22/05/2026
17th May 2026
213 మంది రక్తదానం చేసారు, బ్లడ్ డొనేషన్ క్యాంపు అద్భుతంగా జరిగింది
ఇందులో భాగస్వామ్యం అయినా అందరికి నా ధన్యవాదాలు , ఈ క్యాంపు లో Blood Donate చేసిన మన Blood Donor life saver Foundation Donors కి మరియు మన డోనార్స్ వారి స్నేహితులు, బంధువులు, సహచరులు, ఇంటి పొరుగువాళ్లను తీసుకొచ్చి రక్తదానం చేయించారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .. వచ్చిన గెస్ట్ లు కూడా ఆశ్చర్యపోయేలా ఈ కార్యక్రమం జరిగింది , ప్రతి ఒక్కరి ముఖం లో సంతోషం కనిపించింది .. తలసేమియ సొసైటీ వాళ్ళు కూడా చెప్పలేనంత సంతోషంలో ఉన్నారు ఎందుకంటే ఎండకాలం కావడం వల్ల వారు చేస్తున్న క్యాంపు లో ఎక్కువ మంది డొనేట్ చేయడం లేదు ..ఈ నెలలో కనీసం ఒక క్యాంపు లో 70 మంది కంటే ఎక్కువ మంది రక్తదానం చేయలేదంట .. పిల్లలు రక్తం కొరతతో ఇబ్బందులు పడుతున్నారంట, అలంటి పరిస్థితుల్లో మనం వారికీ అండగా నిలిచి ఒక మంచి కౌంట్ 213 units ఇవ్వడంతో తలసేమియా సొసైటీ మొత్తం ఈ రోజు ఆనందంగా ఉన్నారు . ఈ కార్యక్రమం నేను చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు , ఈ సారి ఎలాగైనా మన సత్తా ఏంటో చూపించాలి అనే పట్టుదలతో దాదాపు 25 రోజుల నుండి నా సంపాదన పక్కన పెట్టి నేను దీని మీద దృష్టి సారించాను . మీ అందరికి తెలుసు గ్రూప్స్ మీటింగ్స్ పెట్టాను , జూమ్ మీటింగ్స్ పెట్టాను , డైరెక్ట్ కాల్స్ , వాట్సాప్ మెసేజెస్ , స్టేటస్ లు , వీడియోస్ , పోల్స్ , ఇలా చాల రకాలుగా నా వంతు ప్రయత్నాలు చేయడం జరిగింది .. ముఖ్యంగా దేవుడి దయవల్ల మరియు మీ అందరి సహకారంతో విజయవంతం అయింది .. తలసీమియా పిల్లల కోసం ఎలాగైనా మన ఫౌండేషన్ తరపున మంచి సహకారం అందించాలి అని ఎప్పటినుండో అనుకున్న అది ఈ రోజు జరిగింది .. దేవుడు నాతో సేవ చేయిస్తున్నాడు నేను నిమ్మిత్తమాత్రుడను ! ఏది చేసిన కారకుడు అతనే .
Blood donor life saver foundation
Sunil Dhoota
TSCS