Saijyothishavani సాయి జ్యోతిష వాణి

  • Home
  • India
  • Guntur
  • Saijyothishavani సాయి జ్యోతిష వాణి

Saijyothishavani సాయి జ్యోతిష వాణి TO PROPAGATE JYOTHISHAM

21/03/2026
15/10/2025

If you have Gurubalam or want to increase your Gurubalam, try this small remedy.

On Thursday, distribute yellow bananas to the poor

Try to wear yellow clothes on Thursday

Also, try to wear as much gold as you can every day

Also, donate yellow clothes to those who do not have them.

12/10/2025
25/04/2025

🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀

🙏రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?*_

శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

*శని త్రయోదశి అంటే*

శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.

*అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి , ఎలా చేయాలి ?*

శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

*త్రయోదశి వ్రతం :-*

శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.

*శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు*

🌹 ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.

🌹 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
*నీలాంజన సమభాసం*
*రవిపుత్రం యమాగ్రజం*
*ఛాయా మార్తాండ సంభూతం*
*తం నమామి శనైశ్చరం.*

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.

🌹 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.

🌹 అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.

🌹 ఎవరితోను వాదనలకు దిగరాదు.

🌹 ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.

🌹 ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.

🌹 కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.

🌹 అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.

🌹 జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.

🌹 ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.

🌹 అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.

🌹 ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.

ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.

దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు.

*దశరథకృత శ్రీ శని స్తోత్రం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ
నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ
నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునఃనమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే
నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః

నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ
నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే

నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే
సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ

అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే
నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే

తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ
నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః

జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే
తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్

దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః
త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః

ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ
నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో

నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః

ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ

*ఇతి శనిస్తోత్రమ్*

✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

25/04/2025

🎻🌹🙏 మంచి కిటుకులు..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹🙏ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పనులయందు ఆటంకం కలగకుండా ఉండాలంటే....🌹🙏

🌷ఆదివారం🌷.

ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు...
తమలపాకు నమలడం లేదా
ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే..
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

🌷సోమవారం🌷.

సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి.
వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని
ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.

🌷మంగళవారం🌷.

హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం
ఉదయం స్నానం చేసి,
హనుమాన్ చాలీసా పఠించాలి.
అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి.
బెల్లం తింటే మరీ మంచిది.

🌷బుధవారం🌷.

బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి.
ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ..
చాలా ప్రయోజనం ఉంటుంది.

🌷గురువారం🌷.

గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది.
వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.

🌷శుక్రవారం🌷.

ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే
పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది.
అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి.

🌷శనివారం🌷.

అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు.
ప్రతి శనివారం కొద్దిగా అలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి....సేకరణ..స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

18/03/2025

*⭐మీ నక్షత్రానికి అదృష్ట వారాలు సంఖ్యలు⭐*

⭐ఒక్కోసారి ఎంత కష్టపడి పని చేసినా ఫలితం దక్కదు. అలాంటప్పుడు ఉసూరుమని ''అదృష్టం లేదు'' అని బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తాం. ''కృషితో నాస్తి దుర్భిక్షం'' అన్నారు. నిజమే. అనుకున్న దానికోసం పట్టుదలతో పనిచేస్తే దాన్ని సాధించగల్గుతాం. కానీ, కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఆశించినది చేతికి అందకుంటే నిరాశ కలుగుతుంది. ''గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ'' అనకూడదు. కానీ నిజాయితీగా శ్రమించినా ఫలితం లేకుంటే అది అదృష్ట లోపం. మరి ఈ అదృష్టాన్ని ఎలా కనిపెట్టాలి.. అదృష్టంతో విజయాన్ని ఎలా చేజిక్కుంచుకోవాలి.. అందుకు దానికి చాలా తేలికైన మార్గం ఉంది. మీ నక్షత్రం ఏమిటో తెలిస్తే ఇక మీకు కలిసొచ్చే వారాలు, నంబర్లు ఇట్టే తెలుసుకోవచ్చు.

*నక్షత్రం - అదృష్టవారాలు - అదృష్టసంఖ్య*
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️

*అశ్వని* - ఆది, మంగళ,గురు, శని -7, 8

*భరణి* - గురు, ఆది - 6, 9

*కృత్తిక* - బుధ, శుక్ర, శని - 1, 9, 6

*రోహిణి* - గురువారం తప్ప తక్కిన అన్నీ - 2, 6

*మృగశిర* - ఆది, సోమ, బుధ, శుక్ర - 9, 6, 5

*ఆరుద్ర* - సోమ, శుక్ర - 4, 5

*పునర్వసు* - ఆది, గురు, శని - 2, 3, 5

*పుష్యమి* - శుక్రవారం తప్ప అన్నీ - 2, 8

*ఆశ్లేష* - సోమ, మంగళ, గురు, శని - 2, 5

*మఖ* - శని, మంగళ - 1, 7

*పుబ్బ* - ఆది, సోమ, శుక్ర - 1, 6

*ఉత్తర* - శనివారం తప్ప అన్నీ - 1, 5

*హస్త* - ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర - 2, 5

*చిత్త* - ఆది, బుధ - 5, 6, 9

*స్వాతి* - సోమ, మంగళ, శని - 4, 6

*విశాఖ* - ఆదివారం తప్ప అన్నీ - 3, 6, 9

*అనూరాధ* - సోమ, బుధ, గురు, శని - 8, 9

*జ్యేష్ఠ* - సోమ, గురు - 5, 9

*మూల* - ఆది, మంగళ, బుధ - 3, 7

*పూర్వాషాఢ* - సోమవారం తప్ప అన్నీ - 3, 6

*ఉత్తరాషాఢ* - ఆది, మంగళ, గురు, శుక్ర - 1, 3, 8

*శ్రవణం* - సోమ, బుధ, గురు - 2, 8

*ధనిష్ఠ* - మంగళవారం తప్ప అన్నీ - 8, 9

*శతభిషం* - సోమ, బుధ, శుక్ర, శని - 4, 8

*పూర్వాభాద్ర* - బుధ, శని - 3, 8

*ఉత్తరాభాద్ర* - మంగళ, గురు, శుక్ర - 3, 8

*రేవతి* - బుధవారం తప్ప అన్నీ - 3, 5
💠💠💠💠💠💠💠💠💠

23/02/2025

*అమరావతి* - *అమరేశ్వర స్వామి దేవాలయo చుట్టుప్రక్కల అమరావతి 108 గ్రామాలలో-108 శివాలయములు*(*27నక్షత్రములుకు 108పాదములు*) *27 నక్షత్రములు వారు దర్శించవలసిన శివాలయములు 108 నక్షత్ర పాదములు వారీగా సూచించబడినది. వారి వారి నక్షత్రమునందుసరించి వారి వారి పాదమున అనుసరించి దర్శించవలసిన శివాలయములు తప్పక దర్శించండి శివానుగ్రహం పొందండి*

1) *అమరావతి మండలం*

1) అత్తలూరు - సోమేశ్వర స్వామి
(అశ్విని - 1 పాదం)
2) చావపాడు - కాశీవిశ్వేశ్వర స్వామి
(అశ్విని - 2 పాదం)
3) ధరణికోట – శంభులింగేశ్వరస్వామి
(అశ్విని - 3 పాదం)
4) దిడుగు - సోమేశ్వర స్వామి
(అశ్విని - 4 పాదం)
5) యండ్రాయి - ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి
(భరణి - 1 పాదం)
6) జూపూడి - కాశీవిశ్వేశ్వర స్వామి
(భరణి - 2 పాదం)
7) కర్లపూడి - రాజరాజేశ్వర స్వామి
(భరణి - 3 పాదం)
8) లెమెల్లె - మల్లేశ్వర స్వామి
(భరణి - 4 పాదం)
9) మల్లాది - మల్లేశ్వర స్వామి
(కృతిక - 1 పాదం)
10) ముక్కామల - మల్లేశ్వర స్వామి
(కృతిక - 2 పాదం)
11) మునుగోడ - మల్లేశ్వర స్వామి
(కృతిక - 3 పాదం)
12)నెమలికల్లు - మల్లేశ్వర స్వామి
(కృతిక - 4పాదం)
13) పెదమద్దూరు-రామలింగేశ్వర స్వామి
(రోహిణి - 1 పాదం)
14) పొందుగల - సంగమేశ్వర స్వామి
(రోహిణి - 2 పాదం)
15) ఉంగుటూరు - మల్లేశ్వర స్వామి
(రోహిణి - 3 పాదం)
16)వైకుంఠపురం - మల్లేశ్వర స్వామి
(రోహిణి - 4 పాదం)

