GOUD Gouds Organisation for Unity and Development

Directions Contact the organization

GOUD Gouds Organisation for Unity and Development GOUD(Gouds Organisation for Unity and Development) (TODDY TAPPERS)
Hyderabad, Telangana State, INDIA

*సర్దార్ సర్వాయి పాపన్న: బహుజనీకరణ యుగానికి మార్గదర్శి,* *బహుజన రాజకీయ చైతన్యానికి ఆద్యుడు (1650–1710)* “ *సామాజిక న్యాయ...
18/08/2026

*సర్దార్ సర్వాయి పాపన్న: బహుజనీకరణ యుగానికి మార్గదర్శి,* *బహుజన రాజకీయ చైతన్యానికి ఆద్యుడు (1650–1710)*
“ *సామాజిక న్యాయం • ప్రజా ప్రతిఘటన • బహుజన శక్తీకరణ”*
( *శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంన్గా 18-08-2026 & సర్దార్ పాపన్న కాంశ్య విగ్రహము ఆవిష్కరణ నేడు ట్యాంకుబండుపై)*

— డా. చలమల్ల వెంకటేశ్వర్లు అసోసియేట్ ప్రొఫెసర్, రాజనీతి శాస్త్రం, ఉస్మానియా యూనివర్సిటీ
ప్రెసిడెంట్, గౌడ్ సోషల్ ఫోరం (GSF),
గౌడ్ ఆర్గనైజేషన్ ఫర్ యూనిటీ అండ్ డెవలప్మెంట్ (GOUD), బీసీయూనిటీ & GS గ్రేట్

సారాంశం
తెలంగాణ చరిత్రలో ధైర్యం, గౌరవం, ఆత్మగౌరవానికి చిరస్థాయిగా నిలిచిన ప్రజా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న (1650–1710), బహుజన సమానత్వ దిశగా తొలి సామాజిక–సాంస్కృతిక, రాజకీయ పోరాటాన్ని ఆవిష్కరించిన మహనీయ నాయకుడు. మొఘల్ అధికారుల అణచివేత, అన్యాయ పన్నుల విధానాలు, సామాజిక వివక్ష తీవ్రత ఎక్కువగా ఉన్న కాలంలో పాపన్న ప్రజల స్వరాన్ని ప్రతిబింబిస్తూ ఒక క్రొత్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. దళిత–బీసీ–అణగారిన (బహుజనులు ) వర్గాలను తన నాయకత్వంలో సంఘటితం చేసి, వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక గౌరవం కల్పించడం ఆయన పోరాటానికి కేంద్రబిందువు. అందుకే ఆయనను తెలంగాణ తొలి సామాజిక విప్లవ వీరుడిగా, బహుజనీకరణ యుగానికి మార్గదర్శిగా చరిత్ర గుర్తించింది. పాపన్న సమాజంలోని ప్రతి వర్గానికి—కులమతభేదం లేకుండా—సమాన రాజకీయ అవకాశాలు కల్పించాలనే దృఢనిశ్చయంతో చేసిన కృషిని స్మరించుకోవడం ఎంతో ప్రాశస్త్యంతో కూడుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆయనే ముందుగానే ఆచరించారు; ప్రజలే తమ రాజకీయ, ఆర్థిక దిశను నిర్ణయించే స్వతంత్రతను నిర్మించాలనే ప్రయత్నం ఆయన పోరాటంలో స్పష్టంగా కనిపిస్తుంది. పాపన్న వారసత్వాన్ని అధికారికంగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి–వర్ధంతులను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఒక చారిత్రక నిర్ణయం. హైదరాబాదు ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహం ప్రతిష్టించడం కొరకై ప్రభుత్వ నిర్ణయం ,అది నేడు ఆచరణలో నిలవడం రాష్ట్రవ్యాప్తంగా ఆయన స్మారకోత్సవాలను నిర్వహించడం ప్రజా నాయకుడిగా ఆయనకు లభించాల్సిన గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈనాటికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మరియు నేటి తెలంగాణ లో నాయకులను తీర్చిదిద్దే విధానాలను పాపన్న కలగన్న సమానత్వ దృక్పథానికి సమకాలీన ప్రతిరూపం. ప్రజానాయకత్వం, సామాజిక న్యాయం, బహుజన శక్తీకరణ పునాది మీద నిలిచిన పాపన్న ఆశయాలు, నేటి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తు ఉద్యమాలు సాగుతున్నాయి .దీనిపై సమగ్రంగా విశ్లేషణ చేయడం ఈ ఆర్టికల్ లక్యం .

