Recard Service Society

Recard Service Society We are working for environment, education,cultural, implementation of organic methods in agriculture

3 Day Capacity of building Training Program Conducted on "WOMEN AND MOTHER EARTH" Module Vth- for Rural youth with suppo...
18/09/2025

3 Day Capacity of building Training Program Conducted on "WOMEN AND MOTHER EARTH" Module Vth- for Rural youth with support of Indian Social Institute Bangalore with collaboration of LODI MSSS, RECARD SS & FMM SSS & SHIRI Organization at Lodi MSSS premises, fathimanagar, Dist. Hanumakonda. Telangana from 18.08.2025 to 20.08.2025.

Mr. Karuna Rao AP- Telangana zonal manager facilitated the program, Resource person high court Advocate, Fr. S. Inna Reddy Director LODI MSSS, Mr. Kusuma Suresh President RECARD SS, & Mr. P. Sudhakar President SHIRI organization Participated & Addressed, Mr. Kusuma Suresh President RECARD SS, Mr. Veerababu coordinator LMSSS facilitated the team members.

BY
KUSUMA SURESH
President
RECARD SS

16/08/2025
31/05/2025

రికార్డ్ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ది. 31.05.2025 సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు కనకదుర్గ కాలనీ, ప్రకృతి వనం హన్మకొండలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల ఆవశ్యకత వాటి ఉపయోగాలు వివిధ రకాల వ్యాధులను ఎలా నివారించుకోవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. కుసుమ కవిత ఆహార నిపుణులు వివరిస్తూ కాలనీలో మిల్లెట్స్ తో రకరకాల వంటలు ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతి ఇంటి వంటింటిలో చిరుధాన్యాలు ఉన్నప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, అప్పుడు ఎక్కువగా హాస్పటల్ కి వెళ్లవలసిన అవసరం తగ్గుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులు మరియు కనకదుర్గ కాలనీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు మరియు రికార్డ్ సేవా సంస్థ చీఫ్ అడ్వైజర్ నిమ్మల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

ఇట్లు
కుసుమ సురేష్
"రికార్డ్ సేవ సంస్థ" అధ్యక్షులు
వ్యవస్థాపకులు "రికార్డ్ మిల్లెట్ హబ్".

21/04/2025

పక్షుల గూళ్లు మరియు వరి కంకులు మహర్షి గోశాల ఆధ్వర్యంలో ది. 18.04.2025 న ద్వారకా నగర్ చింతగట్టు గ్రామ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. పక్షులను సంరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు అందులో భాగస్వామ్యమైనందుకు మేము సంతోషిస్తున్నాము.

04/04/2025

*అత్యంత పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాలను, చిరుధాన్యాల ఉత్పత్తులను అందరికీ అందుబాటులో తేవాలానే ముఖ్య లక్ష్యం తో ఈరోజు ది. 04.04.2025 మా "రికార్డ్ మిల్లెట్ హబ్" నూతన శాఖ రూపంలో ఎక్సయిస్ కాలని చౌరస్తా, హనుమకొండ లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా శ్రీ సర్జన రమేష్ గురూజీ, అధ్యక్షులు "మహర్షి గోశాల" గారు హాజరై ప్రారంభోత్సవం చేసారు, వారికీ మా హృదయ పూర్వక కృతజ్ఞతలు, మరియు హాజరైన ఎక్సయిస్ కాలని ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కు, మా ముందుండి కార్యక్రమాన్ని నడిపించిన నిమ్మల శ్రీనివాస్ ముఖ్య సలహా దారులు గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ మా కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా ధన్యవాదములు. "చిరుధాన్యాలు ఆరోగ్యానికి వరధాన్యాలు" 48 రకాల చిరుధాన్యాల అల్పాహార ఉత్పత్తులు మా "రికార్డ్ మిల్లెట్ హబ్" లో అందుబాటులో వున్నాయి. ఇక నుండి ఈ ఎక్సయిస్ కాలని కి మార్చబడిన మా రికార్డ్ మిల్లెట్ హబ్ ను సందర్శించగలరు.

ఇట్లు
కుసుమ కవిత
ఆహార నిపుణులు
రికార్డ్ మిల్లెట్ హబ్
సెల్ :9100373129

03/03/2025

నిన్నటి రోజు ది. 24.02.2025 ఉదయం "సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ " బస్ డిపో రోడ్, హన్మకొండ ఆధ్వర్యంలో "నేషనల్ సైన్స్ డే" నిర్వహించారు. ఈ కార్యక్రమం లో రికార్డ్ మిల్లెట్ హబ్ ద్వారా "చిరుధాన్యాలతో టీచర్స్ కు అల్పాహారం అందించారు, కొర్ర ఇడ్లీ, సామల వడలను టీచర్స్ కు రుచి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఆహారం యొక్క ప్రాముఖ్యత,వాటి వినియోగం పై కుసుమ కవిత, ఆహార నిపుణులు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపు మత్యాస్ రెడ్డి, సునీత రెడ్డి గార్లు , ఉపాధ్యాయిని, ఉపాధ్యయులు పాల్గొని, అత్యంత పోషక విలువలు కలిగినటువంటి మిల్లెట్స్ ఫుడ్ ను పరిచయం చేసినందుకు మమ్మల్ని అభినందించారు. ఈ కార్యక్రమం లో మా రికార్డ్ సేవ సంస్థ ముఖ్య సలహా దారులు, మిల్లెట్ ప్రమోటర్ శ్రీ. నిమ్మల శ్రీనివాస్ గారు. పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

ఇట్లు
కుసుమ సురేష్
వ్యవస్థాపకులు
రికార్డ్ మిల్లెట్ హబ్
రికార్డ్ సేవ సంస్థ అధ్యక్షులు

26/02/2025

ది. 23.02.2025 మహర్షి గోశాలను రికార్డ్ మిల్లెట్ హబ్ స్టాల్ తో సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఆదివారం క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ బాధితులకు ఆయుర్వేదం చికిత్స అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయగలరని.. ఆశిస్తూ... అక్కడ జరిగే కార్యక్రమాన్ని ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది.

ఇట్లు
కే సురేష్
రికార్డ్ మిల్లెట్ వ్యవస్థాపకులు
అధ్యక్షులు రికార్డ్ సేవా సంస్థ

29/01/2025

నల్ల బియ్యం (Black Rice) గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం...!
👉ఈ నల్ల బియ్యం లో "ఆంథో సైనిన్స్" యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేసి రోగ నిరోధక శక్తి ని పెంపోందిస్తుంది.
👉 ఇవి అనేక రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతాయి. 👉 👉ఈ బియ్యం "లివర్ డిటాక్సీఫికేషన్" లో తొడ్పడుతుంది. 👉👉మన శరీరంలో అనవసరపు కొవ్వును కరిగిస్తుంది, గుండె జబ్బు రాకుండా నియంత్రిస్తుంది. 👉 👉ఈ బియ్యం లో నియాసిన్, క్యాలిషియం, మెగ్నీషియం,ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాలుంటాయి, ఇవి మన శరీరం అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. కీళ్ళ నొప్పులను, కండరాల నొప్పులను నియంత్రిస్తుంది. 👉 👉ఈ బియ్యం లో ఫ్లేవనాయిడ్స్, ఫైటో కేమికల్స్ డయాబేటిక్ వారికీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటి ని మెరుగుపర్చి శరీరంలో గ్లూకోజ్ ను కంట్రోల్ చేస్తుంది తద్వారా డయాబేటీస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. 👉 👉ఈ బియ్యం డయాబేటీస్ మరియు బిపి ని కంట్రోల్ చేస్తుందని పలు అధ్యాయనాల్లో తేలింది. 👉 👉👉ఈ బియ్యం లో ఎక్కువ ప్రోటీన్లు మరియు ఫైబర్లు వున్నాయి. ఇవి మన శరీరానికి పోషకవిలువల్ని సమకుర్చుతాయి. 👉 👉ఈ నల్ల బియ్యం లో లుటిన్, జియాక్సంతిన్ లు వున్నాయి, ఇవి కంటి ఆరోగ్యానికి సంబంధించిన రెండు రకాల కెరోటైనాయిడ్స్, కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. 👉 👉👉ఈ నల్ల బియ్యం 5 గంటల ముందు నానబెట్టి వండుకోవాలి,మధ్యాహనం భోజనం గా ఒక్క పూట మాత్రమే తినాలి, అన్నం తినలేని వారు బియ్యం తో రవ్వ, పిండి పట్టించి ఉక్మ, ఇడ్లి,దోస,పాయసంగా చేసుకొని తినవచ్చు. 👉 👉👉ఈ బియ్యం అన్ని వయసుల వారు తినవచ్చును.

👉మేము ఈ బియ్యం ను సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులచే పండించాము.ది. 28.01.2025 నిన్నటి రోజు బ్లాక్ రైస్ ప్రాసెసింగ్ చేసాము ఆ విధానం డాక్యుమెంట్ చేయడం జరిగింది.

ఇట్లు
కుసుమ కవిత
ఆహార నిపుణులు
రికార్డ్ మిల్లెట్ హబ్
సెల్: 9100373129

03/01/2025

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్ వారు "చిరుధాన్యాలతో వంటలు శిక్షణ" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి మా రికార్డ్ సేవా సంస్థ మరియు రికార్డ్ మిల్లెట్ హబ్ ఆధ్వర్యంలో నా సతీమణి కుసుమ కవిత గారికి అవకాశం లభించింది. ది.19.12.2024 న నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో చిరుధాన్యాల తో కూడిన ఎనిమిది రకాల వంటకాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఐదు రాష్ట్రాల నుంచి 25 మంది హాజరయ్యారు.. అందులో వరంగల్ నుండి కుసుమ కవిత హాజరై శిక్షణ తీసుకోవడం అభినందనీయం, IIMR సీఈఓ మరియు టెక్నికల్ ఆఫీసర్ గారు సర్టిఫికెట్ ప్రధానం చేయడం జరిగింది, కవిత గారు ఒక మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ గా రాణించడానికి ఒక మైలురాయిగా గుర్తిస్తున్నాము.

ఇట్లు
కుసుమ సురేష్
రికార్డ్ సేవా సంస్థ అధ్యక్షులు
వ్యవస్థాపకులు రికార్డ్ మిల్లెట్ హబ్

Address

Kumarpally
Hanamkonda

Telephone

+919440663839

Website

Alerts

Be the first to know and let us send you an email when Recard Service Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Recard Service Society:

Share