03/01/2026
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ( 02/01/26)సాయంత్రం నాలుగు గంటలకు హర్ష ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ వారి సౌజన్యంతో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ డిసిపి( ట్రాఫిక్) వీరన్న గారు, ఏసీపి వెంకటయ్య గారు,కూకట్ పల్లి ట్రాఫిక్ ఇనస్పెక్టర్ తిమ్మప్ప గారు, కూకట్ పల్లి రిజర్వ్ ఇనస్పెక్టర్ జంగయ్య గారు, శ్రీ హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హిమబిందు గారు, సభ్యులు మహమ్మద్ ఖాన్, సునీల్ మరియు రవి సింగ్ గారు, ఎస్సీ ఎస్సీ మేనేజర్ మహేష్ గారు, వాలంటీర్లు శ్రీనివాస రెడ్డి మరియు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లనే జరుగుతున్నాయని అన్నారు. తదుపరి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అందించి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు.