07/08/2026
పాప పుట్టిన రోజు...తల్లి పెద్ద మనసు!
గురువు గారికి పాదాభివందనాలు!
కేంద్రంలో స్టూడెంట్ సుష్మ వాళ్ళ ఆర్వి పాపది పుట్టిన రోజు. తన పేరు మీద అభయ హోమ్ లో అందరికీ భోజనం పెట్టించమని కోరింది. చిన్న నాటి నుండి అనారోగ్యంతో బాధపడుతుందట. అమ్మాయి కి 6 సంవత్సరాలు నిండి 7 పడుతాయి.
కరీంనగర్ కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభం రోజున నేను మరియు సాయి తల్లి గారు అభయ నిత్యాన్న సేవకోసం మా పుట్టు పండుగ కోసం ఇచ్చేటప్పుడే, వారి పాప పేరు మీద కూడా ఇస్తా అని అనుకుందట... వారి పాపను మీరు దీవించమని , ఆశీస్సులు కోరింది. - అరుణ ప్రభంజన్, కోఆర్డినేటర్ abhaya Foundation, Karimnagar