13/07/2026
కోయిలకున్నట్టు - ఆమె పేరూ మూడక్షరాలే...! జా న కి ...!!
యద్యదాచరతి శ్రేష్ఠ: ... సమకాలీన గాయకులకు కూడా స్ఫూర్తి నివ్వగలిగిన, తన స్థానాన్ని, స్థాయినీ మరొకరు భర్తీ చేయలేని ఉత్తమోత్తమ గాయని ఆమె.
తెలుగు వారు తపస్సు చేయకుండానే పరమాత్మ ప్రసాదించిన వరం జాన’కమ్మ’ని గాత్రం...!
ఆమె గాత్రం లో ఒలకని రాగం లేదు ... ఒదగని భావం లేదు ...
అతి నిరాడంబర వ్యక్తిత్వం ... అసూయారహితమైన, ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన, సంపూర్ణ జీవితం...!
స్వరకర్త మాధవపెద్ది సురేష్ గారి ఇంట్లో - నాచే ఆమె ఘంటసాలగారి పుష్పవిలాపం అడిగి పాడించుకుని మెచ్చుకున్న సందర్భం..!
రికార్డింగ్ థియేటర్ లో నా 'భగవద్గీత' ను విని అభినందించి, ఆపై విడుదల కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆశీర్వదించిన సందర్భం..!
మా ఇంట్లో వంకాయ కూర బావుందని మళ్ళీ మళ్లీ వేయించుకుని ఆత్మతృప్తి గా భోజనం చేసి, మా ఆవిడ చేతి వంటని మెచ్చుకున్న సందర్భం ..!
వేదికలపైన ఆ మహా గాయనితో అనేక మార్లు స్వరచాలనం చేసి, సత్కారం పొందిన సందర్భం ...
తెలుగు సినిమాలలో (మధ్య తరగతి మహా భారతం... (సంగీతం : శ్రీ మాధవపెద్ది సురేశ్) ఆమెతో కలిసి డ్యూయెట్ పాడిన సందర్భం ...
నా సంగీత దర్శకత్వం లో ( శ్రీ సాయి గీతాంజలి ఆల్బమ్ ) ఆమె గానం చేసిన సందర్భం...
నా తుది శ్వాస వరకూ మరిచిపోలేనివి...!!
గాంధర్వ విద్యా ప్రవీణుల కీర్తి - దేశ, కాల, జాత్యాదులకు అతీతం...
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం ||
బిరుదులకు, పురస్కారాలకు, విగ్రహాలకు అతీతమైన ఆ మహా గాయనికి …
సద్గతులు ప్రసాదించమని పరమాత్ముణ్ణి ప్రార్ధిస్తున్నాను..!!!
నీలిమేఘాలలో…
గాలి కెరటాలలో…
నీవు పాడే పాట…
వినిపించునే వేళా……😔🙏
డాII ఎల్.వి. గంగాధర శాస్త్రి
గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త
భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
YouTube:
Smt. S. Janaki's blessings to Dr. L.V. Gangadhara Sastry: https://youtu.be/08biwPKrEWc
Smt. S. Janaki Appreciates Dr. L.V. Gangadhara Sastry's Bhagavadgita: https://youtu.be/RaOfIfa49NI
Like the cuckoo, even her name has just three syllables—Ja-na-ki. “Yad yad ācarati śreṣṭhaḥ…”—she was an extraordinary singer whose life and artistry continue to inspire even contemporary musicians. Her place and stature in Indian music are simply irreplaceable.
For the Telugu people, Janakamma's voice was a divine blessing bestowed by the Almighty without their having to perform any penance. There was no raga that did not flow effortlessly through her voice, and no emotion that she could not express with perfection. She embodied simplicity, freedom from jealousy, and a life that was exemplary, inspiring, and complete.
I fondly remember the occasion at the home of composer Sri Madhavapeddi Suresh, where she asked me to sing Ghantasala garu's "Pushpa Vilapam." She listened with great appreciation and praised my rendition.
I also cherish the occasion when she listened to my musical rendering of the Bhagavadgita in the recording theatre, appreciated it warmly, and later graced its release function with her presence and blessings.
I can never forget the time she visited our home, thoroughly enjoyed the brinjal curry prepared by my wife, asked for additional servings more than once, relished the meal with heartfelt satisfaction, and warmly appreciated my wife's cooking.
I have also been blessed to share the stage with that legendary singer on numerous occasions, performing together and receiving honors alongside her.
Another unforgettable memory is singing a duet with her for the Telugu film Madhyataragati Mahabharatam (Music: Sri Madhavapeddi Suresh).
Equally unforgettable is the privilege of having her render a song under my music direction for my album Sri Sai Geetanjali.
These are memories that I will cherish until my very last breath.
The glory of those who have mastered the divine art of music transcends countries, time, race, and every worldly boundary. It rises far above titles, awards, and statues.
I pray to the Supreme Lord to bestow eternal peace and the highest spiritual abode upon that great singer.
— Dr. L.V. Gangadhara Sastry
Singer, Global Preacher & Propagator of Bhagavadgita
Founder & Chairman, Bhagavadgita Foundation