Telangana Bahujana Vidyarthi Parishath - Tbvp

Telangana Bahujana Vidyarthi Parishath - Tbvp E-2,95

జై mrps....సాయుధ పోరాటం తప్ప,శాంతి,సహనం,ఓర్పు, నేర్పుతో అన్ని పోరాటాలు చేసిన ఆది మహాజన నాయకుడుమందకృష్ణ మాదిగ గారు.సొంత క...
09/10/2023

జై mrps....
సాయుధ పోరాటం తప్ప,
శాంతి,
సహనం,
ఓర్పు,
నేర్పుతో అన్ని పోరాటాలు చేసిన ఆది మహాజన నాయకుడు
మందకృష్ణ మాదిగ గారు.

సొంత కులం కోసం ఉద్యమం మొదలు పెట్టి అన్ని కులాలకు అవసరమైన ఉద్యమాలు చేసి ఫలాలు సాధించి పెట్టిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు.

వెంట నడిచిన
కొంత మంది
సొంత కులస్థులు కొందరు
అమ్యాలకు ఆశపడి,
అమ్ముడు పోయి,
వేరు కుంపటి పెట్టి ఎదురు కౌంటర్లెన్ని ఇచ్చిన
అధైర్య పడకుండా సుదీర్ఘంగా ఉద్యమాలు చేస్తున్న ఉద్యమాల సూరీడు
మందకృష్ణ మాదిగ గారు.

పాలి కులం(మాల) వారు
పోటి సంఘాలు పెట్టి
నాయకులై
ఆయా పార్టీల్లో చేరి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు
అయినా...
తాను ఏ పార్టీలో చేరకుండా...
లక్ష్యం కోసం
అలుపెరగకుండా పోరాడుతున్న
అభినవ అంబెడ్కరుడు
మందకృష్ణ మాదిగ గారు.

అన్ని కుల సంఘాల
ఏర్పాటుకు దిక్సూచి అయి దశ,దిశ నిర్దేశాల
ఆదర్శ నాయకుడు
మందకృష్ణ మాదిగ గారు.

ఆయా రాజకీయ
పార్టీ నాయకుల పాదయాత్రలకు
ఆదర్శమైన ఆచరణవాది
మందకృష్ణ మాదిగ గారు.

అన్నింటికీ మించి
కులం పేరు చెప్పుకోవడానికి
అవమాన పడ్డ మాదిగ జనానికి నేను మాదిగనని
సగౌరవంగా చెప్పుకొనే
ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన ఆదిజాంబవంతుడి
వారసుడు
మందకృష్ణ మాదిగ గారు.

ఉద్యమ ఆశయం నేరవేర్చుతామంటే
ఆయా పార్టీలకు
మద్దతు ఇచ్చారే గాని,
అంతకు మించి
చేసిన తప్పేమి లేని
మచ్చలేని మహాజన నాయకుడు
మందకృష్ణ మాదిగ గారు.

ఆయా పార్టీలు పదవులు ఇస్తామన్నా ఆశపడకుండా
అమ్ముడు పోకుండా
సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఆదర్శ ఉద్యమ నాయకుడు
మందకృష్ణ మాదిగ గారు.

బహుశా ప్రపంచంలో
న్యాయ బద్దమైన కోరిక
కోసం ఇంత సుదీర్ఘ కాలం పోరాటం చేసిన వారు
ఐదారు మంది ఉంటే,
ఉండొచ్చు నేమో
కానీ
అందులో మొదటి మూడు వరుసల్లో ఉంటారు మన
మందకృష్ణ మాదిగ గారు.

మాదిగల "ఈ విశ్వ రూప మహాసభ" ద్వారానైనా
మందకృష్ణ మాదిగ గారి
ఆశయం నెరవేరాలని,

మన మాదిగ జాతి
మన వాటా
మనకు దక్కాలని కోరుకుంటూ...
మీ..
బొయిని శ్రీనివాస్
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్.

జయహో మందకృష్ణ మాదిగ గారు.

27/05/2023

*💞మనిషి ఎలా జీవించాలి💞*

🫵నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే- ఫలితాలమీద ఆపేక్ష ఉండదు.

🫵‘మా, మేము, నా’ అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికిచ్చారు. ఫలితం అందరికీ తెలిసిందే. పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికిచ్చారు. తరవాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో విజేతలయ్యారు.

