Gouthama foundation

Gouthama foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gouthama foundation, Nonprofit Organization, Hyderabad.

All the best Students
28/02/2024

All the best Students

గౌతమ ఫౌండేషన్ మరియు ది గర్ల్ ఫౌండేషన్ సంయుక్తంగా నేడు కడ్తాల్ మండలం లోని గనుగుమర్ల తండాలో మరియు మండల కేంద్రంలోని బాలికల ...
16/02/2024

గౌతమ ఫౌండేషన్ మరియు ది గర్ల్ ఫౌండేషన్ సంయుక్తంగా నేడు కడ్తాల్ మండలం లోని గనుగుమర్ల తండాలో మరియు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సానిటరీ ప్యాడ్ వినియోగము, తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అంశాలపై బాలికలకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌతమ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ గారు మాట్లాడుతూ నేటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి మొదలగు కారణాల రీత్యా బాలికలు చిన్న వయసులోనే రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్నారని, వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారని, అలాంటి వారికి తగిన సలహాలు సూచనలు అందించడం ముఖ్యమని సూచించారు. అందులో భాగంగానే ది గర్ల్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులకు, గ్రామస్తులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో రోహిణి నాయుడు ది గర్ల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సానిటరీ ప్యాడ్ వినియోగము గురించి విద్యార్థులకు, గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Happy Independence Day
15/08/2023

Happy Independence Day


17/07/2023
గౌతమ ఫౌండేషన్ అధ్యక్షులు కొప్పు కృష్ణ ఆధ్వర్యంలో నవ జీవన్ బ్లడ్ బ్యాంక్, చైతన్యపురి వారి సౌజన్యంతో రక్త దాన శిబిరం నిర్వ...
17/07/2023

గౌతమ ఫౌండేషన్ అధ్యక్షులు కొప్పు కృష్ణ ఆధ్వర్యంలో నవ జీవన్ బ్లడ్ బ్యాంక్, చైతన్యపురి వారి సౌజన్యంతో రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు శ్రీ పాపిశెట్టి రాము, కలకొండ సర్పంచ్ శ్రీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

ఉద్దేశ్యం: ర‌క్త‌దానం ప్రాణాల్ని కాపాడుతుంది. ర‌క్త‌దానంపై త‌గిన చైత‌న్యం పెంచుదాం.

ఈ కార్యక్రమంలో ఆమనగల్ మండలానికి సంబంధించినటువంటి 40 మంది తమ యొక్క రక్తాన్ని దానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇంజమూరి భాస్కర్, జంతుక శంకర్, కృష్ణ నాయక్, భాస్కర్, మల్లేష్, కొప్పు సాయి కుమార్, A. శేఖర్, విటాయిపల్లి రమేష్ మరియు నవ జీవన్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు S. శ్రీనివాస్, B. వెంకట్, P.దివ్యవాణి, A. జయలలిత పాల్గొనడం జరిగింది.

గౌతమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16-07-2023 ఆదివారం నాడు ZPHS Boys School ఆమనగల్లు లో "రక్తదాన శిబిరం" నవ జీవన్ బ్లడ్ బ్యాంక్ చై...
16/07/2023

గౌతమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16-07-2023 ఆదివారం నాడు ZPHS Boys School ఆమనగల్లు లో "రక్తదాన శిబిరం" నవ జీవన్ బ్లడ్ బ్యాంక్ చైతన్య పురి వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తుంది.అందుబాటులో ఉన్న మిత్రులు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గోని విజయవంతం చేయగలరని ఆశిస్తూ గౌతమ ఫౌండేషన్ ఈ కార్య్రమానికి సగౌరవంగా తమరిని ఆహ్వానిస్తుంది.