2) *తుళ్లూరు మండలం*

1) అబ్బరాజు పాలెం - భవానీశంకర స్వామి
(మృగశిర - 1 పాదం)
2) అనంతవరం - మల్లేశ్వర స్వామి
(మృగశిర - 2 పాదం)
3) దొండపాడు – రాజమల్లేశ్వర స్వామి
(మృగశిర - 3 పాదం)
4) మందడం - రామలింగేశ్వర స్వామి
(మృగశిర - 4 పాదం)
5) నెక్కల్లు - మల్లేశ్వర స్వామి
(ఆరుద్ర - 1 పాదం)
6) పెదపరిమి - మల్లేశ్వర స్వామి
(ఆరుద్ర - 2 పాదం)
7) రాయపూడి - సోమేశ్వర స్వామి
(ఆరుద్ర - 3 పాదం)
8) తుళ్లూరు - రామలింగేశ్వర స్వామి
(ఆరుద్ర - 4 పాదం)
9) వెలగపూడి - మల్లేశ్వర స్వామి
(పునర్వసు - 1 పాదం)
10) వెంకటపాలెం - భవానీశంకర స్వామి
(పునర్వసు - 2 పాదం)

3) *మంగళగిరి మండలం*
1) ఆత్మకూరు - విశ్వేశ్వర స్వామి
(పునర్వసు - 3 పాదం)
2) బేతపూడి - సోమేశ్వర స్వామి
(పునర్వసు - 4 పాదం)
3) చినకాకాని - కాశీవిశ్వేశ్వర స్వామి
(పుష్యమి - 1 పాదం)
4) కాజా - అగస్త్యేశ్వర స్వామి
(పుష్యమి - 2 పాదం)
5) కురగల్లు - మల్లేశ్వర స్వామి
(పుష్యమి - 3 పాదం)
6) మంగళగిరి - మల్లేశ్వర స్వామి
(పుష్యమి - 4 పాదం)
7) నవులూరు - నాగేశ్వర స్వామి
(ఆశ్లేష - 1 పాదం)
8) నిడమర్రు - మల్లేశ్వర స్వామి
(ఆశ్లేష - 2 పాదం)
9) నూతక్కి - శక్తీశ్వర స్వామి
(ఆశ్లేష - 3 పాదం)
10) పెదవడ్లపూడి - మల్లేశ్వర స్వామి
(ఆశ్లేష - 4 పాదం)

4) *తాడేపల్లి మండలం*

1) చిర్రావూరు - నాగేశ్వర స్వామి
(మఖ - 1 పాదం)
2) గుండిమెడ - కాశీవిశ్వేశ్వర స్వామి
(మఖ - 2 పాదం)
3) కొలనుకొండ – కాశీవిశ్వేశ్వర స్వామి
(మఖ - 3 పాదం)
4) కుంచనపల్లి - కాశీవిశ్వేశ్వర స్వామి
(మఖ - 4 పాదం)
5) పెనుమాక - మల్లేశ్వర స్వామి
(పుబ్బ - 1 పాదం)
6) సీతానగరం - సోమేశ్వర స్వామి
(పుబ్బ - 2 పాదం)
7) తాడేపల్లి - త్రిపుర తాండవేశ్వర స్వామి
(పుబ్బ - 3 పాదం)
8) ఉండవల్లి - భాస్కరేశ్వర స్వామి
(పుబ్బ - 4 పాదం)
9) వడ్డేశ్వరం - రుద్రేశ్వర స్వామి
(ఉత్తర - 1 పాదం)
5) *పెదకాకాని మండలం*

1) అనుమర్లపూడి - మల్లేశ్వర స్వామి
(ఉత్తర - 2 పాదం)
2) నంబూరు - మల్లేశ్వర స్వామి
(ఉత్తర - 3 పాదం)
3) తక్కెళ్లపాడు - చంద్రశేఖర స్వామి
(ఉత్తర - 4 పాదం)
4) వెనిగండ్ల - ఉమామహే శ్వర స్వామి
(హస్తా - 1 పాదం)

6) *పెదకూరపాడు*

1) చిన్నమక్కెన - కాశీవిశ్వేశ్వర స్వామి
(హస్తా - 2 పాదం)
2) లగడపాడు - మల్లిఖార్జున స్వామి
(హస్తా - 3 పాదం)
3) ముస్సాపురం – రాజరాజేశ్వర స్వామి
(హస్తా - 4 పాదం)
4) పాటిబండ్ల - మల్లేశ్వర స్వామి
(చిత్త - 1 పాదం)
5) పెదకూరపాడు - రామలింగేశ్వర స్వామి
(చిత్త - 2 పాదం)

7) *మేడికొండూరు మండలం*

1) మేడికొండూరు - భీమలింగేశ్వర స్వామి
(చిత్త - 3 పాదం)
2) పాలడుగు - భీమేశ్వర స్వామి
(చిత్త - 4 పాదం)
3) మండపాడు -చెన్నకేశవ మల్లేశ్వర స్వామి
(స్వాతి - 1 పాదం)
4) సరిపూడి - దక్షిణామూర్తి స్వామి
(స్వాతి - 2 పాదం)
5) విశదల - మల్లేశ్వర స్వామి
(స్వాతి - 3 పాదం)
6) సిరిపురం - రామలింగేశ్వర స్వామి
(స్వాతి - 4 పాదం)
7) పొట్లపాడు - రామలింగేశ్వర స్వామి
(విశాఖ - 1 పాదం)
8) కొర్రపాడు - సోమేశ్వర స్వామి
(విశాఖ - 2 పాదం)

8) *తెనాలి మండలం*

1) అంగలకుదురు - మల్లేశ్వర స్వామి
(విశాఖ - 3 పాదం)
2) గుడివాడ - నీలకంఠేశ్వర స్వామి
(విశాఖ - 4 పాదం)
3) కొలకలూరు – అగస్త్యేశ్వర స్వామి
(అనురాధ - 1 పాదం)
4) నందివెలుగు - అగస్త్యేశ్వర స్వామి
(అనురాధ - 2 పాదం)
5) పెదరావూరు - మల్లేశ్వర స్వామి
(అనురాధ - 3 పాదం)
9) *సత్తెనపల్లి మండలం*

1) సత్తెనపల్లి - కాశీవిశ్వేశ్వర స్వామి
(అనురాధ - 4పాదం)
2) పాకలపాడు - శంభులింగేశ్వర స్వామి
(జ్యేష్ఠ - 1 పాదం)
3) నందిగామ - సోమేశ్వర స్వామి
(జ్యేష్ఠ - 2 పాదం)
4) కొమెరపూడి - ఆనందేశ్వర స్వామి
(జ్యేష్ఠ - 3 పాదం)
5) కట్టమూరు - కాశీవిశ్వేశ్వర స్వామి
(జ్యేష్ఠ - 4 పాదం)
6) కంటెపూడి - మల్లేశ్వర స్వామి
(మూల - 1 పాదం)
7) గుడిపూడి - సోమేశ్వర స్వామి
(మూల - 2 పాదం)
8) ధూళిపాళ్ల - ఉత్తరేశ్వర స్వామి
(మూల - 3 పాదం)
9) భృగుబండ - సోమేశ్వర స్వామి
(మూల - 4 పాదం)

10) *క్రోసూరు మండలం*

1) అందుకూరు - రామలింగేశ్వర స్వామి
(పూర్వాషాడ - 1 పాదం)
2) బాలేమర్రు - భవానీశంకర స్వామి
(పూర్వాషాడ - 2 పాదం)
3) బయ్యవరం – కాశీవిశ్వేశ్వర స్వామి
(పూర్వాషాడ - 3 పాదం)
4) దొడ్లేరు - భీమలింగేశ్వర స్వామి
(పూర్వాషాడ - 4 పాదం)
5) హాసన్నబాదు - కాశీవిశ్వేశ్వర స్వామి
(ఉత్తరాషాడ - 1 పాదం)
6) క్రోసూరు - మల్లేశ్వర స్వామి
(ఉత్తరాషాడ - 2 పాదం)
7) పారుపల్లి - రాజమల్లేశ్వర స్వామి
(ఉత్తరాషాడ - 3 పాదం)
8) పీసపాడు - నాగమల్లేశ్వర స్వామి
(ఉత్తరాషాడ - 4 పాదం)
9) విప్పర్ల - మల్లేశ్వర స్వామి
(శ్రవణం - 1 పాదం)
10 ఊటుకూరు - కాశీవిశ్వేశ్వర స్వామి
(శ్రవణం - 2పాదం)
11) *అచ్చంపేట మండలం*