*🫵ఎవరైనా జీవితంలో ప్రథమస్థానం భగవంతుడికి ఇవ్వాలి. స్వార్థాన్ని మరచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైనే తమ గురించి ఆలోచించాలి.*

🫵అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది. ప్రతి మనిషీ ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్రవేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు.

*🫵విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడంవల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు.*

*🫵ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవసేవను మాధవసేవగా భావించారు.*

🫵పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దానధర్మాలు చేశారు.

🌸మనుషులు రుషుల్లా మారారు. సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు.

🌸 మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్ముడయ్యాడు.

🌸కాలడి నుంచి హిమాచలం వరకూ కాలినడకన వెళ్ళి నిష్ఠగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు.

👏వారందరూ సంఘ శ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు.

🫵ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు.

🦁 సింహం నోరు తెరుచుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా! అసలు మన ఆలోచనలను బట్టే ప్రపంచం ఉంటుంది.

*👀మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది.*

🫵చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది.✅

✍️ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది. ప్రియంగా మాట్లాడితే శత్రువులైనా క్రమంగా మిత్రులవుతారు.

🫵 సమాజశ్రేయానికి ప్రతి మనిషీ కృషిచేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయమార్గంలో నడవాలి.
💞ప్రేమను, జ్ఞానసంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి మనీషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు!
👏 అటువంటి ధన్యజీవులే ధరిత్రిని సంతోష ధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనందనందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించగలుగుతారు.

🪷☘️🪷☘️🪷☘️🪷

27/05/2023

*టీఆర్ఎస్ 9 ఏళ్ళ పాలనలో.....*
👉దళిత ముఖ్యమంత్రి లేదు,
👉దళితులకు మూడెకరాల భూమి లేదు,
👉దళితబందు అందరికీ లేదు,
👉బిసి బందు అసలే లేదు,
👉ఇంటికో ఉద్యోగం లేదు,
👉 పరీక్షలను సరిగ్గా నిర్వహించేది లేదు.
👉నిరుద్యోగ భృతి లేదు,
👉ఉచిత ఎరువులు లేవు,
👉రైతు ఋణమాఫీ లేదు,
👉రైతులకు పంట నష్ట పరిహారం లేదు,
👉డబుల్ బెడ్ రూమ్ అందరికీ లేదు,
👉కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు,
👉కొత్త పెన్షన్లు ఇచ్చేది లేదు,
👉ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు,
👉తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు,
👉సామాజిక న్యాయం లేదు,
👉పార్టీ ఫిరాయింపులకు అడ్డు, అదుపు లేదు,
👉అప్పులకు లెక్క లేదు,
👉అబద్దాలకు అంతం లేదు,
👉అక్రమ కేసులకు న్యాయం లేదు
👉 కేజీ నుంచి పీజీ అమలు లేదు
👉కుటుంబపాలనకు అడ్డే లేదు
👉నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది లేదు
👉కెసిఆర్ కుటుంబం ఆస్తులకు లెక్కేలేదు
👉కెసిఆర్ హయాంలో తెలంగాణ 6లక్షల కోట్లు అప్పు కెసిఆర్ కే సాధ్యం
👉 ఫామ్ హౌస్ కేరాఫ్ అంటే కేసీఆర్
👉 తెలంగాణ సొమ్ము అంత వేరే రాష్ట్రలకు కెసిఆర్ కే సాధ్యం
👉 తెలంగాణ సంపద మొత్తం ఐఏఎస్ ఐపిఎస్ చేతిలో
ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు అంతే లేదు...
#కెసిఆర్ ఫెయిల్డ్ తెలంగాణ

✍🏻 నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండ భారత రాష్ట్ర పతి ద్రౌపతి ముర్ము గారు ప్రారంభించడమే సబబు.✍🏻 భారత రాజ్యాంగంలోని...
27/05/2023

✍🏻 నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండ భారత రాష్ట్ర పతి ద్రౌపతి ముర్ము గారు ప్రారంభించడమే సబబు.

✍🏻 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంటు అనగా రాష్ట్రపతి, రాజ్యసభ,లోకసభ అనగా రాష్ట్రపతి పార్లమెంటులో భాగం...

