Nirmaan Foundation

Nirmaan Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nirmaan Foundation, Non-Governmental Organization (NGO), 154, Srujana Lakshmi Nagar, Beeramguda, Hyderabad.

Nirmaan Foundation is founded in the year 2009, ever since its inception, it has been working to address issues of rural education, ecological footprint and rural arts.

గుమ్మడిదల ZPHS పాఠశాలలో నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవంగుమ్మడిదల, 20/02/2026:సంగారెడ్డి జిల్లా గుమ్మడి...
20/02/2026

గుమ్మడిదల ZPHS పాఠశాలలో నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం

గుమ్మడిదల, 20/02/2026:

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో *నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం* అత్యంత ఉత్సాహంగా జరిగింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుబ్బలక్ష్మి గారి సమక్షంలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. *నిర్మాణ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఏలే వెంకట నారాయణ* విద్యార్థులకు విద్య యొక్క ఆవశ్యకతను మరియు పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో కూడిన చదువే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి చదువుతున్న *75 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్‌లను* అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు *రమేష్, రామచంద్రారెడ్డి*, నిర్మాణ్ ఫౌండేషన్ *గుమ్మడిదల యాక్టివిటీ కోఆర్డినేటర్ శేఖర్*, ఇతర స్వచ్ఛంద సేవకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల సిబ్బంది నిర్మాణ్ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏలే వెంకటనారాయణ
అధ్యక్షులు
నిర్మాణ్ ఫౌండేషన్
8008882256

*ZPHS అమీన్‌పూర్ – వ్యాసరచన పోటీ బహుమతుల పంపిణీ (EWS‑4)*ZPHS అమీన్‌పూర్ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజయం సాధిం...
30/01/2026

*ZPHS అమీన్‌పూర్ – వ్యాసరచన పోటీ బహుమతుల పంపిణీ (EWS‑4)*

ZPHS అమీన్‌పూర్ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 29‑01‑2026న బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమం పాఠశాల అధ్యాపక బృందంలోని నాయక్ గారు, శ్రీదేవి గారు, లావణ్య గారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది.

విజేతలకు బహుమతులను మంజునాథ్ పూజారి, శ్రీకాంత్, మరియు నిర్మాణ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలే వెంకటనారాయణ గారు అందజేశారు.

తరువాత పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, అలాగే పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై మార్గదర్శకత్వం అందించారు. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు కూడా పంపిణీ చేశారు.

– టీం నిర్మాణ్ ఫౌండేషన్

*ZPHS పటాన్చెరువు -  వ్యాసరచన పోటీ బహుమతుల పంపిణీ (EWS-3)*22/12/2025, ZPHS బాలికల పాఠశాలలో వ్యాసరచన పోటీలో గెలుపొందిన వి...
30/01/2026

*ZPHS పటాన్చెరువు - వ్యాసరచన పోటీ బహుమతుల పంపిణీ (EWS-3)*

22/12/2025, ZPHS బాలికల పాఠశాలలో వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరిగింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు *శ్రీమతి స్పందన చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో* విజేతలకు బహుమతులను *కొడూరి హరీష్, జలనీల విజయ్, మరియు ఏలే వెంకటనారాయణ, ఫౌండేషన్ అధ్యక్షులు* అందజేశారు.

అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ తో పాటు, పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవటం ఎలా అనే అంశంపై మార్గదర్శకత్వం చేశారు. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించడం జరిగింది.

*టీం నిర్మాణ్ ఫౌండేషన్*

*ZPHS సుల్తాన్‌పూర్ (EWC 2) -  వ్యాసరచన పోటీ బహుమతుల పంపిణీ*Dt 24/11/2025, ZPHS సుల్తాన్‌పూర్ పాఠశాలలో వ్యాసరచన పోటీలో గ...
30/01/2026

*ZPHS సుల్తాన్‌పూర్ (EWC 2) - వ్యాసరచన పోటీ బహుమతుల పంపిణీ*

Dt 24/11/2025, ZPHS సుల్తాన్‌పూర్ పాఠశాలలో వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరిగింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు *శ్రీమతి రమాదేవి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో* విజేతలకు బహుమతులను *కొడూరి హరీష్, జలనీల విజయ్, సమీర్ పాషా, శ్రీకాంత్ కాకరపర్తి మరియు ఏలే వెంకటనారాయణ, ఫౌండేషన్ అధ్యక్షులు* అందజేశారు.

*టీం నిర్మాణ్ ఫౌండేషన్*

*నిర్మాణ్ ఫౌండేషన్ - బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీరంగూడ నందు 13వ తారీఖున నిర్వహించిన వ్యా...
30/01/2026

*నిర్మాణ్ ఫౌండేషన్ - బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం*

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీరంగూడ నందు 13వ తారీఖున నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నేడు బాలల దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం *శ్రీమతి వసంత* - ప్రధానోపాధ్యాయురాలు, *శ్రీ శశిధర్ రెడ్డి గారు* - అమీన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, *శ్రీ సుధాకర్ యాదవ్* - చైర్మన్ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం, బీరంగూడ, *ఏలే వెంకటనారాయణ,* ఫౌండేషన్ అధ్యక్షులు, *కృష్ణా యాదవ్* మరియు తదితర నాయకులు మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో అదేవిధంగా భారత దేశ మొట్టమొదటి ప్రధానిగా *పండిట్ జవహర్లాల్ నెహ్రూ* చేసిన సేవలను స్మరించుకోవడంతో పాటుగా, వారి ద్వారా రచించబడిన *డిస్కవరీ ఆఫ్ ఇండియా మరియు గ్లిన్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ* యొక్క గొప్పతనాన్ని చర్చించడం జరిగింది. దేశ మొట్టమొదటి ప్రధానిగా *పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయము, పరిశ్రమలు, ప్రాజెక్టులు మరియు విద్యా సంస్థలను* నెలకొల్పి దేశంలో *పేద, మధ్యతరగతి మరియు ఉన్నత శ్రేణి వర్గాలు అందరూ సమానమే అని చెప్తూ సామ్యవాద భావజాలానికి పునాదులు వేసి దేశ అభివృద్ధికి పాల్పడినారని* వక్తలు పేర్కొన్నారు.

