05/11/2025
♨🕯♨వైభవంగా కార్తీక పౌర్ణమి♨🕯♨
#చాకరిమెట్ల, చిన్నగొట్టిముక్ల (శివ్వంపేట): #మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన #శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామం చాకరిమెట్లలో వెలిసిన సహకార ఆంజనేయస్వామి ఆలయం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తజనంతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి, తులసి చెట్ల వద్ద మహిళలు పెద్దఎత్తున దీపారాధన చేపట్టారు.
స్వామికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. భక్తుల రద్దీతో వరుసలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. విశాలమైన సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో వ్రతపూజలు చేపట్టారు.
వ్యవస్థాపక ఛైర్మన్ ఆంజనేయశర్మ గారు ,ప్రధానపూజారి దేవదత్త శర్మ, పవన్‌కుమార్ శర్మ, దేవీప్రసాద్ శర్మ, ప్రభురాజ శర్మ ఆధ్వర్యంలో పూజలు కొనసాగాయి. ఈవో గారు సౌకర్యాలను పర్యవేక్షించారు.