Suharth Foundation

Suharth Foundation The purpose of our foundation is to make people experience life as beautiful as it is by not worrying

మనం ఏఐ, రోబోట్స్ అంటూ ప్రస్తుత డిజిటల్ యుగంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాం కానీ, మన ఆలోచనలు మాత్రం ఇంకా పాతకాలపు పచ్చళ్...
21/04/2026

మనం ఏఐ, రోబోట్స్ అంటూ ప్రస్తుత డిజిటల్ యుగంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాం కానీ, మన ఆలోచనలు మాత్రం ఇంకా పాతకాలపు పచ్చళ్ల దగ్గరే ఆగిపోయాయి అనడానికి పీరియడ్ పై ఉన్న అపోహలే ఒక పెద్ద ఉదాహరణ.

ఇప్పటికీ మన సమాజంలో పీరియడ్స్ అంటే ఏదో అపవిత్రమైన విషయంలా, బయటకి చెప్పుకోకూడనంత సిగ్గుపడాల్సిన టాపిక్‌లా చూస్తున్నారు. వంటింట్లోకి వెళ్తే దోషం, మొక్కలు తాకితే వాడిపోతాయి, పూజ గదిలోకి అడుగుపెడితే అపచారం.. ఇలా అమ్మాయిలపై మనం వేస్తున్న నిబంధనల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఒక సహజమైన శారీరక ప్రక్రియను పట్టుకుని, ఇన్ని మూఢనమ్మకాలు, అపోహలు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అన్న ప్రశ్నలోంచి పుట్టుకొచ్చిందే Suharth Foundation!

వీళ్ళు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్‌లోని అమ్మాయిలకు పీరియడ్స్ గురించి అవగాహన కల్పిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు. మనలో చాలా మందికి ఆర్గానిక్ ప్యాడ్స్ గురించి కనీసం ఐడియా కూడా ఉండదు, కానీ వీళ్లు వాటిని వేల సంఖ్యలో ఎకో-ఫ్రెండ్లీ ప్యాడ్స్ తయారు చేసి వాటిని ఉచితంగా పంపిణీ చేస్తూ హెల్త్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వొద్దని చెబుతున్నారు. కేవలం పీరియడ్స్ మాత్రమే కాదు, అమ్మాయిల రక్షణ కోసం పోక్సో చట్టం వంటి ఇంపార్టెంట్ విషయాలను కూడా వాళ్లకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో టీచ్ చేస్తూ వాళ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను నింపుతున్నారు.

నిజానికి, పీరియడ్స్ అనేది ఒక సహజసిద్ధమైన ప్రక్రియ. ఒక మనిషి పుట్టడానికి కారణమైన ఈ ప్రక్రియను 'అపవిత్రం' అనే పేరుతో తక్కువ చేయడం మన పొరపాటే. కాబట్టి, ఇప్పటికైనా పాతకాలపు మూఢనమ్మకాలను వదిలేద్దాం. మన ఇంట్లో ఉండే అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో భయాన్ని కాకుండా, భరోసాను కలిగిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం మారితేనే మన సమాజం మారుతుంది. ఆ మార్పు ఈరోజే, ఇప్పుడే మన ఇంటి నుంచే మొదలవ్వాలి!

మరిన్ని వివరాల కోసం Suharth Foundation ఫౌండర్ Hiteshi Dutta గారి ఈ మా ఇంటర్వ్యూ చూడండి!

Video Link: https://youtu.be/Q7FkYW1FNIM

Address

3rd Floor, Signature Towers, Kondapur
Hyderabad
500084

Opening Hours

Monday 12pm - 8pm
Tuesday 12pm - 8pm
Wednesday 12pm - 8pm
Thursday 12pm - 8pm
Friday 12pm - 8pm
Saturday 12pm - 8pm
Sunday 12pm - 8pm

Telephone

+919010387852

Alerts

Be the first to know and let us send you an email when Suharth Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Suharth Foundation:

Shortcuts

Share