తదనంతరం *వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను* అదేవిధంగా *పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్* నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది.

*ఏలే వెంకటనారాయణ*
అధ్యక్షులు
నిర్మాణ్ ఫౌండేషన్

*నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు*నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 12న సుల్తాన్‌పూర్ జిల్లా పరిషత్ హై స్క...
30/01/2026

*నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు*

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 12న సుల్తాన్‌పూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో, అలాగే నవంబర్ 13న బీరంగూడ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమకు ఇచ్చిన అంశాల పైన తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచినారు.

బీరంగూడ పాఠశాల విజేతలకు బహుమతులు నవంబర్ 14న, సుల్తాన్‌పూర్ పాఠశాల విజేతలకు నవంబర్ 19న అందజేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ సభ్యులు Ch. స్రవంతి, ఏలే మౌనిక మరియు ప్రత్తిపాటి శ్రీదివ్య గార్లు పాఠశాలలతో సమన్వయం చేస్తూ పూర్ణ సహకారం అందించారు. సుల్తాన్‌పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రమాదేవి గారు మరియు బీరంగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వసంత గారు ఈ కార్యక్రమం నిర్వహణలో, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో మరియు విజేతల ఎంపికలో విశేష సహకారం అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందీ చూపిన కృషికి మనఃపూర్వక అభినందనలు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తార్కికంగా ఆలోచించి, తమ ఆలోచనలను సృజనాత్మకంగా వ్యక్తపరచే సామర్థ్యాన్ని పెంచుకోగలరనే ఆశతో నిర్మాణ్ ఫౌండేషన్ ఈ వ్యాసరచన పోటీలను నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో విమర్శాత్మక ఆలోచనా శక్తి అభివృద్ధి చెందడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

*టీం నిర్మాణ్ ఫౌండేషన్*

2025 జూన్ 29న, అపరాజిత సేవా సమితి, వాత్సల్య సిందు, వనవాసి సంచాలన సమితి మరియు సంత్ గడ్కే బాబా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ...
30/01/2026

2025 జూన్ 29న, అపరాజిత సేవా సమితి, వాత్సల్య సిందు, వనవాసి సంచాలన సమితి మరియు సంత్ గడ్కే బాబా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

Activity 1 - Book Distribution Program - Press Coverage
22/06/2025

Activity 1 - Book Distribution Program - Press Coverage

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీDt: 21/06/2025 - ఖానాపూర్, చంద్రధన, చుక్కాపూర్ మరియు రావిచేడు ప్రభుత్వ ...
22/06/2025

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ

Dt: 21/06/2025 - ఖానాపూర్, చంద్రధన, చుక్కాపూర్ మరియు రావిచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 500 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలని నిర్మాణ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కోట్ల శశికాంత్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీ చామ్లా, శ్రీమతి శోభారాణి, శ్రీ బాలకోటి, మరియు శ్రీ సత్యనారాయణ పాల్గొని ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు మల్టీ నేషనల్ కంపెనీలు మరియు వాటికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలపై అవగాహనతో పాటుగా ఏ విధమైన విద్యను అర్జించాలి అనే అంశాలపై అవగాహన పొందడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు‌. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కోట్ల శశికాంత్ మాట్లాడుతూ 25-26 విద్యా సంవత్సరంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటల పోటీలను అనగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, క్విజ్ కాంపిటేషన్ మరియు కెరియర్ కౌన్సిలింగ్ సెమినార్లు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొని తమ యొక్క విషయపరిజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ యాదయ్య, అమర్నాథ్ రెడ్డి, పర్వతాలు, యంగలి శ్రీధర్, శివ సంతోజు, ఏలే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Notebook Distribution Drive by Nirmaan Foundation
Date: 21st June 2025 | Khanapur, Chandradhan, Chukkapur & Raviched Villages

Under the leadership of Nirmaan Foundation Vice President Mr. Kotla Shashikant, over 500 students from ZPH Schools received notebooks as part of our educational support initiative.

School principals and local leaders appreciated the Foundation’s efforts in empowering rural youth with awareness about career opportunities in multinational companies and the importance of quality education.

Mr. Shashikant also announced exciting upcoming events for the 2025–26 academic year, including:
Essay Writing
Elocution
Quiz Competitions
Career Counseling Seminars

Special thanks to the village elders and dignitaries who graced the occasion and supported the cause.

Venkata Aelle
Nirmaan Foundation
8008882256





20/09/2024 - Career Counselling Session - ZPHS, Chukkapur, Khanapur, RR Dist
15/06/2025

20/09/2024 - Career Counselling Session - ZPHS, Chukkapur, Khanapur, RR Dist

Dt: 23/08/2024 - Lunch Plates distribution and career counselling for ZPHS, Sultanpur, Sangareddy dist
15/06/2025

Dt: 23/08/2024 - Lunch Plates distribution and career counselling for ZPHS, Sultanpur, Sangareddy dist

Address

154, Srujana Lakshmi Nagar, Beeramguda
Hyderabad
502032

Alerts

Be the first to know and let us send you an email when Nirmaan Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nirmaan Foundation:

Share