్ జిల్లా హెడ్ హిమ బిందు, సమత సభ్యులు ఉదయలక్ష్మి, శైలజ, పద్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు.

*సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం భారతదేశంలో మహిళా, బాలికల అభివృద్ధి కోసం పాటుపడదాం , తెలంగాణ రాష్ట్రంలో  సంపూర్ణ ...
03/01/2026

*సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం భారతదేశంలో మహిళా, బాలికల అభివృద్ధి కోసం పాటుపడదాం , తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ మహిళ అక్షరాస్యత కొరకు పని చేద్దాం*
ప్రముఖ రచయిత తోట అపర్ణ గారు పిలుపునివ్వడం జరిగింది. సావిత్రిబాయి పూలే 195 వ జయంతి శనివారం 03-01-2026 న బోరబండ బాలికల రెసిడెన్షియల్ హై స్కూల్ లో సమతా కమిటీ జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రవీంద్రబాబు అధ్యక్షత వహించారు.
ఆమె భారతదేశపు మొదటి పంతులమ్మ శూద్రులకు, మహిళలకు విద్య నేర్పిన అప్పుడే దేశం బాగుపడుతుందని తను చదువుకొని 1848లో నే మహిళల కోసం 58 పాఠశాలలో నిర్వహించి సతీసహగమనం బాల్య వివాహాలు అంటరానితనం వ్యతిరేకంగా పోరాడి ఎన్నో అవమానాలు భరించి ప్రజల కోసం పాటుపడ్డ సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలని పిలుపునివ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత 57% గానే ఉందని మిగతా 43% కూడా సాధించడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
మహిళలు అక్షరాస్యత సాధిస్తేనే ఈ సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు.
JVV సమత హైదరాబాద్ సిటీ కన్వీనర్ శాంతి ఇషాన్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ప్రజలందరికీ విజ్ఞానాన్ని, సైన్స్ ను సులువుగా అర్థం చేసేది విధంగా అనేక కార్యక్రమాలు చేస్తుందని మీరందరూ కూడా ప్రశ్నించాలని ఎందుకు, ఎలా ,ఏమిటి, ఎప్పటికీ మదిలో ఉండాలని తెలియజేయడం జరిగింది.
కుటుంబ కేంద్రబిందువైన మహిళ సాధికారికత సాధిస్తేనే ఈ సమాజం ముందుకు వెళుతుందని అది గుర్తించి మహిళా అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవడం మనందరి యొక్క బాధ్యత అని జెవివి హైదరాబాద్ సిటీ గౌరవాధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర రావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఇంచార్జ్ సౌజన్య ,జయంతి ఇతర ఉపాధ్యాయునిలు, జెవివి సీనియర్ నాయకులు ఎస్ జితిన్ ప్రసాద్ ,ఆర్ వెంకటేశ్వరరావు జెవివి జూబ్లీహిల్స్ జోన్ సభ్యులు వై ప్రేమ్ , సూర్య తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఆడపిల్లలు రాణించాలి - JVVసావిత్రిబాయి ఫూలే ఆలోచనలు నేటి సమాజానికి ఎంతగానో అవసరమని ప్రముఖ సా...
03/01/2026

సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఆడపిల్లలు రాణించాలి - JVV

సావిత్రిబాయి ఫూలే ఆలోచనలు నేటి సమాజానికి ఎంతగానో అవసరమని ప్రముఖ సామాజిక కార్యకర్త, శిశు సంక్షేమ కమిటీ మాజీ చైర్ పర్సన్, న్యాయవాది పి. శ్యామలాదేవి అన్నారు. జనవిజ్ఞాన వేదిక సమత సబ్ కమిటీ ,ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉస్మానియా క్యాంపస్ లో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో శ్యామలాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన సావిత్రిబాయి ఫూలే, బాలికల విద్య కోసం తొలి పాఠశాలను ప్రారంభించి అనేక అవమానాలు, కష్టాలను ఎదుర్కొని సమాజంలో విద్యా కాంతులు నింపారని పేర్కొన్నారు. ప్రముఖ కవయిత్రి, యువ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ విద్యార్ధినుల్లో స్ఫూర్తిని నింపారు. సావిత్రి బాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మహిళలు, దళితులు, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. వితంతు వివాహాలను ప్రోత్సహించడం, బాల్యవివాహాల నిర్మూలన, సామాజిక మూఢనమ్మకాలపై పోరాటం వంటి అంశాల్లో సావిత్రిబాయి పూలే మహిళలను ముందుండి నడిపించారని ఆంధ్ర మహిళా సభ మాజీ కరస్పాండెంట్ డాక్టర్ పి. రజిని గుర్తు చేశారు.
విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, ముఖ్యంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని క్రై స్వచ్ఛంద సంస్థ మేడ్చల్ జిల్లా హెడ్ హిమా బిందు అన్నారు. బాలల రక్షణ, వారి హక్కుల పరిరక్షణలో సమాజం బాధ్యత తీసుకోవాలని సూచించారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో బాలికలు, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే శక్తిని సంపాదించుకోవాలని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా పిలుపునిచ్చారు. ఆడపిల్లలంతా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని. అన్నారు.
దేశంలో మెజారిటీ ప్రజలైన శూద్రులు, మహిళలకు చదువు నేర్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొని ఆడారు. అట్టడుగు వర్గాల విద్యాసామాజిక సమానత్వం కోసం తుది విశ్వాస వరకు కృషిచేసిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి ఆదర్శప్రాయురాలని కొనియాడారు.
అనేక అవమానాలు చీత్కారాలు ఎదుర్కొని నాగరిక సమాజాన్ని నిర్మించటానికి కృషిచేసిందన్నారు. ఆయుధం కంటే అక్షరమే గొప్పదని అక్షరజ్ఞానాన్ని అందరికీ అందించడం ద్వారా ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తినిస్తుందన్నారు.
పూలే దంపతుల యొక్క కృషి త్యాగం ఈ దేశ ప్రజలు తరతరాలు గుర్తుండి పోతుందని చెప్పారు.
అన్ని రకాల అసమాన తలపై అందరూ స్పందించాలని చెప్పారు. విద్యా ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జెవివి హైదరాబాద్ సమత సబ్ కమిటీ కన్వీనర్ శాంతి, సభ్యులు, కస్తూరి, శరణ్య , ఆంధ్ర మహిళా సభ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణా దేవి , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై. వసుంధర, అధ్యాపకులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ అలివేణి, డాక్టర్ హిమబిందు తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

