07/05/2022
బహిరంగ హత్యకు గురైన దళిత యువకుడు నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్ నుండి కొత్తపేట వరకు 1500 మంది విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది...
రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస బహిరంగ పరువు హత్యలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని నిరసిస్తూ....
ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎల్బీనగర్ విభాగంలోని విజయవాడ జాతీయ రహదారిపై 1500 మంది విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి నాయకులని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గారు, జాతీయ కార్యసమితి సభ్యులు పగిడిపల్లి శ్రీహరి గారు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఝాన్సీ, మహానగర కార్యదర్శి శ్రీకాంత్, ఎల్బీనగర్ విభాగ్ కన్వీనర్ అక్యారి మహేష్, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ సుమన్ శంకర్ ,సిటీ జాయింట్ సెక్రెటరీ కొండ సాయి, రేవంత్, సాయిరాం, సుమంత్ ,రంజిత్, అనిత, వివేక్ ,శంకర్ ,రోహిత్, బసవేశ్వర తదితరులు పాల్గొన్నారు.