International Yoga Day
21/06/2023

International Yoga Day

" జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం" కార్యక్రమాన్ని పురస్కరించుకొని  ఆమనగల్, Kadthal మాడుగుల, తలకొండపల్లి మండలాల్లోని సర్పంచుల...
23/04/2023

" జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం" కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమనగల్, Kadthal మాడుగుల, తలకొండపల్లి మండలాల్లోని సర్పంచులు మరియు మండల ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీలు) లకు గౌతమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో " స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ సన్మానం"
కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారి చేతుల మీదగా కార్యక్రమ కరపత్రం విడుదల చేస్తూ.. కార్యక్రమాన్ని ఉద్దేశించి
మాట్లాడుతూ మనదేశంలో మూడంచల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది అందులో భాగంగానే మన గ్రామపంచాయతీ వ్యవస్థ చాలా ప్రతిష్టవంతంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వాల నుండి ప్రజలకు చేరవేయుటలో స్థానిక సంస్థలు కృషి ఎనలేనిది అలాగే గ్రామ అభివృద్ధి సాధించాలంటే మనమందరం మంచి ఆలోచనతో ఒక సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారతదేశం యొక్క ఆత్మ గ్రామాలలోని ఉంది అని మహాత్మా గాంధీ చెప్పినట్లుగా మన యొక్క దేశం వ్యవసాయ అభివృద్ధి ఇంకా గ్రామాలలోనే ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు మన గ్రామీణ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఆమనగల్ జెడ్పిటిసి శ్రీమతి అనురాధ పత్య నాయక్ మరియు కడ్తాల్ జడ్పిటిసి శ్రీ దశరథ్ నాయక్ విశిష్ట అతిథులుగా పాల్గొనడం జరిగింది.
అలాగే ఆమనగల్ తలకొండపల్లి మాడుగుల కడ్తాల్ మండలాల సర్పంచులు మరియు ఎంపీటీసీ ఎంపీటీసీలు పాల్గొని సన్మానాన్ని స్వీకరించడం జరిగింది.
అలాగే గౌతమ ఫౌండేషన్ అధ్యక్షులు కొప్పు కృష్ణ గారు, జనరల్ సెక్రెటరీ రజనీకాంత్ గారు, ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, సభ్యులూ పి. కృష్ణ, కే. శ్రీనివాసులు, కిరణ్, విటాయిపల్లి రమేష్, గణేష్, సాయికుమార్, పరుశురాం, వంశీకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.

ధన్యవాదములతో...

కొప్పు కృష్ణ
వ్యవస్థాపక అధ్యక్షులు
గౌతమ ఫౌండేషన్
8500033389

   #2023
22/04/2023

#2023

గౌతమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 23-04-2023 న జరగబోయే "జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం  కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ" కడ్తల్ మండల పరిధ...
20/04/2023

గౌతమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 23-04-2023 న
జరగబోయే "జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ" కడ్తల్ మండల పరిధిలోని MPDO కార్యాలయం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MPP కమ్లి మొత్యనాయక్ గారు,ZPTC జర్పుల దశరథ్ నాయక్ గారు, సర్పంచుల సంఘం తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు LN రెడ్డి గారు, యువజన సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర రాఘవేందర్ గారు,PACS చైర్మన్ గంప వెంకటేష్ గారు, గౌతమ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ గుడ్ల రజనీకాంత్ గారు, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం గౌతమ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ గుడ్ల రజనీకాంత్ గారు మాట్లాడుతూ
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌతమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్, కడ్తల్, మాడుగుల, తలకొండపల్లి మండలాల్లోని సర్పంచులు మరియు మండల ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీలు) లకు సంస్థ ఆధ్వర్యంలో "స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ సన్మానం" కార్యక్రమం 23.04.2023 నాడు ఉదయం 10:00 గంటలకు అమనగల్ శ్రీ లక్ష్మీ గార్డెన్స్ & ఫంక్షన్ హాల్ నందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గౌతమ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ గుడ్ల రజనీకాంత్ గారు మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది.

ధన్యవాదములతో...

గుడ్ల రజనీకాంత్
జనరల్ సెక్రెటరీ
గౌతమ ఫౌండేషన్

Address

Hyderabad
509321

Telephone

+919866631399

Website

Alerts

Be the first to know and let us send you an email when Gouthama foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gouthama foundation:

Share