08/07/2021
ఓం నమఃశ్శివాయ - ఓం శ్రీ సాయినాథాయ నమః, గురుబోధ:-
"పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజీ బోధామృతము".
ఎల్లరూ తప్పక చదవవలసిన జరిగిన కధ.
ఒక పాప దగ్గిర పెట్టెలో కొన్ని ముత్యాలు ఉన్నాయి. ఆ పాప వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. ఒక రోజు ఆ పాప పడుకుని వుండగా తండ్రి ఆమె పక్కనే కూర్చుని, "నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా" అని అడిగాడు.
"అవంటే నాకిష్టం డాడీ, నేను పెద్దవుతున్నాగా కావాలంటే నా బేబీ డాల్ తీసుకో" అంది.
"థాంక్యూ వద్దులే అమ్మా ఐ లవ్యూ" అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి.
అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చొని "నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ" అని అడిగాడు.
"సారీ డాడీ, కావాలంటే నా సైకిల్ తీసుకో పెద్దయ్యాగా" అంది.
"వద్దులే అమ్మా థాంక్యూ డాడీ లవ్స్ యు" అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది.
ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయానికి వెళ్లింది. అక్కడ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా వింది.
ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ, "తీసేసుకో డాడీ నాకివీ అవసరంలేదు" అంది.
అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ "వీటిని నీకిద్దామని ఎప్పటినుంచో నా దగ్గిరే వుంచుకున్నాను. ఇవి నిజమైన ముత్యాలు. ఇప్పటివరకూ నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి తల్లీ" అంటూ కూతురికి అందించాడు అసలైన ముత్యాలని. ముందువాటి కన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తునాయి. ఆ పాప కళ్ళలాగే.
శ్రీ స్వామీజి వ్యాఖ్యానము మరియూ ఈ కథ నీతి: భగవంతుడు కూడా ఇలాగే అసలు ముత్యాలయిన ఆనందం, ప్రేమ ప్రకృతి పట్ల ఇష్టం, భూతదయ, సంగీతం పట్ల ఆరాధన, సర్వ జీవుల ఎడల కరుణ, ఆప్యాయత మొదలైన గుణాల్ని 'ఇవ్వటానికి' సిద్ధంగా వుంటాడు.
కానీ, తాత్కాలిక ఆనందాన్నిచ్చే ఈర్ష్యా, అసూయ, ద్వేషం, మూగజీవుల ఎడల కౄరత్వం, కోపం, స్వార్ధం, చెప్పుడు మాటలు నమ్మటం, ఉత్తమగరుదూషణ, దైవదూషణ చేయడం, మానవులలో సామరస్యాన్ని భంగపరిచే విధంగా మాట్లాడటం మరియూ శాడిజం, లాంటి నకిలీ ముత్యాల్ని పట్టుకుని అవే 'నిజమైనవి' అనుకుని, పైశాచిక ఆనందం పొందుతూ వుంటారు కొందరు అల్పమానవులు!
మానవులు దుర్భుద్ధులను, దుర్గుణాలను వదిలేస్తేనే తప్ప, వారికి దైవమిచ్చే నిజమైన ముత్యాలు దొరకవని తెలుసుకున్న మనిషే ధన్యుడు. అనేది ఈ మా (పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి) బోధామృతము యొక్క సారాంశము.
సబ్ కా మాలిక్ ఏక్ - ఏక్ మాలిక్ కా రూప్ అనేక్.
"IN THE SPIRITUAL SERVICE OF ALMIGHTY GOD, SRI SADA SHIVA & ALMIGHTY SADH GURU, SRI SHIRDI SAI BABA".
Yours in Sai Baba - Divine words by మీ, పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజీ.