Akhila Bharatha Chiranjeevi Yuvatha

Akhila Bharatha Chiranjeevi Yuvatha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akhila Bharatha Chiranjeevi Yuvatha, Community Organization, Jubilee Hills, Hyderabad.

భీమవరం *శ్రీ యిర్రంకి సూర్యారావు గారికి* చిరు సత్కారం*జనసేన పార్టీ* రాష్ట్ర సీనియర్ నాయకులు, *సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట...
03/10/2026

భీమవరం *శ్రీ యిర్రంకి సూర్యారావు గారికి* చిరు సత్కారం

*జనసేన పార్టీ* రాష్ట్ర సీనియర్ నాయకులు, *సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ యిర్రంకి సూర్యారావు గారు* మెగా కుటుంబానికి, సమాజానికి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ *చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో* ఘనంగా సత్కరించారు.

❤️ కోవిడ్ సమయంలో భీమవరంలో *చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్* ‌ను ఏర్పాటు చేసి, వేలాది మందికి ఆక్సిజన్ అందించి సహాయం చేసిన సేవలు చిరస్మరణీయం.

🌱 పశ్చిమ గోదావరి జిల్లా *జనసేన పార్టీ అధ్యక్షులుగా* పార్టీ బలోపేతానికి కృషి చేసి, *శ్రీ పవన్ కళ్యాణ్ గారికి* అండగా నిలిచిన ప్రముఖ నాయకులలో *శ్రీ యిర్రంకి సూర్యారావు గారు* ఒకరు.

🦐 పారిశ్రామిక రంగంలో భారతదేశంలోని ప్రముఖ సీ ఫుడ్ ఎగుమతి సంస్థగా సూర్యమిత్ర ఎగ్జిమ్‌ను అభివృద్ధి చేస్తూ, సుమారు 500 మంది శాశ్వత ఉద్యోగులకు, అలాగే 3,000 మంది కార్మికులకు, ముఖ్యంగా మహిళలకు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అనేక కుటుంబాలకు జీవనోపాధికి తోడ్పడుతున్నారు.

🙏 సేవ • ఉపాధి • పారిశ్రామిక అభివృద్ధి • సమాజ సంక్షేమం — ఈ రంగాల్లో *శ్రీ యిర్రంకి సూర్యారావు గారి* సేవలు అభినందనీయం.

💐 *శ్రీ యిర్రంకి సూర్యారావు గారిని*, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

రవణం స్వామి నాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*

30/09/2026

🌹 *శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారి సేవకు సత్కారం… సమాజ అభివృద్ధికి చిరస్మరణీయం*! 🌹

*ఆంధ్రప్రదేశ్ వడ్డీలు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారికి* హృదయపూర్వక అభినందనలు!

ప్రజాసేవే పరమావధిగా… ప్రజల అభివృద్ధే లక్ష్యంగా… పార్టీ సిద్ధాంతాలే మార్గదర్శకంగా ముందుకు సాగుతున్న *సేవామూర్తి శ్రీమతి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు*.

*ప్రజారాజ్యం పార్టీ* కాలం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అనంతరం *జనసేన పార్టీ* ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ, ఎన్నో ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కొంటూ అంకితభావంతో పనిచేసిన నాయకురాలు ఆమె.

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా *దెందులూరు నియోజకవర్గంలో* *జనసేన పార్టీ ఇన్‌చార్జిగా* బాధ్యతలు నిర్వహిస్తూ,పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించారు.

కష్టకాలంలోనూ వెనుకడుగు వేయకుండా, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేశారు.

ఆమె నిబద్ధతను, సేవాభావాన్ని, పార్టీ పట్ల చూపిన అచంచలమైన విశ్వాసాన్ని గుర్తించిన *జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*, ఆమెకు *ఆంధ్రప్రదేశ్ వడ్డీలు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా* బాధ్యతలు అప్పగించడం ఆమె రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

ఈ బాధ్యతను స్వీకరించిన అనంతరం, వడ్డీలు/ మృత్యకారుల మరియు BC సామాజిక వర్గ అభ్యున్నతికి, వారి సంక్షేమానికి, విద్యా మరియు అభివృద్ధి అవకాశాల కల్పనకు కృషి చేస్తూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలవడం, BC యువత భవిష్యత్తుకు బాటలు వేయడం, విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమె సేవాభావానికి నిదర్శనం.

ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో *శ్రీమతి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారిని* సత్కరించడం ఎంతో ఆనందదాయకమైన విషయం.

రాజకీయాల్లో నిబద్ధత… ప్రజల్లో ఆత్మీయత… సేవలో అంకితభావం… బాధ్యతల్లో చిత్తశుద్ధి! ఈ విలువలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ,వడ్డీలు సామాజిక వర్గ అభ్యున్నతికి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు, మహిళల సాధికారతకు, జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

మీ సేవా ప్రస్థానం మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలి… మీ నాయకత్వంలో మరెన్నో కుటుంబాల్లో అభివృద్ధి వెలుగులు నిండాలి… ప్రజల ఆశీర్వాదాలతో మీరు మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ…

*జై హింద్! 🇮🇳 జై జనసేన*!

రవణం స్వామి నాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*

*విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు* . *విజయవాడలో జరిగిన*పెద్ది*సిని...
29/09/2026

*విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు* .

*విజయవాడలో జరిగిన*పెద్ది*సినిమా ఫంక్షన్ కు*మంగళగిరిలో ACA International క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు విచ్చేసినపుడు MP శ్రీ కేశినేని చిన్ని గారు ఘన స్వాగతం పలికి.. కావలసిన ఏర్పాట్లు చేసి మాకు అన్నివిధాలా సహకరించారు* .

*శ్రీ రామ్ చరణ్ గారి* పై ఎంతగానో ప్రేమాభిమానాలు చూపించినందులకు విజయవాడలో *శ్రీ కేశినేని చిన్నిగారిని* వ్యక్తిగతంగా కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

*శ్రీ కేశినేని చిన్ని గారికి* మెగాభిమానులు ఆయా సమయాలలో అన్ని విధాల సహకరించినందుకు వారు కూడా మెగా అభిమానుల తరుపున నన్ను కూడా ప్రత్యేకంగా అభినందించినందుకు ధన్యులం.

*ఈ సందర్భంగా మరొకసారి విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారికి మన అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ* ..

రవణం స్వామి నాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*

*గౌరవనీయులు శ్రీ వంగవీటి రాధా గారికి అఖిలభారత చిరంజీవి యువత హృదయపూర్వక శుభాకాంక్షలు* .జాతి కోసం నిలబడి.. ప్రజాసేవలో  నిమ...
28/09/2026

*గౌరవనీయులు శ్రీ వంగవీటి రాధా గారికి అఖిలభారత చిరంజీవి యువత హృదయపూర్వక శుభాకాంక్షలు* .

జాతి కోసం నిలబడి.. ప్రజాసేవలో నిమగ్నమై.. వారి బాధ్యతను భుజాన వేసుకునేవాడే నాయకుడు. ఇలాంటి నాయకులు దేశంలో ఎందరో ఉన్నారు. వారిలో జాతి కోసం నిలబడిన స్వర్గీయ *శ్రీ వంగవీటి రంగా గారు* ఒకరైతే..

జాతి మనుగడను భవిష్యత్ తరాలకు తీసుకెళ్తున్న *శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారు* ఇంకొకరు.

*రాజకీయాల్లో నాడు బెబ్బులిలా గర్చించిన వంగవీటి కుటుంబం* .
*నేటి రాజకీయాలలో కొదమసింహంలా శ్రీ కొణిదెల పవన కళ్యాణ్ గారు* .

*రాజకీయాల్లో ప్రజా శ్రేయస్సే పరమావధిగా* ..

*నాయకులుగా జాతి గుర్తింపు కోసం నిలబడే ధీరోదాత్తమైన వ్యక్తిత్వం వీరి సొంతం* .

వీరిద్దరూ కలిస్తే.. ఆ ఆలోచన, ఆ ఊహ నిజమైతే మన జాతికి పండగ.. సంబరం.

*అటువంటి అరుదైన కలయిక సాకారమై అందరికీ కన్నులపండుగగా మారింది* .

*భవిష్యత్తులో వీరి కలయిక.. రాజకీయ జోడీగామారి ప్రజా క్షేమాన్ని కాంక్షించి* ..
*జాతి మనుగడను ముందుకు తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ* ..

త్వరలో రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీ *వంగవీటి రాధా గారికి మనస్ఫూర్తిగా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.*

రవణం స్వామినాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*

*తెలంగాణ జనసేన బలమైన గళం & సేవా శీలి మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జ...
26/09/2026

*తెలంగాణ జనసేన బలమైన గళం & సేవా శీలి మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు* !

