UCPWA

UCPWA Uppal Circle Photographers Welfare Association

Grand Jersey launch of PCL5 PHOTOGRAPHERS CRICKET LEAGUE.
10/06/2024

Grand Jersey launch of PCL5 PHOTOGRAPHERS CRICKET LEAGUE.

04/06/2024

Poster launch at Freelance Photographers Association (FPVA), Chikkadpally
04/06/2024

Poster launch at Freelance Photographers Association (FPVA), Chikkadpally

PCL 5 Poster launch at Twin cities professional photographers Welfare Association (TCPPWA), Ramanthapur
04/06/2024

PCL 5 Poster launch at Twin cities professional photographers Welfare Association (TCPPWA), Ramanthapur

Poster launch at ECIL Kapra Photographers Association
04/06/2024

Poster launch at ECIL Kapra Photographers Association

ఘనంగా PCL 5 పోస్టర్ ఆవిష్కరణ UCPWA కమిటీ సభ్యులు 23-05-2024 న ఉప్పల్ అసోసియేషన్ సీనియర్ అడ్వైసర్ కవిత స్టూడియో నరేందర్ గ...
04/06/2024

ఘనంగా PCL 5 పోస్టర్ ఆవిష్కరణ

UCPWA కమిటీ సభ్యులు 23-05-2024 న ఉప్పల్ అసోసియేషన్ సీనియర్ అడ్వైసర్ కవిత స్టూడియో నరేందర్ గారి కార్యాలయంలో PCL 5 పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యులందరు ఐకమత్యంగా స్నేహభావంతో ఈ పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

PCL 5 అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఉప్పల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ క్రికెట్ కమిటీ సన్నాహాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ పోటీలను జయప్రదం చేసి మన UCPWA ఐకమత్యాన్ని చాటాలని కోరుకుంటుంది.

PCL -5 తేదీలు : 11 మరియు 12 జూన్ 2024

స్థలం: బాబు రావు సాగర్ క్రికెట్ గ్రౌండ్స్, కాచవని సింగారం, ఫీర్జధిగూడ, ఉప్పల్, హైదరాబాద్.

ఇతర వివరాలకు ఉప్పల్ క్రికెట్ కమిటీ చైర్మన్ సుబ్బు ని సంప్రదించగలరు: 9866448546

ఇట్లు,
UCPWA క్రికెట్ కమిటీ.

30/09/2023

*ఉప్పల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ పథకం*

1. ఈ పథకంలో ఉన్నవారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందివ్వడం జరుగుతుంది.
2. మన UCPWA సభ్యులు ఈ పథకంలో చేరడానికి 200/- రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించవలెను.
3. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు సభ్యుడిని ఆదుకోవడానికి కమిటీ పిలుపుమేరకు స్పందించి 200/- రూపాయల రుసుము తక్షణమే చెల్లించవలెను.
4. ఈ పథకంలో ఉన్నవారు యూనియన్ తరపున చేపట్టిన పోస్టల్ ఇన్సూరెన్స్ ని తప్పనిసరిగా తీసుకొని ఉండాలి.
5. పోస్టల్ ఇన్సూరెన్స్కు అనర్హులు అయినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
5. ఈ పథకంలో ఉన్నవారు కచ్చితంగా ప్రతి సంవత్సర రుసుము చెల్లించి ఉండాలి.
6. యూనియన్ నిర్ణయించిన ధరలను తూచా తప్పకుండా పాటించవలేను.
7. ఈ పథకం ప్రస్తుత కమిటీ కాలపరిమితి (2023 to 2025) వరకు వర్తిస్తుంది.
8. భవిష్యత్తులో కమిటీ తీసుకునే నిర్ణయాలకు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
9. ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఈ పథకం వర్తించదు.
(ఆత్మహత్యలను మా కమిటీ ప్రోత్సహించదు)
10. ఈ పథకంలో మార్పులు చేర్పులు కోర్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ బాడీదే తుది నిర్ణయం.

