29/03/2026
శ్రీరామ జయమ్! 🚩
నిన్నటి సాయంత్రం నవమ (9వ) శ్రీరామ నవమి శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా ముగిసిన మరుసటి రోజే, నేటి దశమి తిథి న మన దశమ (10వ) మహా శోభాయాత్రకు అంకురార్పణ చేశాము. నిన్నటి యాత్రలోని లోటుపాట్లను సవరించుకుంటూ, 2027లో మనం నిర్వహించబోయే పదవ మైలురాయి యాత్రను మరింత అద్భుతంగా, చారిత్రాత్మక ఘట్టంగా తీర్చిదిద్దేందుకు నేటి సమీక్షా సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశాము. శ్రీరామ చంద్రుని కృపతో ఈ పదవ యాత్రను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో నిర్వహిద్దాం.
జై శ్రీరామ్! 🙏
శ్రీరామ ఉత్సవ సమితి
గుంటూరు