దళిత క్రైస్తవుల హక్కుల ఫోరమ్

  • Home
  • India
  • Hyderabad
  • దళిత క్రైస్తవుల హక్కుల ఫోరమ్

దళిత క్రైస్తవుల హక్కుల ఫోరమ్ దళిత క్రైస్తవులకు (SC) హోదా సాధనే లక్ష్యం. సామాజిక న్యాయం,హక్కుల కోసం దళిత క్రైస్తవుల చైతన్యపరచడం

07/08/2026
06/08/2026

హైదరాబాద్ నాచారం లోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయం లో దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యం లో గద్దర్ 3 వ వర్ధంతి మరియు దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై జరిగిన ఈ సమావేశానికి సంస్థ అధ్యక్షులు బుచిగారి భాస్కర్ అధ్యక్షత వహించిన... ముఖ్య అతిథిగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ.. దళితులు మతం మారినంత మాత్రాన కుల వివక్ష అంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ సి రిజర్వేషన్ ల సాధన త్వరలో ఉప్పల్ నియోజకవర్గం స్థాయిలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలియ జేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో రిటైడ్ sp జాన్ వెస్లీ, జిలకర రవికుమార్, బిషప్ సింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడాల సంతోష్ రెడ్డి, రెవరెండ్ డా జకారియా, పి మత్తయి, ఆకేపోగు ప్రమోద్ మహారాజ్, కనుకుంట్ల విజయ్ కుమార్, తిప్పిరి రాజా బాబు గార్లు పాల్గొన్నారు

హైదరాబాద్ నాచారం లోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయం లో దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యం లో గద్దర్ 3 వ వర్ధంతి మర...
06/08/2026

హైదరాబాద్ నాచారం లోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయం లో దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యం లో గద్దర్ 3 వ వర్ధంతి మరియు దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై జరిగిన ఈ సమావేశానికి Dalith Christian Rights forum అధ్యక్షులు బుచిగారి భాస్కర్ అధ్యక్షత వహించిన... ముఖ్య అతిథిగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ.. దళితులు మతం మారినంత మాత్రాన కుల వివక్ష అంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ సి రిజర్వేషన్ ల సాధన త్వరలో ఉప్పల్ నియోజకవర్గం స్థాయిలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలియ జేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో రిటైడ్ sp జాన్ వెస్లీ, జిలకర రవికుమార్, బిషప్ సింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడాల సంతోష్ రెడ్డి, రెవరెండ్ డా జకారియా, రేవ M విజయకుమార్, E బాబు, m నాగయ్య, బిషప్ స్వామిదాస్, బిషప్ విరాజ్ ఇశ్రాయేల్, పి మత్తయి, ఆకేపోగు ప్రమోద్ మహారాజ్, కనుకుంట్ల విజయ్ కుమార్, తిప్పిరి రాజా బాబు గార్లు పాల్గొన్నారు

06/08/2026
05/08/2026
*యేసు క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియులైన దళిత క్రైస్తవ సహోదరులందరికీ వందనాలు* 🙏🙏🙏ఈ వారం లో ఒక రోజు అనగా గురువారం 6వ తేద...
04/08/2026

*యేసు క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియులైన దళిత క్రైస్తవ సహోదరులందరికీ వందనాలు* 🙏🙏🙏
ఈ వారం లో ఒక రోజు అనగా గురువారం 6వ తేదీ ఆగస్టు 2026 , సమయం: ఉదయం 11:30 గంటలకు, మీటింగ్ అనంతరం *అందరికి ప్రేమవిందు కలదు* స్థలం: బహుజన సాహిత్య అకాడమీ ఆఫీసు, నాచారం, హైదరాబాద్ లో
*దళిత క్రైస్తవుల హక్కుల ఫోరమ్* దళిత క్రైస్తవుల హక్కుల కోసం చేయబోయే కార్యక్రమం గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం,
*దళిత క్రైస్తవుల హక్కుల కోసం నేను కూడా నా వంతు గా సహకరిస్తాను* అనే సమాలోచన గల ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వక ఆవ్వహానం

ఇట్లు
దళిత క్రైస్తవుల హక్కుల ఫోరమ్
బి భాస్కర్ పాల్
రాష్ట్ర కమిటీ

12/06/2026

కులం అనేది పుట్టుక తో వచ్చిన శరీరం లాంటిది చచ్చేదాక మరదు

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు హిందూ మతం ఆధారంగా కాదు... సామాజిక వివక్ష ఆధారంగా కల్పించబడ్డాయిభారత రాజ్యాంగంలో ఎక్కడా "హిం...
12/06/2026

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు హిందూ మతం ఆధారంగా కాదు... సామాజిక వివక్ష ఆధారంగా కల్పించబడ్డాయి

భారత రాజ్యాంగంలో ఎక్కడా "హిందూ మతానికి చెందినవారికి రిజర్వేషన్లు ఇవ్వాలి" అని లేదు. రిజర్వేషన్ల వెనుక ఉన్న ప్రధాన కారణం చారిత్రకంగా కొన్ని వర్గాలు ఎదుర్కొన్న సామాజిక వివక్ష, అణచివేత, విద్యా మరియు ఆర్థిక వెనుకబాటుతనం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.

ఆర్టికల్ 16(4) ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఇస్తుంది.

ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతర బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించాలి అని పేర్కొనబడింది.

ఆర్టికల్ 330, 332 ప్రకారం పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించబడింది.

ఈ ఆర్టికల్స్‌లో ఎక్కడా "హిందూ మతాన్ని రక్షించడం కోసం" లేదా "హిందూ మతంలో ఉన్నందుకు" రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పలేదు. రాజ్యాంగం ఉపయోగించిన భాష మొత్తం సామాజిక వెనుకబాటుతనం, వివక్ష, తక్కువ ప్రాతినిధ్యం వంటి అంశాలపైనే ఆధారపడి ఉంది.

డాక్టర్ B. R. Ambedkar రాజ్యాంగ సభ చర్చలలో కూడా రిజర్వేషన్లను సామాజిక న్యాయం కోసం అవసరమైన చర్యగా వివరించారు. ఆయన వాదనలో ప్రధాన అంశం కులవివక్ష వల్ల అవకాశాలు కోల్పోయిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం.

అందువల్ల చారిత్రకంగా, రాజ్యాంగపరంగా చెప్పాలంటే:

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు హిందూ మతం కారణంగా రాలేదు.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు శతాబ్దాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష, అణచివేత, విద్యా మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని సరిదిద్దడానికి కల్పించబడ్డాయి.

రిజర్వేషన్లకు ఆధారం మతం కాదు.

రిజర్వేషన్లకు ఆధారం సామాజిక న్యాయం.

Address

Uppal
Hyderabad
500039

Alerts

Be the first to know and let us send you an email when దళిత క్రైస్తవుల హక్కుల ఫోరమ్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share