1. పరిచయం
సామాజిక న్యాయం, దళిత ఆదివాసీ మైనారిటీ –బీసీ శక్తీకరణ (బహుజనులు )
తెలంగాణ చరిత్రలో ప్రజా ప్రతిఘటన, సామాజిక న్యాయం, దళిత–బీసీ శక్తీకరణకు ప్రతీకగా నిలిచిన అత్యంత కీలక నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న (1650–1710). మొఘల్ సామ్రాజ్యానికి ఎదిరించి స్వతంత్ర పరిపాలన స్థాపించిన ఆయన, అణగారిన వర్గాలకు పరిపాలనా హక్కులు, సామాజిక గౌరవం, రాజకీయ స్థానం ఇచ్చిన అరుదైన చారిత్రక వ్యక్తిత్వం. ఈ పరిశోధనా వ్యాసం పాపన్న వ్యక్తిత్వంలో బహుజనీకరణ, సబ్‌ఆల్టర్న్ రాజకీయ స్ఫూర్తి, సోషియల్ బాండిట్రీ సిద్ధాంతం, బౌద్ధ ప్రభావం మరియు తెలంగాణ సమకాలీన రాజకీయ–సాంస్కృతిక పరిణామాలపై ఆయన ప్రభావాన్ని విశ్లేషిస్తుంది.

తెలంగాణ ప్రజా చరిత్రలో పాపన్న ఒక ప్రత్యేక ప్రతీక. ఆయన్ని కేవలం ప్రాదేశిక నాయకుడిగా లేదా ఒక కులానికే చెందిన వ్యక్తిగా చూడటం చరిత్రకు అవమానం. అణగారిన వర్గాలకు అధికారాన్ని అందించిన తొలి నాయకుడు పాపన్న; 17వ శతాబ్దంలోనే “బహుజన ఆధిక్యం” అనే రాజకీయ భావనను ఆచరణలో పెట్టిన ప్రజానాయకుడు. ఈ పునర్మూల్యాంకనం పాపన్నను తెలంగాణ బహుజన రాజకీయ చైతన్యానికి ఆద్యుడిగా ప్రతిష్ఠిస్తోంది.

2. సర్దార్ సర్వాయి పాపన్న – చారిత్రక నేపథ్యం
పాపన్న తెలంగాణ లోని పూర్వ వరంగల్ జిల్లా , ప్రస్తుత జనగాం జిల్లా ఖిలాషాపుర్ ప్రాంతానికి చెందిన గౌడ కులం కౌండిన్య వంశస్థుడు.ఖిలాషాపుర్ (లేదా క్విలాషాపూర్) అనేది ఒక జిల్లా కాదు, భారతదేశంలోని తెలంగాణాలోని జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో ఉన్న చారిత్రాత్మక ఖిలాషాపూర్ కోటకు ప్రసిద్ధి చెందిన గ్రామం. పురాతన జైన అవశేషాలు మరియు కోటలతో కూడిన ముఖ్యమైన చారిత్రక ప్రదేశం అయిన ఈ కోటను యోధుడు పాపడు రాజధానిగా ఉపయోగించాడని మరియు దాని దృఢమైన సున్నపు మోర్టార్ నిర్మాణం మరియు కోటలు మరియు సీక్రెట్ వంటి రక్షణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలో మొఘల్ పరిపాలనా దోపిడీ, దొరల ఆధిపత్యం తీవ్రంగా పెరిగి, దళిత–బీసీ వర్గాలు దోపిడికి గురయ్యాయి. ఈ పరిస్థితిలో పాపన్న ప్రజల పక్షాన నిలబడ్డాడు. కుల–వర్గ ఆధారిత వివక్షను సవాలు చేశాడు. పరిపాలన, సైన్యంలో అణగారిన వర్గాలకు స్థానం కల్పించాడు దీనినే బహుజానీకరణ అనడం లో అతిశయోక్తి లేదు.