✍🏻 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 భారత దేశ సమస్త కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించునని తెలుపుతుంది.
అనగా రాష్ట్రపతి రాజ్యాంగ రిత్త....
రాజ్యాధినేత,
ప్రథమ పౌరుడు,
సర్వసైన్యాధికారి,
దేశ ప్రధాన కార్యనిర్వాహక అధికారి.

✍🏻 భారత రాజ్యాంగ లోని ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి లోకసభలో మెజార్టీ పార్టీ నాయకుణ్ణి ప్రధానిగా నియమిస్తాడు. ప్రధాని సలహా పై మంత్రి మండలిని నియమిస్తాడు..

అంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలో భారత రాష్ట్రపతియే సుప్రీమ్.ఆ పదవి తర్వాతనే ఎవరైన
అంతేకాదు ప్రస్తుత రాష్ట్రపతి విషయానికి వస్తే
ఆమే ఒక మహిళ
అందులో ST సామాజిక వర్గానికి చెందిన మహిళ
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం
రాజ్యాంగం ప్రకారం చూసిన
సంప్రదాయం పాటించిన రేపటి పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ప్రధాన మంత్రి చేతుల మీదుగా గాకుండ రాష్ట్రపతి చేతుల మీదుగా గావించడమే సబబు.కావున దేశాన్ని పాలించే నాయకులారా మీ స్వార్థ రాజకీయాలను,మీ భేషజాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి ,రాజ్యాంగ విలువలను పరిరక్షించండి,రాష్ట్రపతి చేతుల మీదుగానే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని గావించండి.

✍🏻 TBVP-INDIA.
నచ్చితే పోస్ట్ లైక్ చేయండి
షేర్ చేయండి🙏🏻

*మాతా రమాబాయి అంబేడ్కర్ 87 వ వర్థంతి.* *TBVP TELANGANA** *మా కోసం,మా భవిష్యత్ కోసం తన కన్నపిల్లల్ని సంపుకున్న మాతృమూర్తి...
27/05/2023

*మాతా రమాబాయి అంబేడ్కర్ 87 వ వర్థంతి.* *TBVP TELANGANA**



*మా కోసం,మా భవిష్యత్ కోసం తన కన్నపిల్లల్ని సంపుకున్న మాతృమూర్తి.*

*"మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం."*

*"బాబాసాహెబ్ చదువుకు బ్యాక్ బోన్"*

*ఇప్పటి తల్లుల్లా స్వార్ధంఉండి ఉంటే భవంతుల్లో రాజ భోగాలు అనుభవిస్తూ ఉండేది...కానీ ఈ దేశ అణగారిన వర్గాల కొరకు తను తన జీవితాన్నే కాక తన పిల్లల జీవితాల్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.*

*మహారాష్ట్రలోని సెంట్రల్ ఇండియాలోని కొంకణ్ ప్రాంతంలో "ధాబోల్" సమీపంలోని "వణంది" గ్రామంలో 1898 సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన జన్మించారు.చిన్నప్పుడు రమాబాయి ను రామీబాయి అని పిలిచేవారు. రమాబాయి తల్లి మరణించడంతో తండ్రి భికూధూత్రే అతికష్టం మీద తన నలుగురు బిడ్డలను పెంచేవారు.సముద్రం చేపలను బుట్టలతో మోసేపని చేయడం వలన ఆరోగ్యం దెబ్బతిని గుండెల్లో నొప్పితో కాలం చేసారు. నలుగురు బిడ్డలు అనాథలు అవడంతో రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే ఆ బిడ్డల బాధ్యతలు తీసుకున్నారు.ఈయన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు.రమాబాయి అక్క గౌరీబాయి ,చెల్లెలు మీరాబాయి,తమ్ముడు శంకర్ లు.గౌరీబాయికు చిన్నప్పుడే పరిణయం జరిగింది. రమాబాయి కు కూడా పరిణయం చేయాలని శంకర్ ధూత్రే చూస్తున్న సమయంలో అంబేడ్కర్ తండ్రి రామ్ జీ సక్పాల్ మాలోజీ కూడా తన తనయుడు అంబేడ్కర్ కు పరిణయం చేయాలని చూస్తున్నారు.అంబేడ్కర్ ను మొదటి సారిగా పాఠశాలలో చేర్చిన ఊరి "ధాబోల్".అంబేడ్కర్ తండ్రి ధాబోల్ పరిసర ప్రాంతాల్లో సంబంధాలు చూస్తుండగా రమాబాయి కనబడుతుంది.రమాబాయి గుణగణాలు గమనించిన రామ్ జీ సక్పాల్ మాలోజీ అంబేడ్కర్ కు ఇచ్చి పెళ్ళి చేయాలని రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే ను కలిసి సంబంధం ఖాయం చేసుకున్నారు.*

