25/08/2025
నేను ఊహించని మలుపు ఒక పుష్కరంలోకి అడుపెట్టింది ...
నేను పడిన కష్ట ఫలితం పుష్కరంలోకి ప్రవేశించింది ...
నా బ్రతుకును మలుపు తిప్పినది ఈ పుష్కర కాలం ...
నాకంటూ ఒక ప్రపంచమైనది ఈ పుష్కరం ...
నన్నో వేదిక పైన సగర్వముగా నిలబెట్టినది ఈ పుష్కరం ...
అవునూ అవునూ ఆనందంతో సంతోషంతో సంబరంగా ప్రకటిస్తున్న గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక పురుడోసుకోని నా మానస పుత్రికగా ఆవిర్భవించి గౌడ్స్ గొంతుకగా మారి గౌడ్స్ చైతన్యమై పుష్కరంలోకి అడుగుపెట్టింది . ఈ దశాబ్ద కాలంలో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్ని చూసిన. కడుపు మాడి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి అయినా గౌడకంఠమ్ పత్రికను గౌడ్స్ గడప గడపకు చేర్చేందుకు బలమైన ఆర్ధిక బలం లేకపోయినా బతుకు కష్టంలో బరిగీసి నిల్చున్న . తెలంగాణ పట్టణ, పల్లెలే కాదు ఆంధ్రా, మహారాష్ట్రా, కర్ణాటక గౌడ్ గడపలు చొచ్చుకొని వెళ్లి గౌడ్స్ గౌరవం దక్కించుకొని 38 వేల ప్రచురణ మార్క్ దాటింది గౌడకంఠమ్. మిత్రుడు డేవిడ్ నైతిక మద్ధతుతో పటాన్ చెరు ప్రజల నిజమైన నాయకుడు కాట శ్రీనన్న , గడీల శ్రీకాంత్ అన్న ఆర్థిక సహకారంతో ప్రముఖ రచయిత , మా ఆత్మీయ పెద్దన్న డా. కట్టగాని రవీందర్ గౌడ్ రచనల సహకారంతో ఆరంభమై ఇంతింత అయి వటుడింత అయి అన్నట్లు పల్లె లక్ష్మణ్ అన్న పరిచయంతో పరిధి పెంచుకొని మోతె చక్రవర్తి అన్న ఆపన్న హస్తంతో అవధులు దాటి ఆర్టీఓ లు రవీందరన్న , రఘునందన్ అన్న , ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రన్న , ఈ ఎస్ విజయ్ భాస్కర్ అన్న , సి ఐ లు చంద్రశేఖర్ అన్న, లక్ష్మణ్ బాబాయ్ సహకారంతో గౌడ్ గుండెల్లోకి వెళ్లి అభిమానం చూరగొంది గౌడకంఠమ్ మాస పత్రిక. మంచి మనసున్న మహోన్నతుడు జె ఎస్ ఆర్ గ్రూప్ సన్ సిటీ అధినేత జడపల్లి నారాయణ గౌడ్ పరిచయంతో గౌడకంఠమ్ మలుపు గొప్పగా తిరిగింది. గొప్ప మానవతావాది కీ. శే కూన వెంకటేష్ అన్న ప్రేమకు దాసుడిని. డా . ఎం ఎస్ గౌడ్ సహకారం మరువలేనిది. ప్రశాంత్ గౌడ్ అన్న అండతో మరింత బలమేర్పడింది. ఆదర్శ ఆటో చైర్మన్ సత్యనారాయణ గౌడ్ , మేనేజింగ్ డైరెక్టర్స్ వినయ్ గౌడ్, విజయ్ గౌడ్ అన్నలు గౌడకంఠమ్ కి మేమున్నామంటూ ఇచ్చిన అండ మరింత బలమైంది. భీష్మన్న, ధనుంజయ్ అన్న, కాశీ అన్న , ప్రేమదాస్ అన్న , హరిచరణ్ అన్న , దొంతి లక్ష్మీనారాయణ అన్న , ప్రశాంత్ గౌడ్, జూలూరి ధనలక్ష్మి బాలనారాయణ గౌడ్ దంపతులు, సుప్రజ విజయ్ కళ్లెం వీరస్వామి గౌడ్, కాటం భాస్కర్ గౌడ్, మిర్జాగూడ రవీందర్ అన్న , బుర్ర రాజేశన్న, ఇలా ఆత్మీయులందరి సహకారంతో పత్రిక అద్భుత సర్క్యులేషన్ పెంచుకుంది. ఇక రాజకీయ పరంగా చెప్పాలంటే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నని గౌడకంఠమ్ గర్వముగా గుత్తుపెట్టుకుంటది. ఎన్నో వేదికలపైన తన కంఠాన్ని గౌడకంఠమ్ వినిపించారు. మాజీ మంత్రి శ్రీనన్నకీ గౌడకంఠమ్ అంటే చాలా అభిమానం అందుకే తనవంతు బలమైన సహకారం అందించారు. ప్రస్తుత మంత్రి పొన్నం అన్న మాజీ ఎంపీగా వున్నపుడు సైతమ్ సిద్దూ మై హునా అంటూ ధైర్యం ఇచ్చినారు. మాజీ మంత్రి పజ్జన్న నీ కష్టానికి నేనున్నా మర్చిపోకు అని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ మాదన్న లు గౌడకంఠమ్ వార్షికోత్సవ వేదికలపై ప్రకటించి వెన్నుదన్నుగా నిలిచారు. ఇలా నాటి నుంచి నేటి వరకు పత్రిక కు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించిన ఆత్మీయలందరిని గౌడకంఠమ్ తన గుండెలో పెట్టుకుంటది. మీ సహకారం మరిన్ని దశాబ్దాలు ఉంది లక్ష సంచికల ప్రచురణలకు అవకాశం ఇచ్చే బాహుబలి బలాన్ని ఇవ్వాలని కోరుతూ ...
మీ ప్రేమ కోరే చిరు జీవి ...
డా .నోముల సిద్దూ గౌడ్
గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ఎడిటర్ అండ్ సీఈఓ