ఆసియాటిక్ జర్నల్ (1832) పాపన్నను “మొఘల్ అధికారం ఎదుర్కొని స్వతంత్ర పాలన నిర్మించిన అరుదైన తెలంగాణ నాయకుడు”గా రికార్డు చేస్తుంది. మద్రాస్ గాజెట్టే (1890) కూడా పాపన్న పాలనలో నాయకత్వ స్వపరిపాలనా లక్షణాలు బలంగా ఉన్నాయని పేర్కొంటుంది.

3. పాపన్న భూ పరిపాలన – బహుజనీకరణ సిద్ధాంతానికి పునాది
పాపన్న పాలనలో బహుజన వర్గాలు — దళితులు, బీసీలు, ఇతర ఆర్థికంగా బలహీన వర్గాలు — మొదటిసారిగా పరిపాలనలో కీలక పాత్ర పోషించాయి. ఆయన నిర్మించిన రాజ్య నిర్మాణంలో: పూజారి వర్గానికి ప్రత్యేక హక్కులు ఇవ్వలేదు దేవాలయాల యాజమాన్యాన్ని బహుజన వర్గాలకు బదిలీ చేశాడు. కొత్త దేవాలయాలు నిర్మించలేదు. వ్యవసాయం, వాణిజ్యం, సైన్యంలో బహుజన వర్గాల ఆధిపత్యం పెంచాడు. ఇది భారతీయ బ్రాహ్మణిక పరిపాలన వ్యవస్థకు సూటిగా విరుద్ధం.

4. సోషియల్ బాండిట్ సిద్ధాంతం – పాపన్న పాత్ర
ప్రసిద్ధ బ్రిటీష్ మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్ (1969) ప్రతిపాదించిన సోషల్ బాండిట్ థియరీ ప్రకారం: సోషియల్ బాండిట్ అంటే: అధికార వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడినవాడు. దోపిడీకి గురైన వర్గాలకు హక్కులు ఇచ్చినవాడు.ప్రజాగేయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినవాడు. పాపన్న ఈ మూడూ లక్షణాలను అత్యుత్తమంగా ప్రతిబింబించాడు. చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్ వాస్తవానికి ప్రజల తరఫున పోరాడిన ప్రజానాయకుడని పేర్కొన్నాడు. సామ్రాజ్యవాదం, జమీందారీ, భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయుధం తీసుకున్న వాడే సోషియల్ బాండిట్. ఈ లక్షణాలను తెలంగాణ చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకంగా ప్రతిబింబించిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయనను చరిత్రలో ఒక సాధారణ తిరుగుబాటుదారుడిగా కాకుండా, దళిత–బీసీ వర్గాల కోసం పోరాడిన సబ్‌ఆల్టర్న్ యోధుడు, ప్రజాపాలకుడు, బహుజన రాజకీయ చైతన్యానికి ఆద్యుడుగా గుర్తించాలి.అందుకే గుహ (1983), ఈటోన్ (2005), రిచర్డ్స్ & రావు (1979) వంటి చరిత్రకారులు పాపన్నను తెలంగాణ సబ్‌ఆల్టర్న్ ( సామాజిక శాస్త్రంలో: ఆంటోనియో గ్రామ్‌స్కీ వాడిన ఈ పదం, సమాజంలో అణచివేయబడిన, అధికారిక కథనాల్లో స్థానం లేని సామాన్య ప్రజలను లేదా వర్గాలను సూచిస్తుంది (ఉదాహరణకు, భారతదేశంలోని సామాన్యులు). చరిత్రలో ప్రముఖ నాయకుడిగా పేర్కొన్నారు.ప్రజాగేయాల్లో హీరోగా నిలిచిన పాపన్న

