మా అడవి మా డొంకరాయి .... మా డొంక... మా రాయి మా దండకారణ్యం - మా నీరూ సీలేరు !
ఒరేయ్ మనవూరు వచ్చేసిందిరా... వచ్చేసిందిరా మనూరు.! వచ్చేసిందిరా...
డొంకరాయి రా... మన డొంకరాయి రా ...
వచ్చేసిందిరా! మన గడ్డ...** **(అక్కడ నదిని గడ్డ అంటారు)
గడ్డలో రాళ్ళూ... దూకే నీళ్ళూ...
చల్లని సెలెయేళ్ళూ... ఏవి అందం ఎంత అందం..!
ఎన్నెన్ని రుచులు... ఎన్నెన్ని పళ్ళు,
అబ్బబ్బ... పుల్ల మావిడి కాయలు,
తీపి మావిడి కాయలు,
మావిడి పళ్ళు... కొండ మావిడి పళ్ళు... జీడి మావిడి పళ్ళు...
చిన్న పనసపళ్ళు, కజ్జా పనస పళ్ళు, తేనె పనస పళ్ళు, మధ్యలో మనల్ని మస్కాకొట్టించే బురద పనస పళ్ళు..
చిట్టి ఈత పళ్ళు, చిన్న నేరేడు పళ్ళు, అల నేరేడు పళ్ళు, తుమ్మెత్త పళ్ళు,
ఇలా ఒకటా రెండా... అడవి సపోటాలు, ఉసిికాయలు, తెల్ల జాంకాయలు, ఎర్ర జాంకాయలు...
అందులోనూ దొంగ జాంకాయలు,
అప్పటి కఫ్ఫుడు చెట్టునుంచి దించి తిన్న తేనె, దీని దుంపెతెగ ఏం అనుభవించాం రా...
వీటికి తోడు కార్తీక మాసం పిక్ నిక్ లు, వ్లుసిరి కాయలు తినేసి తాగిన తియ్యటి నీళ్ళు...
జలపాతాల్లో నీరుల్లో సెలయేరుల్లో స్నానాలు...
అబ్బబ్బఎన్ని అందాలు... ఎన్ని రుచులు, ఎన్ని రకాలు, !!!
అడవిలోకి వెళ్ళడం, గడ్డలోకి దూకడం...
ఇంట్లో తెలియకుండా ఈతకొట్టడాలు...
ఇంటికి రాగానే తిట్లూ... పాట్లూ... చివాట్లూ... ఎన్ని తిన్నాం
..అన్నీ...అంతా..
మన అడవి! మన దుర్గాలమ్మ గుడి, కుమార స్వామి గుడి... మన రామాలయం...
మన మసీదు భయపడితే దడుచు కుంటే తాయెత్తు ఇచ్చి ప్రేమగా చూసే మన గురువుగారు
మన పోస్టాపీసు... మన స్కూలు... మన వూరు...
మన డొంకరాయి... మన వూరు... అంతా మనది...!
అవునురా... మన డొంక...! మన రాయి...! డొంకరాయి..! మన నీరూ... సీలేరు...
Yes it is our Bush... it is our Rock... Thanks to each and every Bush and Rock of Donkarayi. Thanks to our Parents ... Thanks to the Universal God who created and allowed us to experience the beauty wonder of Natural Aesthetics . These locations situated in the forest of Dandakaranya, which is in the boarders of Andhra Pradesh - Odissa - Chattisgad. View the pages and pictures. Thank you very much
with lots love
Sridhar Kumar Kavuri