*UCPWA కమిటీ.*

30/09/2023

ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మొదటి జనరల్ బాడీ మీటింగ్ విజయవంతంగా జరిగింది

1 స్టూడియో రేట్లపై చర్చ జరిగినది సభ్యుల సలహాల మేరకు పాస్పోర్ట్ ఫోటో ₹150/- రూపాయలు,
4×6 ₹ 250/- రూపాయలు, 32 Copies ₹ 350/- మెయిల్ ఐడి కి సాఫ్ట్ కాపీ పంపిస్తే ₹ 50/- రూపాయలు గా నిర్ణయించబడినది

2. మన ఉప్పల్ సభ్యుల గురించి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగినది ఉప్పల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ పథకం గా నామకరణ చేయడం జరిగినది లక్ష రూపాయల ఆర్థిక సహాయం

3. *కుటుంబ బరోసా పథకం పేరుతో ప్రాంతీయ అసోసియేషన్లను వత్తిడి చేస్తున్న రాష్ట్ర అసోసియేషన్ TGPVWA కి ఉప్పల్ అసోసియేషన్ అనుసంధానం నిరాకరణ.*

కుటుంబ భరోసా గురించి అత్యధిక సభ్యుల నిర్ణయం ప్రకారం వారు పెట్టిన కండిషన్స్ వ్యతిరేకించడం జరిగినది వారు పెట్టిన ఎక్స్పోకు మాత్రమే మద్దతు ఇవ్వాలని చెప్పడం జరిగింది కానీ లోకల్ అసోసియేషన్ కి ఎలాంటి లాభం లేదు అలాగే కుటుంబ భరోసా కు గ్యారెంటీ ఇవ్వడం లేదు

అనుసంధానం అంటే కలిసి పనిచేయడం అని కింద పని చేయడం కాదు అని ఈ రోజు ఉప్పల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అందరు సభ్యులు రాష్ట్ర అసోసియేషన్ అని చెప్పుకునే TGPVWA కి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రాంతీయంగా ఎన్నికలు నిర్వహించి గెలిచిన నూతన కమిటీ సభ్యులు మేము అందరితో "కలిసి" పనిచేయడానికి సిద్ధం కానీ "కింద" పనిచేసే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పారు. కుటుంబ బరోసా పథకం ఒకటి పెట్టీ ప్రాంతీయ అసోసియేషన్ కార్యక్రమాల్లో చొరబడి సభ్యుల మధ్య విబేధాలు సృష్టిస్తూ వారి మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీయడం TGPVWA కి మంచిది కాదు అని, రాష్ట్ర వ్యాప్తంగా నిధులు రాని పక్షాన ఈ పథకం మూతపడుతుంది అనే చేదు నిజాన్ని కప్పిపుస్తున్నారు. అంతే కాకుండా బానిసల్లా కట్టుబాట్లు విధిస్తూ వారికీ నచ్చిందే వేదం అన్నట్టు ప్రవర్తిస్తూ స్వలాభాల కోసం ఎక్స్పోల కోసం వాడుకుంటున్నారని ఈ సమావేశంలో తెలియజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్లు స్వయం పరిపాలన దిశగా అడుగులు వేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

IRDAI ఆమోదం పొందిన ఇన్సూరెన్స్ పథకాలే మనకు ఎప్పటికైనా శ్రీ రామ రక్ష అని తెలియజేస్తూ పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వార యాక్సిడెంట్ లో మరణించిన వారికి 10 లక్షల రూపాయల బరోసా వస్తుంది అని, అది వర్తించని సమక్షంలో ఉప్పల్ కార్యవర్గ సభ్యులు లక్ష రూపాయల బరోసానీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్ అసోసియేషన్ నియమ నిబంధనలను పాటించిన సభ్యులకు మాత్రమే కార్యవర్గ సభ్యుల సహకారం లభిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు.

అసోసియేషన్ తమ సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు ఉప్పల్ అసోసియేషన్ నూతన కమిటీ వారు సంఘం చిట్టీను ప్రారంభించడంతో పాటు పలు మార్గాలను అన్వేషిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా UCPWA సభ్యులందరికీ ID కార్డులు ఇవ్వడం జరిగింది.

UCPWA కమిటీ.
9848279072

Address

Nacharam
Hyderabad
500076

Telephone

+919948670396

Website

Alerts

Be the first to know and let us send you an email when UCPWA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to UCPWA:

Share