పాపన్న తెలంగాణ జానపద సాహిత్యంలో ఒక మహా ప్రతీక. పాలేరు, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో ఇప్పటికీ పాడబడే గేయాల్లో పాపన్నను: అణగారిన వర్గాల రక్షకుడు, దోపిడీ అధికారుల శత్రువు, ధైర్యవంతుడు, ప్రజా వీరుడు గా వర్ణిస్తారు.
బోయిల్ (1874) కూడా పాపన్న జనగణమనంలో నిలిచిన వీరుడని రికార్డు చేశాడు. జానపద గేయాలు పాపన్నను రాజకుమారుల కన్నా గొప్పయోధుడిగా, సాధారణ ప్రజల నాయకుడిగా చూపించడం సోషియల్ బాండిట్ లక్షణాలకు నిదర్శనం.చారిత్రక ఆధారాలు పాపన్న వీరత్వాన్ని ధృవీకరించాయి. పాపన్నను కేవలం జానపద నాయకుడిగానే కాకుండా, చారిత్రక ఆధారాలతో ఉన్న ప్రజానాయకుడిగా అనేక పత్రికలు, గ్రంథాలు నమోదు చేశాయి. పాపన్న జానపద గేయాల్లో శాశ్వతంగా నిలిచిన ప్రజానాయకుడు. ఈటోన్ (2005), రిచర్డ్స్ & రావు (1979), గుహ (1983)

5. పాపన్న పోరాటంలోని ఐదు కీలక దశలు
5.1 బ్రాహ్మణ భావజాల వ్యతిరేకత : భారతీయ రాజులు సాధారణంగా పూజారి వర్గాన్ని ప్రోత్సహించారు కానీ పాపన్న మాత్రం వారికి ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదు, పూజ/ఆధ్యాత్మిక వ్యవస్థలో బహుజన వర్గాలకే ప్రాధాన్యం ఇచ్చాడు, ఆ కాలానికి విప్లవాత్మకమైన సమానత్వ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అందుకే అనేక ప్రాంతాల్లో కులదైవమైన ఎల్లమ్మ దేవాలయాలు మనకు నేటికీ కనిపిస్తాయి . మరియు బుద్ధుడి ప్రతిమలు పాపన్న పరిపాలించిన ప్రాంతములలో వెలుగులోకి వచ్చాయి దానిపై చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు.

5.2 సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం
పాపన్న తెలంగాణ లో మొఘల్ అధికారం ఎదుర్కొని స్వతంత్ర కోటలు నిర్మించిన తొలి నాయకుడు.ఆయన సైన్యం: 3,000 కాల్బలం, 500 అశ్వదళం గలదని ఆంగ్లాధికారుల రికార్డులు పేర్కొంటాయి.

5.3 భూస్వామ్య వ్యతిరేక పోరాటం
దొరల, అగ్రకుల భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా:బహుజన వర్గాల ఐక్యతను పెంచాడు, తన స్వంత ధనాన్ని వాడి ఆయుధాలు కొనుగోలు చేశాడు. అణగారిన కులాల వారిని సైన్యంలో నాయకులుగా నియమించాడు

5.4 బౌద్ధ ప్రభావం
పాపన్న పాలనలో “బహుజన హితాయ, బహుజన సుఖాయ” అనే బౌద్ధ తాత్విక దృక్పథం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
అతను:భయరహిత సమాజాన్ని నిర్మించాడు, కుల ఆధిపత్యాన్ని నిరాకరించాడు, చరిత్ర కారులు పరిశోధించిన మరియు శిలాశానాలు తవ్వకాల్లో ఇటీవలకాలంలో నల్గొండ పిల్లలమర్రి నుండి కామారెడ్డి వరకు అనేకచోట్ల బుద్ధ విగ్రహాలు వెలుగులోకి వచ్చిన విషయం మనకు తెలియజేస్తున్నది.

5.5 దళిత–బహుజన రాజ్యాధికారం
పాపన్న రాజ్యం భారత చరిత్రలో "బహుజన ఆధిక్యం"కు మొదటి నమూనా. దళితులు, బీసీలు, మైనారిటీస్ అతని సైన్యం, పరిపాలన, దౌత్య వ్యవస్థలో కీలక స్థానాలు పొందారు. పాపన్న బీసీ, దళిత, ఇతర అణగారిన వర్గాలను పరిపాలన, సైన్యం, భూస్వామ్యంలో కీలక స్థానాల్లో నియమించిన తొలి నాయకుడు.మొఘల్ సామ్రాజ్య పన్నుల దోపిడీ, భూస్వాముల దౌర్జన్యాల నుంచి ప్రజలను రక్షించడానికి ఆయుధం ఎత్తాడు.

అతని సైన్యంలో: వర్తక సమూహాలు, గౌడలు, మాలలు, మాదిగలు, షెడ్యుల్డ్ –ట్రైబ్స్, వలస వృత్తి వర్గాలు
అన్నీ కీలకమైన పాత్రలు పోషించాయి. ఇది బహుజన ఆధారిత రాజకీయంకు చారిత్రక ఉదాహరణ.

అధికార వర్గాలకు తిరుగుబాటు:
పాపన్న 17వ శతాబ్దంలోనే మొఘల్ సామ్రాజ్యాధికారులకు: పన్నులు చెల్లించలేదు, బలగాలకు ప్రతిఘటన ఇచ్చాడు, వరంగల్, భువనగిరి కోటలను స్వాధీనం చేసుకున్నాడు, ఆయన తిరుగుబాటు కేవలం రాజకీయ పోరాటం కాదు; అది దళిత–బీసీ వర్గాల స్వాభిమాన విప్లవం. ఆసియాటిక్ జర్నల్ (1832) ఆయనను “మొఘల్ పాలనను సవాలు చేసి స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించిన తెలంగాణ నాయకుడు”గా పేర్కొంది.ఇది ఆయన తిరుగుబాటుకు చారిత్రక సాక్ష్యం.

6. తెలంగాణ జానపద సాంస్కృతికంలో పాపన్న
పాపన్న తెలంగాణ ప్రజా గేయాల్లో, కథల్లో, పురాణాల్లో శాశ్వత స్థానం సంపాదించాడు. బాయిల్ (1874) పాపన్నను ప్రజల హృదయంలో నిలిచిపోయిన వీరుడు అని పేర్కొంటాడు. జానపద సంప్రదాయంలో పాపన్న: దోపిడీకి గురైన వర్గాలను రక్షించిన రక్షకుడిగా, దొరలు–సామ్రాజ్యవాదులకు ఎదురు నిలిచిన ధైర్యవంతుడిగా గుర్తింపబడుతాడు.

7. ఆధునిక తెలంగాణ మరియు పాపన్న వారసత్వం
ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం పాపన్నను చరిత్రలోని సరైన స్థానంలో నిలబెట్టే చర్యలు చేపడుతోంది:
పాపన్న స్మారక చిహ్నాల సంరక్షణ ఈ చర్యలు తెలంగాణ బహుజన చరిత్ర పునర్నిర్మాణానికి సంకేతాలు.

8. పాపన్న చరిత్రను వెలుగులోనికి తెచ్చిన పరిశోధన – కొంపెల్లి వెంకట్ గౌడ్ గారికి అభినందనలు
పాపన్నపై పరిశోధనాత్మక తెలుగు రచన వెలువరించి తెలంగాణ చరిత్రలో నూతన దిశను చూపించిన కొంపెల్లి వెంకట్ గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు.ఆయన పరిశోధన: అపోహలను తొలగిస్తుంది, పాపన్నను కులపరిమితి నుంచి బయటకు తీసి తెలంగాణ ప్రజానాయకుడిగా ప్రతిష్ఠిస్తుంది. బహుజన చరిత్రకు శాస్త్రీయ రూపం ఇస్తుంది. తదనంతరం అనేకమంది పరిశోధకులు పాపన్న చరిత్రను ఠెసె ప్రయత్నం చేస్తున్నారు

