11/11/2020
తెరాస పార్టీ ఇకనైనా ఆలోచించుకోవాలి. కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల తర్వాత పార్టీ ఏం గ్రహించింది? విపరీత ధోరణిలో అబద్ధపు ప్రచారం చేసిన వాళ్ళు గెలిచారు, అది వాళ్ళ సిద్దాంతం మనం తప్పు పట్టడానికి లేదు. దాన్ని ఖండించే నాయకత్వం లేకుంటే నిజాలు జనాలకి ఎలా తెలియాలి?
ప్రతి దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు వచ్చే కౌంటర్లు ఇవ్వాలా? 100 మంది ఎమ్మెల్యేలు ఏం చేయడానికి ఉన్నారు? ఒక్కనికన్నా కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచన ఉందా? ఎంత సేపు అధినాయకత్వం తో ఫోటోలు దిగి భజన చేయడమేనా?
మెదక్ ఎంపీ గా రెండు సార్లు కేసీఆర్ హవాలో నెగ్గిన ప్రబుద్దుడు తన సొంత గ్రామంలో కూడా తెరాసకి ఆధిక్యం తెప్పించలేకపోయాడు, హరీష్ రావు చాటుకు నిలబడడానికా నీకు ఆ పదవి?
అబద్ధపు పునాదులు కల్గిన బిజెపి తెలంగాణ లో చాపకింద నీరులా ప్రవేశించింది. దాన్ని ఇంకా సహిస్తే అది తెరాస కి నష్టమనేది తర్వాత విషయం, మొదలు తెలంగాణ కి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించే ఏకైక తెరాస పార్టీ, ఎలా దానికి మార్గం వేస్తుంది?
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే నాయకులు, సామాజిక మాధ్యమాల ద్వారా ఆ 90 పైన ఉన్న MLA ల కన్నా మిన్నగా ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇస్తున్న కార్యకర్తల్ని ఎందుకు గుర్తించరు? తన నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఎవరో తెలుసుకోలేని పనికిమాలిన MLA లు చాలా మంది ఉన్నారు.
కేసీఆర్ మొహం చూసి, తెరాస పథకాలు చూసి గెలిసినవారే తప్ప సొంత ఛరిష్మాతో నెగ్గిన వాళ్ళని వేళ్ళపై లెక్క పెట్టొచ్చు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కూడా కేటీఆర్ లేక కేసీఆర్ చేయాలి తప్ప వాళ్ళకి చేతకాదు. వారికి ఏం పని కూడా లేదు. ఒక్కో ఎమ్మేల్యేను , కార్యకర్తల మీద దృష్టి పెట్టుమనండి, వాళ్ళకి ఇబ్బందుల్లో తోడుండమని చెప్పండి. ఎలా గెలవాలో కార్యకర్తలు చూసుకుంటారు.
జై కేసీఆర్
Patimeedi Jagan Mohan Rao TRS
KTRTRS
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha
Harish Rao Thanneeru
Hussama Hussain