1) అచ్చంపేట - మల్లేశ్వర స్వామి
(శ్రవణం - 3 పాదం)
2) చామర్రు - లక్ష్మణేశ్వర స్వామి
(శ్రవణం - 4 పాదం)
3) గింజుపల్లి - కాశీవిశ్వేశ్వర స్వామి
(ధనిష్ఠా - 1 పాదం)
4) కస్తల - చంద్రమౌళేశ్వర స్వామి
(ధనిష్ఠా - 2 పాదం)
5) కోగంటివారిపాలెం- రామలింగేశ్వర స్వామి
(ధనిష్ఠా - 3 పాదం)
6) క్రోసూరు - సోమేశ్వర స్వామి
(ధనిష్ఠా - 4 పాదం)
7) కొత్తపల్లి - మల్లేశ్వర స్వామి
(శతభిషా - 1 పాదం)
8) వేల్పూరు - రామలింగేశ్వర స్వామి
(శతభిషా - 2 పాదం)

12) *తాడికొండ మండలం*
1) బండారుపల్లి - మల్లేశ్వర స్వామి
(శతభిషా - 3 పాదం)
2) నిడుముక్కల - సోమేశ్వర స్వామి
(శతభిషా - 4 పాదం)
3) పాములపాడు – మల్లేశ్వర స్వామి
(పూర్వాభద్రా - 1 పాదం)
4) ఫణిద్రం - రామలింగేశ్వర స్వామి
(పూర్వాభద్రా - 2 పాదం)
5) పొన్నెకల్లు - రాజరాజేశ్వర స్వామి
(పూర్వాభద్రా - 3 పాదం)
6) తాడికొండ- మూలస్థానేశ్వర స్వామి
(పూర్వాభద్రా - 4 పాదం)


13) *గుంటూరు మండలం*

1) గోరంట్ల - మల్లేశ్వర స్వామి
(ఉత్తరాభద్రా - 1 పాదం)
2) గోర్లవానిపాలెం - కాశీవిశ్వేశ్వర స్వామి
(ఉత్తరాభద్రా - 2 పాదం)
3) జొన్నలగడ్డ - అమరలింగేశ్వర స్వామి
(ఉత్తరాభద్రా - 3 పాదం)
4) లాం - మల్లేశ్వర స్వామి
(ఉత్తరాభద్రా - 4 పాదం)
5) మల్లవరం - మహలింగేశ్వర స్వామి
(రేవతి - 1 పాదం)
6) నల్లపాడు - అగస్త్యేశ్వర స్వామి
(రేవతి - 2 పాదం)
7) పెదపలకులూరు - సర్వేశ్వర స్వామి
(రేవతి - 3 పాదం)
8) పొత్తూరు - సోమేశ్వర స్వామి
(రేవతి - 4 పాదం)

https://youtu.be/eXi2BjAEg7U?si=yvwfU_2SNmiB_jXw   వాగేశ్వరి శ్యామలాదేవి వాగ్వాదిని శ్యామలాదేవి గురించి మీకు పూర్తిగా తె...
05/02/2025

https://youtu.be/eXi2BjAEg7U?si=yvwfU_2SNmiB_jXw వాగేశ్వరి శ్యామలాదేవి వాగ్వాదిని శ్యామలాదేవి గురించి మీకు పూర్తిగా తెలుసా అయితే ఒక్కసారి వినండి

Address

4-7-84 Koritapadu
Guntur
522007

Telephone

9440262421

Website

Alerts

Be the first to know and let us send you an email when Saijyothishavani సాయి జ్యోతిష వాణి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Saijyothishavani సాయి జ్యోతిష వాణి:

Share