A Visit to Tharuni NGO by Hyd Samata Subcommittee:ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని (14-12-2025) హైదరాబాద్ సమతా సబ్...
19/12/2025

A Visit to Tharuni NGO by Hyd Samata Subcommittee:
ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని (14-12-2025) హైదరాబాద్ సమతా సబ్ కమిటీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా de డిసెంబర్ 14న తరుణి సంస్థను సందర్శించింది. సామాజిక కార్యకర్త మమతా రఘువీర్ స్థాపించిన తరుణి- పోక్సో బాధిత బాలికలకు, మద్యం, మొబైల్ ఫోన్ వ్యసనాల బారినపడ్డ మహిళలకు పునరావాసం కల్పించే ప్రభుత్వేతర సంస్థ (NGO). చైతన్యపురిలో ఏర్పాటు చేసిన తరుణి శాఖ పని తీరును హైదరాబాద్ సమతా సబ్ కమిటీ సభ్యులు తెలంగాణ సమత సబ్ కమిటీ కో కన్వీనర్, హైదరాబాద్ జిల్లా JVV కమిటీ గౌరవాధ్యక్షురాలైన పి. రజిని ఆధ్వర్యంలో పరిశీలించారు. మమతా రఘువీర్ తమ సంస్థ కార్యకలాపాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా అంకెల మావయ్య చంద్రయ్య చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇకపైన ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మమని, ప్రతి విషయాన్నీ హేతుబద్ధంగా తర్కిస్తామని పిల్లలు మామయ్యకు మాట ఇచ్చారు.
సమతా సబ్ కమిటీ సభ్యురాలు సుచిత్ర నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ కూడా పిల్లలను ఉత్సాహపరిచింది. చివరగా హిప్నోథెరపిస్ట్, RJ స్వాతి కండక్ట్ చేసిన motivational session పిల్లలను అమితంగా ఆకట్టుకుంది. సమతా సబ్ కమిటీ ప్రతి రోజు నిర్వహిస్తున్న online study hall లో తమ పిల్లలను కూడా join చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. Skill development శిక్షణలో భాగంగా బాలికలు తయారుచేసిన గాజులు, బ్యాగులు, కుకీలను సమతా సభ్యులు కొందరు కొనుక్కున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమత సబ్ కమిటీ కన్వీనర్ విమల, కో కన్వీనర్ రజని, హైదరాబాద్ సమత సబ్ కమిటీ కన్వీనర్ శాంతి, కో కన్వీనర్ సుచిత్ర, సామాజిక కార్యకర్త శ్యామల, ఇంకా సమతా సభ్యులు శివలక్ష్మి, రేణుక, సక్కుబాయి, మహేశ్వరి, శరణ్య, మౌనిక, స్వాతి, JVV సభ్యులు చంద్రయ్య, దుర్గాప్రసాద్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

కూకట్ పల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ జడ్పీ హైస్కూల్లో ఈరోజు (17-12.2025)  200 ఔషధ మొక్కల పంపిణీ జరిగింది. ట్రెజర...
18/12/2025

కూకట్ పల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ జడ్పీ హైస్కూల్లో ఈరోజు (17-12.2025) 200 ఔషధ మొక్కల పంపిణీ జరిగింది. ట్రెజరర్ సూర్యనారాయణ గారు గంత కొంత కాలంగా జోన్ పరిధిలోని పాఠశాలల్లో మొక్కలు పంచుతూ వస్తున్నప్పటికీ ఇంతటి భారీ సంఖ్యలో, అందునా కేవలం ఔషధ విలువలున్న మొక్కలు పంచడం ఇదే మొదటిసారి. ఇందుకు ప్రతిగా స్కూలు యాజమాన్యం పిల్లలందరితో సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా JVV కమిటీ సభ్యులు సంస్థ ఆశయాలను, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ అంకితభావాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ సూర్యనారాయణతో పాటు JVVకూకట్ పల్లి జోన్ కమిటీ అధ్యక్షురాలు శాంతి, కార్యదర్శి గణేశ్, కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, మాలతి, వాణి పాల్గొన్నారు.

Jana Vignana Vedika Telangana Hyderabad City Committee and Austronomy Department of Osmania University jointly Conducted...
07/12/2025

Jana Vignana Vedika Telangana Hyderabad City Committee and Austronomy Department of Osmania University jointly Conducted Sky Watch program.... 06-12-2025

Hyderabad District Level Chekumukhi Science Sambaralu -202528-11-2025
04/12/2025

Hyderabad District Level
Chekumukhi Science Sambaralu -2025
28-11-2025

Address

Hyderabad
500044

Website

Alerts

Be the first to know and let us send you an email when Jana Vignana Vedika Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jana Vignana Vedika Hyderabad:

Share