*రమాబాయి పరిణయం*

*అంబేడ్కర్ కు రమాబాయి కు 1908 సంవత్సరం మంబాయి నగర సబ్ స్టేషన్ పరిధిలోని భాయ్ జిల్లాలోని చేపల మార్కెట్ లో రాత్రి పరిణయం జరిగింది.చేపల కంపు కొడుతున్న ఆ మార్కెట్ లో మరొక పక్కన మురికి నీటిలో పరిణయం జరిగింది.రమాబాయికు పరిణయం సమయానికి ఆమె వయస్సు 9 సంవత్సరాలు.అంబేడ్కర్ వయస్సు 16 సంవత్సరాలు.హిందూ సమాజంలో సవర్ణులు అయిన బ్రాహ్మణ ధర్మం ప్రకారం బాల్య వివాహాలు జరగేవి.సవర్ణులు పాటిస్తున్న బాల్య వివాహాలను అసవర్ణులు కూడా పాటించారు.పై వర్ణాలు యొక్క ప్రభావం కింది వర్ణాలు మీద కూడా ఉంది. మురికి పై నుండి కదా కిందకు వచ్చేది.*

*1924 సంవత్సరం నాటికి బాబాసాహెబ్ డా.బి.ఆర్ అంబేడ్కర్-రమాబాయి దంపతులకు ఐదుగురు గురు పిల్లలు..*

*1.యశ్వంత్ రావు*
*2.గంగాధర్*
*3.రమేశ్*
*4.ఇందు*
*5.రాజారత్న*

*యశ్వంత్ రావు తప్ప మిగిలిన నలుగురు పిల్లలు రెండు, రెండున్నర సంవత్సరాల వయస్సులో రక్త హీనత, పోషకాహార లోపంతో చనిపోయారు.రమాబాయి అంబేడ్కర్ లకు తీరని వేదనను మిగిల్చింది.చిన్న వయసులోనే యశ్వంత్ రావు పోలియో వ్యాధిగ్రస్థుడు.చిన్నవాడైన రాజారత్న అంటే రమాబాయి కు ఎంతో ఇష్టం. ఎంతో గారాబంగా రాజారత్న ను పెంచారు. రాజారత్నకు 9 నెలలు నిండే వరకూ రమాబాయి సపర్యలు చేసింది.1926 జూలై 19 వ తేదీన రాజారత్న నిమోనియాతో కాలం చేశాడు.బాధాకరం ఏమిటంటే రమాబాయి కూడా రక్త హీనతతోనే మరణించింది. మిషన్ కుట్టి, పేడ ఏరి పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించేది. ఈ విషయం
అంబేడ్కర్ గారు తన రచన "థాట్స్ ఆప్ పాకిస్తాన్ " అనే గ్రంథంలో
నుదహరించారు.*
*అందరిలోకి చిన్న వాడు
రాజరత్న చాలా అందమైనవాడు.
చిన్నతనంలోనే వైద్యానికి
డబ్బులేక మరణించాడు.
ఇతని మరణం అంబేడ్కర్ ని కుంగతీసింది.తను, తన బిడ్డలు ఎన్ని పాట్లు పడ్డా, ఏనాడు అంబేడ్కర్ గారి చదువులకు గానీ, పోరాటాలకు గానీ అవరోధం కలిగించని మహాసాధ్వి మాతా రమాబాయి."*

* నేను విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లిన సమయంలో రేయింబవళ్ళు ఇంటి కోసం ఒంటరిగా అన్ని బాధలు సహించిన రమాబాయి నేటికి కూడా వాటన్నింటిని సహిస్తూనే ఉంది.నేను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆపత్కాలంలో తలపై పెట్టుకున్న ఆ పేడ తట్టును ఆమె వదలాలని కానీ,వెనక్కు ముందుకు చూడాలని కానీ తలవంచలేదు.అట్టి మమతా మూర్తి, సుశీలమతి అయిన రమాబాయి తో రోజులోని 24 గంటలలో అర్థగంట కూడా గడపలేక పోయేవాడను.*