ప్రచార ఆర్భాటాలు లేని నిశ్శబ్ద వ్యూహం.. పార్టీ పట్ల తిరుగులేని నిబద్ధత.. కార్యకర్తలను కలుపుకుపోయే ఆత్మీయత!

మన డిప్యూటీ సీఎం, జనసేనాని *శ్రీ పవన్ కళ్యాణ్ గారి* ఆలోచనలకు అనుగుణంగా పార్టీ సంస్థాగత పునాదులను పటిష్టం చేయడంలో నిరంతరం శ్రమిస్తున్న మన ప్రియతమ నేత, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీ నిర్మాత , ప్రముఖ వ్యాపారవేత్త *శ్రీ రామ్ తాళ్లూరి గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

*మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని* …

*రాబోయే రోజులలో ఖమ్మం పార్లమెంటు సభ్యులుగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను* .

రవణం స్వామినాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*

*చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో* 45వసారి రక్తదానం చేసిన రక్తదాత *శ్రీ S యాదగిరి ( 0+ve )గారికి* అభినందనలు.మెగా అభిమాని, మెదక్ ...
26/09/2026

*చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో* 45వసారి రక్తదానం చేసిన రక్తదాత *శ్రీ S యాదగిరి ( 0+ve )గారికి* అభినందనలు.

మెగా అభిమాని, మెదక్ జిల్లా రామాయంపేట వాస్తవ్యులు *శ్రీ S. యాదగిరి గారు* *చిరంజీవి బ్లడ్ సెంటర్‌* లో 45 వసారి రక్తదానం చేశారు.

అంతేకాకుండా, *చిరంజీవి బ్లడ్ సెంటర్‌* తో పాటు బయట కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తూ, ఇప్పటివరకు మొత్తం 52 సార్లు రక్తదానం చేయడం ఎంతో అభినందనీయం.

*మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరఫున శ్రీ S. యాదగిరి గారికి* హృదయపూర్వక ధన్యవాదాలు.

*చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్*

Heartily Congratulations to Smt. Upasana Kamineni Konidela Garu on being appointed as Director – Apollo Hospitals Projec...
24/09/2026

Heartily Congratulations to Smt. Upasana Kamineni Konidela Garu on being appointed as Director – Apollo Hospitals Projects. 💐✨

Wishing you continued success in this new role! 🌟

HEARTIEST CONGRATULATIONS! 🏆🔥Niharika Konidela Garu & the entire team of   — congratulations on receiving the National A...
23/09/2026

HEARTIEST CONGRATULATIONS! 🏆🔥

Niharika Konidela Garu & the entire team of — congratulations on receiving the National Award for Best Telugu Feature Film! ❤️

A moment of immense pride for Telugu Cinema! 🙌✨

*సంగారెడ్డి జిల్లాలోని విశ్రాంత విద్యాధికారి శ్రీ డి. అంజయ్య గారు 50 వ సారి రక్తదానం.*బాలల అభివృద్ధికి అక్షర బాటలు వేస్త...
22/09/2026

*సంగారెడ్డి జిల్లాలోని విశ్రాంత విద్యాధికారి శ్రీ డి. అంజయ్య గారు 50 వ సారి రక్తదానం.*

బాలల అభివృద్ధికి అక్షర బాటలు వేస్తున్న అక్షర బాటసారి *శ్రీ D. అంజయ్య గారు.*

ఉత్తమ విద్యాధికారిగా ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డులు అందుకున్న ప్రముఖ సంఘ సేవకులు.

పేద బాలలకు ఉచిత విద్య చెప్పి వారిని పైకి తీసుకొని రావాలని ఎంతగానో కృషి చేసిన నిరంతర శ్రామికులు *శ్రీ అంజయ్య గారు.*

*శ్రీ D. అంజయ్య గారు చిరంజీవి బ్లడ్ సెంటర్* నందు 50 వ సారి రక్తదానం చేసిన సందర్భంగా మెగాస్టార్ *శ్రీ చిరంజీవి గారి* తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు.

*శ్రీ D.అంజయ్య గారిని* ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

*చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్*

Address

Jubilee Hills
Hyderabad
500033

Website

Alerts

Be the first to know and let us send you an email when Akhila Bharatha Chiranjeevi Yuvatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akhila Bharatha Chiranjeevi Yuvatha:

Shortcuts

Share