Telangana Hindu Jagruti Samithi

Telangana Hindu Jagruti Samithi Telangana Hindu Jagruti Samithi

29/09/2025

Proud to be Hindu

13/07/2025

*విస్తరాకు ..... మనిషి జీవితం*

*మిత్రమా* *"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.

భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము.

తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం.

*"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము..

*'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది.

ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.

*'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.

మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *'వాయిదా'* వేయకండి.

ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు.

అప్పుడు *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..

ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?

కనీసం *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..

అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*...

*ఇదే జీవిత పరమార్ధం*
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

13/07/2025
ఒక్కసారి మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి    https://bz.dhunt.in/10VkpoBy Kakinada Pilla Food via Dailyh...
07/07/2025

ఒక్కసారి మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి
https://bz.dhunt.in/10Vkpo

By Kakinada Pilla Food via Dailyhunt

ఒక్కసారి మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి ...

06/07/2025

🇮🇳 BREAKING: Day & Night Retaliation Strike by Indian Forces 🇮🇳
In response to the brutal killings of innocent Hindus in Pahalgam, the Indian Government has launched a precision day and night attack on terror launchpads inside Pakistan-occupied territory.

Swift aerial precision strikes

Coordinated ground-based artillery

Targeted high-value terror infrastructures

No civilian casualties, 100% focus on eliminating terror elements

This act of valor and justice reflects the unwavering spirit of New India 🇮🇳 — we will not remain silent spectators to terrorism.

This is not revenge — this is justice.
This is not a warning — this is a message.

🩸 To every drop of innocent blood shed, Bharat replies with courage and fire. 🩸

👇 Salute our heroes in the comments! 👇
Jai Jawan 🇮🇳
Jai Hind 🇮🇳
Jai Bharat 🇮🇳

05/06/2025

🌿 జీవితం గురించి కొంత లోతైన ఆలోచన... 🌿

శరీరంలో భాగాలు కుళ్ళిపోయినప్పుడు తొలగించాల్సిన అవసరం ఎంత ఉందో...
అలానే జీవితం లో అవసరాలకు అనుగుణంగా మారే బంధాలను వదిలివేయడమూ అంతే అవసరం.

🔥 ఆవేశం అదుపు తప్పితే వివాదం
🚦 వేగం అదుపు తప్పితే ప్రమాదం
👑 అహంకారం అదుపు తప్పితే ఎడబాటే

🍃 సహనం ఉంటే – వివాదాలు, ప్రమాదాలు తగ్గిపోతాయి
💪 సమర్థులకే సహనం ఉంటుంది
🙏 మంచికోసం తగ్గేవాడే గొప్పవాడు

⏳ ఒక్క క్షణం సహనం 👇
కోండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది...
⏳ ఒక్క క్షణం అసహనం 👇
జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది...

🚫 స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకండి
🚫 మర్యాద ఇవ్వని వారింటికి వెళ్ళకండి
🚫 వ్యక్తిత్వం లేనివారికి ఏదీ చెప్పకండి
🚫 విలువ ఇవ్వనివారితో మాట్లాడకండి
🚫 అహంకారం చూపేవారితో కలవకండి

⚠️ గర్వం ఒక్కటే చాలదు – జీవితం లో సర్వం కోల్పోవడానికి
🔥 ధైర్యం ఒక్కటే చాలు – ఏదైనా సాధించడానికి
😴 సోమరితనం – లక్ష్యాలను చంపేస్తుంది
👑 అహంకారం – ఎదుగుదల ఆపేస్తుంది
😨 భయం – కలలను అడ్డుకుంటుంది
😒 అసూయ – ప్రశాంతతను దూరం చేస్తుంది
😡 కోపం – వివేకాన్ని నాశనం చేస్తుంది

🧠 ఈ దుష్ప్రవర్తనల్ని వదిలించుకోవడం మీ చేతుల్లోనే ఉంది.
👉 జీవితాన్ని మలుచుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది.

#జీవితబోధనలు

05/06/2025

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఒక మెట్టు ఎక్కగానే ( ఎదగగానే ) నీ చూపులో, మాట లో, ప్రవర్తన లో తేడా కనిపిస్తే దేముడు నిన్ను పది మెట్లు కిందకు దింపుతాడు.. గమనించుకో మిత్రమా.

జీవితంలో అన్ని వ్యసనాలలో కెల్లా పెద్ద వ్యసనం.. మనిషిని నమ్మటం.. మంచి వారు అనుకునే ప్రతి ఒక్కరికి దాదాపుగా ఈ వ్యసనం ఉంటుంది...

మోసపోయే దాక దీనిలోనుంచి బయటపడటం కష్టం..కొందరు మోసపోయిన కూడా ఈ వ్యసనం మానుకోలేరు...

ధనవంతుల్ని చూసినపుడు మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం.కానీ జ్ఞానవంతుల్ని చూసినపుడు మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించే వారు తక్కువ.అలా ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలో అహం,ఆశ నశించి ఆనంద జీవితం లభిస్తుంది.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

05/06/2025

అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు ?

అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాం . ఇంకా నిమ్మకాయల దండలు వేసి అర్చిస్తూ ఉంటాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది . మానమొకసారి పీపరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది .

శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది . లయకారుని శక్తి కదా మాత . కాలస్వరూపమై , దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది . దేవి సత్వ సరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది . ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా , రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ , దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు .

‘కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం’.

వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహామానులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి . శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి , నా ఆపదలని నశిపజేయి’ . అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది .


అదేవిధంగా నిమ్మకాయ దండాలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ , పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి , శాంతిస్తారని చెబుతారు . అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు .

కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది . ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుండీ నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధనానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన ద్రుష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి .

దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

14/04/2025

ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తను ఖాళీగా ఉన్నాడా లేడా అని కనుక్కుని వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం.
తల్లి...నాయనా .పూజా పునస్కారాలు ఐనాయా?
కుమారుడు...ఇలా చెప్పారు.
అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో .. మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.అలాంటి నేను పూజలు అవి ఏం బాగోదు.
తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా.....అన్నది.
కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.
అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. నీకు మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....
కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ తల్లి...హా సంబంధం ఉంది. ఇంకా నువ్వు, నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.
మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.
కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.
తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా. తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.
మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తు కు తెస్తుంది.
ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి, సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.
ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు గా వికాసం చెందారు.
కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.
తల్లి కన్నా ...ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు , గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.
ఇక ఏడో అవతారం రామావతారం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు .సమస్త కుటుంబ బంధుత్వానికి అది పురుషుడు.
ఇక ఎనిమిదవది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు , పాలకుడు , ప్రేమించే స్వభావి. అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.
కొడుకు ఆశ్చర్యం , విస్మయంతో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ
తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం.
ఇక వచ్చేది కల్కి పురుషుడు. అతను నీవు ఏ మానవునికై వేతుకుతున్నావో అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.
కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు
అప్పుడు ఆ కొడుకు ఆనంద భాష్పాలతో అమ్మ...హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం. అని అన్నాడు
.. ఆత్మీయులారా !!!
మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి.మీరు ఎలా అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్త్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి. రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.
#మనం మారుదాం యుగం మారుతుంది..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Telangana Hindu Jagruti Samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Hindu Jagruti Samithi:

Share