*డాక్టర్ అంబేడ్కర్ 3-2-1928న రమాబాయి త్యాగాన్ని ఉద్ధేశించి "బహిష్కృత్ భారత్" పక్ష పత్రికలో వ్రాసిన సంపాదకీయంలో ఈ విధంగా వ్రాశారు.*

*"చాలా మంది అంబేడ్కర్ మిత్రులు సహాయ పడటానికి ముందుకొచ్చినా వారి సాయాన్ని రమాబాయి సున్నితంగా తిరస్కరించారు. ఇంకో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అంబేడ్కర్ సోదరుడు బలరాం ఒక చిన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ పరిస్థితులను గమనించి ఇంట్లో వాళ్లందరికీ కొత్త బట్టలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. రమాబాయి కోసం కూడా కొత్త చీర తెచ్చుకొమ్మని డబ్బులిచ్చారు కానీ ఆ డబ్బుతో రమాబాయి అంబేడ్కర్‌కు ధోవతుల జత, ఒక పరుపు, దిండు, అన్నం తినేందుకు కూర్చునే పీట కొని తెచ్చారు."*

*రమాబాయి కుమారులలో ఒకరైన యశ్వంత్‌రావుకి పోలియో రావడంతో వైద్య ఖర్చులు కూడా లేని స్థితిలో సంసారాన్ని ఈదడమే కష్టంగా మారింది. ఆమె పిల్లల్లో తొలి సంతానం రమేష్‌తో సహా గంగాధర్, ఇందు, రాజరత్న అనారోగ్యంతో మరణించడం ఆమెను మానసికంగానూ, శారీరకంగానూ కుంగదీసింది. ముఖ్యంగా రాజరత్న మరణం ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది. 1935 మే 27న వారి దాదర్ రాజగృహలో అంబేడ్కర్ ప్రేమతో ‘రామూ’గా పిలుచుకునే రమాబాయి 38 సంవత్సరాల వయసులోనే అంబేడ్కర్‌కి శాశ్వతంగా దూరమయ్యారు.*

*రమాబాయి సుగుణశీలి,మహాసాధ్వి*

*రమాబాయి చదువుకోలేదు, తెలివైన రమాబాయి గురించి ముందుగానే అంబేడ్కర్ కు తెలుసు.ఇద్దరూ ఎంతో గౌరవంతో జీవించారు.అంబేడ్కర్ - రమాబాయి లు త్యాగం, గౌరవం, నమ్మకం కలిగి ఉండేవారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల చక్కని బంధం ఏర్పడింది. డా.అంబేడ్కర్ తన భార్య రమాబాయి ను ప్రేమగా "రామూ" అని పిలుచుకునేవారు.రమాబాయి తన భర్తను ఎంతో ప్రేమతో "సాహెబ్" అని పిలిచేవారు. అంబేడ్కర్ తన జాతి ప్రజలు అనుభవిస్తున్న అంటరానితనం, వివక్ష, కష్టాలు గురించి పోరాటం చేయడాన్ని చూసి,ఈ దేశం కోసం తన భర్త చేస్తున్న త్యాగం గురించి ఎంతగానో గర్వించేది.ఏనాడూ రమాబాయి అంబేడ్కర్ ను వెనక్కి లాగే ప్రయత్నం చేయలేదు.*

*తన భార్యకు అంబేడ్కర్ చదువునేర్పే ప్రయత్నాలు చేశారు. ఆమె పెద్దగా చదువుపట్ల ఆసక్తి చూపలేదు. ఇంట్లో పనులు అన్నీ తానే చూసుకునేది.సంతకం పెట్టడం నేర్చుకున్న రమాబాయి తన భర్త చేస్తున్న సమాజ సేవకు తను పూర్తి తోడ్పాటును అందించడంలోనే ఉండిపోయింది. మానసికంగా చాలా తెలివైన రమాబాయి చదువుకన్నా తన భర్త విద్యావేత్తగా ఎదుగుతుండటం చూసి ఎంతగానో ఆనందించేవారు.*

*మహాసాధ్వి రమాబాయి*

*రమాబాయి తన భర్త చదువుకోవడం కోసం డబ్బులు దాచేవారు.తన భర్త ఇచ్చిన 50/- రూపాయలను కూడా ఆమె రూ 1.50/- చొప్పున 30 పొట్లాలు కట్టేవారు.మిగతా 5/- రూపాయలు ముఖ్యమైన ఖర్చులు కోసం దాచేవారు. రోజుకు ఒక పొట్లం చొప్పున ఖర్చు చేసేవారు.*