9. ముగింపు
సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ చరిత్రలో బహుజనీకరణ, సబ్‌ఆల్టర్న్ ప్రతిఘటన, సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలకు ప్రతీక. ఆయన కార్యకలాపాలు 17వ శతాబ్దంలోనే "ప్రజా పాలన – ప్రజల కొరకు" అనే ప్రమాణాన్ని నిలబెట్టాయి.నేడు తెలంగాణ రాజకీయాలు పాపన్న చూపిన దిశలోనే ముందుకు సాగుతున్నాయి. పాపన్నను ఒక కులానికే పరిమితం చేయడం చారిత్రక అవమానం; ఆయన తెలంగాణ ప్రజలందరివాడు —బహుజన రాజకీయ చైతన్యానికి ఆద్యుడు, సమానత్వ యుగానికి దిక్సూచి. "దక్షిణ భారతదేశంలో ఉన్నత వర్గాలేతర సమూహాల సమిష్టి ప్రతిఘటన యొక్క తొలి రూపాన్ని పాపన్న సూచిస్తాడు. అతని నాయకత్వం ఉపాంత వర్గాలను రాజకీయ నటులుగా మార్చింది."(ఈటన్, 2005)
ఈ వ్యాఖ్య పాపన్న పాత్రకు శాస్త్రీయ ధృవీకరణ. సోషియల్ బాండిట్ సిద్ధాంతంలో పాపన్న — సమగ్ర విశ్లేషణ, హాబ్స్‌బామ్ చెప్పిన సోషియల్ బాండిట్ భావనను పాపన్న సంపూర్ణంగా ప్రతిబింబించాడు. అందుకే పాపన్న సైన్యం, పరిపాలనలో బహుజన ప్రతినిధ్యాన్ని తీసుకువచ్చాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించాడు. దీంతో ఆయనను ఒక సాధారణ తిరుగుబాటుదారుడిగా కాకుండా: “బహుజనీకరణ యుగానికి మార్గదర్శి”,“తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రవక్త”,
“దళిత–బీసీ హక్కుల ప్రథమ పరిరక్షకుడు” గా చూడాలి. నేడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంన్గా 18-08-2026 & సర్దార్ పాపన్న కాంశ్య విగ్రహము ఆవిష్కరణ నేడు ట్యాంకుబండుపై చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సామజిక న్యాయసాధన దిశగా పోతున్న నేటి ప్రభుత్వం నాకు ధన్యవాదాలు .
Let us honour the great warrior, people’s leader and historical icon of Telangana.

**Jai Sardar Sarvai Papanna Maharaj!**
**Jai Telangana!** Jai Hind
**Jai Bahujan!**
**Jai BC UNITY!**

**On behalf of:**
**GOUD – Goud Organization for Unity and Development (GOUD)**
**GSF – Goud Social Forum (GSF)**
**GREAT**
**BC UNITY**

**Dr. Chalamalla Venkateshwarlu**
President, **BC UNITY**
President, **GSF & GOUD**
General Secretary, GREAT

🌿 **HISTORICAL MILESTONE – SHRI SARDAR SARVAI PAPANNA MAHARAJ STATUE INAUGURATION** 🌿Tomorrow, **18 August 2026**, marks...
17/08/2026

🌿 **HISTORICAL MILESTONE – SHRI SARDAR SARVAI PAPANNA MAHARAJ STATUE INAUGURATION** 🌿
Tomorrow, **18 August 2026**, marks a historic milestone for Telangana and the Bahujan communities.
On the eve of the **376th Birth Anniversary of the legendary Sardar Sarvai Papanna Maharaj**, his statue is being inaugurated at **Tank Bund, opposite the Telangana Secretariat, Hyderabad**.
**Sardar Sarvai Papanna Maharaj** remains an enduring symbol of **courage, self-respect, social justice, equality and Bahujan empowerment**. His life and legacy continue to inspire generations to strive for dignity, representation and equal opportunities for all communities.
On this historic and memorable occasion, **GOUD – Goud Organization for Unity and Development & GSF – Goud Social Forum** BC UNITY and GREAT cordially invite you all to participate in the **Statue Inauguration and Birth Anniversary Celebrations** and honour the legacy of this great son of Telangana.
Let us come together in large numbers and make this historic occasion a grand celebration of **Telangana Pride, Bahujan Unity and Social Justice**.
# # # 🌟 SARDAR SARVAI PAPANNA:
# # # **A PIONEER OF BAHUJANIZATION – THE FIRST SOCIAL REVOLUTIONARY (1650–1710)**
**Dr. Chalamalla Venkateshwarlu**
President, **BC UNITY**
President, **Goud Social Forum (GSF) & GOUD**
General Secretary GREAT
Sardar Sarvai Papanna Goud, the legendary warrior and people’s leader, remains a towering symbol of **courage, dignity and self-respect** in Telangana’s history. His struggle challenged established power structures and sought greater political and social space for marginalized sections.
On the occasion of his birth anniversary, we remember his remarkable legacy of striving for **equality, dignity and political opportunities for all communities, irrespective of caste or religion**.
The Government of Telangana’s continued recognition of Papanna Goud through official commemorations and the historic installation of his statue at Tank Bund represent an important step in preserving and honouring his legacy.
We wholeheartedly extend our congratulations and appreciation to **Hon’ble Chief Minister Shri Anumula Revanth Reddy ji, Hon’ble Deputy Chief Minister Shri Mallu Bhatti Vikramarka ji, Shri Bomma Mahesh Goud ji, President, TPCC, Shri Ponnam Prabhakar Goud ji, Minister of Transport and BC Welfare, Telangana**, and all respected Ministers, public representatives and well-wishers.
We also appreciate all **GOUD associations and organizations** that have consistently worked for the advancement of the Goud community and other marginalized communities.
# # # 🛡️ WHO WAS SARDAR SARVAI PAPANNA?
• A pioneering people’s leader of Telangana who challenged Mughal authority.
• A valiant warrior associated with the forts of **Warangal and Bhongir**. Golkonda
• A champion of social dignity and equality for marginalized communities.
• A people’s hero whose memory continues through Telangana’s rich folk tradition.
# # # 📚 THE THEORY OF SOCIAL BANDITRY
The concept of **Social Banditry**, associated with historian **Eric Hobsbawm**, describes popular figures who resist oppressive power, stand with marginalized people and become enduring heroes in folklore.
Papanna’s historical legacy can be understood through three important dimensions:
**1. Political Challenge** – Resistance to established imperial authority.
**2. Social Equality** – Advocacy for dignity and greater opportunities for marginalized communities.
**3. Cultural Memory** – An enduring place in the folklore and collective memory of Telangana.
# # # 🌿 PAPANNA’S ENDURING LEGACY
**Sardar Sarvai Papanna Maharaj was:**
• A pioneering voice of the people.
• A symbol of courage and self-respect.
• An inspiration for Bahujan unity and social justice.
• A source of everlasting pride for Telangana.
On the occasion of the release of the Telugu book on **Sardar Sarvai Papanna**, I warmly congratulate those who works hard of literature particularly**Late Shri Kompelli Venkat Goud** for this scholarly and timely contribution towards preserving and disseminating Papanna’s legacy.
Let us honour the great warrior, people’s leader and historical icon of Telangana.
**Jai Sardar Sarvai Papanna Maharaj!**
**Jai Telangana!** Jai Hind
**Jai Bahujan!**
**Jai BC UNITY!**
**On behalf of:**
**GOUD – Goud Organization for Unity and Development (GOUD)**
**GSF – Goud Social Forum (GSF)**
**GREAT**
**BC UNITY**
**Dr. Chalamalla Venkateshwarlu**
President, **BC UNITY**
President, **GSF & GOUD**
General Secretary, GREAT
See less

24/08/2025
రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ గా నియమితులైన  వి.సత్యనారాయణ గౌడ్ ఐపీఎస్,  హైదరాబాద్ ఎల్బీనగర్ డీసీపీగా నియమితులైన బత్తిన...
26/01/2023

రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ గా నియమితులైన వి.సత్యనారాయణ గౌడ్ ఐపీఎస్, హైదరాబాద్ ఎల్బీనగర్ డీసీపీగా నియమితులైన బత్తిన సాయిశ్రీ గౌడ్
మహబూబ్​నగర్​ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన శ్రీ. కొత్తపల్లి నర్సింహ గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు 🌹🌹
తెలంగాణలో ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలో భాగంగా

తెలంగాణలో ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్ డీసీపీగా నియమితులైన సోదరి బత్తిన సాయిశ్రీ గౌడ్ గారిక...
26/01/2023

తెలంగాణలో ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్ డీసీపీగా నియమితులైన సోదరి బత్తిన సాయిశ్రీ గౌడ్ గారికి హార్దిక శుభాకాంక్షలు...

- మీ... ఈతముల్లు.!

30/11/2022
31/10/2022

Address

Hyderabad
500007

Website

Alerts

Be the first to know and let us send you an email when GOUD Gouds Organisation for Unity and Development posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GOUD Gouds Organisation for Unity and Development:

Shortcuts

Share