*రమాబాయి దయనీయ జీవితం.*

*తన కుటుంబం కోసం రమాబాయి పేడ ఎత్తి పిడకలు తయారు చేసి ఇంటింటికి తిరిగి అమ్మేవారు.పేడ కోసం పక్క గ్రామాలకు వెళ్ళేవారు. రమాబాయి పిడకలు అమ్ముతుంటే ఇరుగుపొరుగు మహిళలు వెటకారంగా మాట్లాడేవారు.రమాబాయి సున్నితంగా కుటుంబం కోసం పిడకలు అమ్మి కష్టపడుతుంటే ఎందుకు సిగ్గు పడాలి? అని రమాబాయి ఎదురు సమాధానం చెప్పేవారు.*

*కరుణగల రమాబాయి*

*నిమ్నజాతుల వారికి కమ్యూనల్ అవార్డు మేలు చేసేది. దానికి వ్యతిరేకంగా గాంధీ పూనాలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గాంధీ ఆరోగ్యం క్షీణించడంతో గాంధీకి ప్రాణభిక్ష పెట్టమని గాంధీ భార్య కస్తూరిబా ,సరోజిని నాయుడు మరికొందరు మహిళలు అంబేడ్కర్ ఇంటికి వెళ్ళి అర్థించారు.ఈ విషయం తెలుసుకున్న రమాబాయి బాబాసాహెబ్ దగ్గరకు వెళ్ళి గాంధీ ప్రాణాలు ఎలాగైనా కాపాడండి లేదంటే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది అంటూ ప్రాధేయపడ్డారు.వేల సంవత్సరాల మన బతుకులను బాగుచేసుకునే అవకాశాన్ని గాంధీ కాజేయాలని చూస్తున్నాడు అని అంబేడ్కర్ అంటారు. రమాబాయి అమాయకంగా ఎలాగైనా గాంధీ ప్రాణాలు కాపాడి కస్తూరి బా కు పతిభిక్ష పెట్టమంటుంది.రమాబాయి ఎంతటి కరుణ గల మనసున్న మాత అనేది మనం అర్థం చేసుకోవచ్చు.*

*రమాబాయికు అనారోగ్యం వచ్చి మంచానపడినప్పుడు అంబేడ్కర్ తలుపు దగ్గర నుంచే చూసి వాకబు చేసి వెళ్ళేవారు. ఆమెతో గడిపే సమయం ఆయనకు ఉండేది కాదు.దీంతో రమాబాయి ఎంతో బాధపడేవారు.ఉపశామ్ గురూజీ రమాబాయి ను చూడటానికి వచ్చినప్పుడు రమాబాయి తన బాధను ఆయనతో చెబుతోంది.ఉపశామ్ గురూజీ అంబేడ్కర్ దగ్గరకు వెళ్ళి రమాబాయి మనోవేదనను ,అనారోగ్య పరిస్థితిని వివరించగా ఏడు కోట్ల అంటరాని వాళ్ళ జబ్బును తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.దీనికి నా భార్య కూడా సహకరించాలని ,ఆమె ఆరోగ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, తనతో గడిపేందుకు సమయం ఇవ్వలేక పోవడం నా తప్పేనని అంబేడ్కర్ వాపోతారు.*

*రమాబాయికు ఎప్పటినుండో పండరీ పురం వెళ్ళి విఠోభాను చూడాలని ఉండేది. తన చివరి కోరిక తీర్చమని అంబేడ్కర్ ను కోరగా ఒకరోజు పండరీ పురం తీసుకుని వెళ్ళారు.అంటరాని వాళ్ళు కారణంగా 100 గజాల దూరం నుండే దర్శనం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రమాబాయి ఎంతో ఆవేదన తో ఏడ్చింది.ఆ సమయంలో అంబేడ్కర్ భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వని విఠోభా దేవుడు ఎట్లా అవుతాడని ప్రశ్నించారు.*

1935 మే నెల 26 న రమాబాయి ఆరోగ్యం మరింత క్షీణించి బొంబాయిలోని దాదర్ లో నిర్యాణం చెందారు.చివరి సారిగా రమాబాయి భర్త తో " సాహెబ్ మీరు నా ఏడు కోట్ల పిల్లలు గురించి శ్రద్ధ వహించండి. వాళ్ళకి సేవ చేయడమే మీ లక్ష్యం. మహోన్నతమైన ఆ దారి నుండి మీరు ఎన్నడూ తొలగవద్దు.వారికి గౌరవమర్యాదలు కల్పించవలసిన బాధ్యత మీదే." అని చిన్న స్వరంతో పలికారు.బాబాసాహెబ్ ఎంతో దుక్ఖించారు.భార్య మరణంతో చిన్న పిల్లవాడు వలె బాబాసాహెబ్ ఏడ్చారు.వారం రోజుల పాటు గది నుండి బయటకు రాలేకపోయారు.ఆ సమయంలో బౌద్ధ భిక్షువుగా మారాలని చీవరాలు కూడా ధరించారు.మిత్రులు సలహాతో తన అభిప్రాయం మార్చుకున్నారు.ఎందుకంటే కోట్లాదిమంది ప్రజలకు సేవచేయాలంటే పోరాటం తప్పనిసరి కాబట్టి.

*1945 లో అంబేడ్కర్ తన గ్రంథం "పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన" గ్రంథాన్ని రమాబాయికు అంకితం ఇస్తూ రమాబాయి గురించి ఇలా వ్రాసారు " ప్రియమైన రామూకి! సాత్వికమైన ఆమె మనస్సు ఆమెలోని మానసిక సద్భావనలతో పవిత్రమైన సదాచారాలతో దుక్ఖభరితమైన దినాల్లో నాకు అండగా నిలబడింది. అప్పుడు మాకు ఎవరూ సహకరించలేదు. పేదరికం, బాధలు నిలువునా మండిస్తున్నా అత్యంత సహనశీలతతో ,బలిదానంతో త్యాగం కర్తవ్య పరాయణాలతో నన్ను నడిపించిన ఆమె స్మృతిలో నివాళి💐💐💐💐

జై భీమ్ నా బహుజన బందువులకు.               మీ..   TBVP-INDIA.   మనువాద కులవ్యవస్థ వృక్షమై ఉన్న సమాజంలో మహిళను మనిషిగా చూస...
08/05/2023

జై భీమ్ నా బహుజన బందువులకు.
మీ..
TBVP-INDIA.
మనువాద కులవ్యవస్థ వృక్షమై ఉన్న సమాజంలో మహిళను మనిషిగా చూసింది ఎన్నడూ లేదు. అలాంటి సమాజంలో ఒక అంటరాని మహిళని ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాడు మాన్యవర్ కాన్షీరాం. అట్లా
ఒక్కసారి కాదు నాలుగు సార్లు, దేశంలోనే పెద్దదైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు.
బహుజన వర్గాల్లో ఒక ఆశను రగిలించారు. మయావతి గారు దేశానికి ప్రధాన మంత్రి అభ్యర్థి అనే స్థాయికి ఎదిగారు. వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రూపు రేఖలు మార్చి, ఎంతోమంది బహునులకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు మద్దతుగా నిలిచారు. ఇవాళ మరోసారి తెలంగాణ బహుజనుల పక్షాన గొంతెత్తి హైదరాబాద్ గడ్డ మీద వారు ప్రసంగించనున్నారు.
రండి మన తెలంగాణలొ బహుజన ఆత్మ గౌరవ జెండాను రెపరెపలాడిద్ధాం !!

 #ఛలో_హైదరాబాద్మే 07-04-2023 న హైదరాబాద్ సరూర్నగర్ గ్రౌండ్స్ లో నిర్వహించే  #తెలంగాణా_భరోసా_సభను  విజయవంతం చేయుటకై  లక్ష...
04/05/2023

#ఛలో_హైదరాబాద్

మే 07-04-2023 న హైదరాబాద్ సరూర్నగర్ గ్రౌండ్స్ లో నిర్వహించే #తెలంగాణా_భరోసా_సభను విజయవంతం చేయుటకై లక్షలాదిగా తరలిరండి 🐘🐘🐘🐘
మీ..
Boini Raja Srinivas,
TBVP-INDIA.

Address

Osmania University
Hyderabad
500029

Telephone

+919398814901

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Bahujana Vidyarthi Parishath - Tbvp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share