పద్మశాలి కుటుంబం

పద్మశాలి కుటుంబం ఈ పేజీ కేవలం పద్మశాలి కులస్తులకొరకె

07/06/2025

Celebrating my 7th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

27/01/2024

ప్రతి పద్మశాలి చేయండి..

నా చిన్నతనంలో నెలకి మూడు నాలుగు సార్లు పద్మశాలి సోదరులు వద్ద తినేవాణ్ణి వాళ్ళు వుండే ఇంట్లో ముగ్గురు కూర్చోడానికి స్థలం ఉండేది కాదు కాని నన్ను ఎప్పుడు ఆకలితో పడుకోనించే వాళ్ళు కాదు అంటున్న మోడీజీ

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరప్రతి ఒక్కరు like and share చేయండి అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి...
19/01/2024

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర

ప్రతి ఒక్కరు like and share చేయండి

అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు.

నిన్న ధర్మవరం చేనేతరేపు? ఇటువంటివి చూస్తూ ఉండాలా? ఇది మొత్తంగా  #చేనేతరంగం మీద జరిగిన దాడిగా భావించాలి... బడా బడా  #వస్త...
07/07/2023

నిన్న ధర్మవరం చేనేత
రేపు?
ఇటువంటివి చూస్తూ ఉండాలా?
ఇది మొత్తంగా #చేనేతరంగం మీద జరిగిన దాడిగా భావించాలి...
బడా బడా #వస్త్రవ్యాపారస్తులు బకాయిలు ఇవ్వడంలేదు... నెలలు గడిచిపోతున్నాయి...
డబ్బులు ఇవ్వడం లేదు... అడిగినందుకు ఇదిగో ఇలా...
బడా వస్త్రవ్యాపారస్తుల దగ్గర నిలిచిపోయిన బకాయిలు ఊర్లలోని #చేనేతవ్యాపారస్తుల(మాస్టర్ వీవేర్స్ )కు వస్తేనే...
మాలాంటి చేనేత కార్మికులకు డబ్బులు ఇవ్వగలరు...
బడా వస్త్రవ్యాపారస్తులు ఇవ్వడంలేదు...
తద్వారా మాకు ఇవ్వడంలేదు...
ప్రస్తుతం చేనేతరంగాన్ని నమ్ముకున్న మాలాంటివాళ్లకు పూటగడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది...
సాధ్యమైనంత వరకు పట్టు&జరీ ఇతరత్రా ముడిసరుకుల కోసం అప్పులు చేసేసాము... ఇక అప్పులు పుట్టవు... కాబట్టి పనులు సగానికి తగ్గిపోయాయి...
రావాల్సినచోట డబ్బులు రావట్లేదు... పైగా పనులు లేవు... చేతులలో డబ్బులు లేవు... తద్వారా చేనేతల పరిస్థితి దయనీయంగా మారిపోయింది...
పూట గడవక చాలామంది చేనేతను పక్కనబెట్టి వేరువేరు పనులకు వెళ్తున్నారు 😢😢
ఇది ఒక్క ధర్మవరం వ్యాపారులకే కాదు... అందరి పరిస్థితి ఇలాగే ఉంది... కొన్ని బయటపడలేదు అంతే...
వాళ్ళని నిర్బంధించి గుడ్డలూడదీయడం అంటే... మొత్తం #చేనేతరంగానికే జరిగిన అవమానంగా భావించాలి
ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారస్తు లను సిల్క్ హౌస్ యజమానులను ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం.
ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలంటే #ఆలయ #సిల్క్స్ అధినేత #అవినాష్ గుప్తా* ఈ విధంగా అవమానపరిచి వీడియోలు వైరల్ చేసి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి న్యాయ పరంగా వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీసులు వెంటనే అరెస్ట చేస్తే తప్ప రేపు పొద్దున మన ధర్మవరం లో ఇంకొకరికి ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది..

ప్రతి పద్మశాలి బిడ్డలు అందరూ like అండ్  share చేయండి...పద్మశాలి కుల బాంధవులారా... అందరికీ నమస్కారాలు. క్రైమ్ మిర్రర్ తెల...
26/06/2023

ప్రతి పద్మశాలి బిడ్డలు అందరూ like అండ్ share చేయండి...
పద్మశాలి కుల బాంధవులారా... అందరికీ నమస్కారాలు. క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ , మన పద్మశాలి ముద్దుబిడ్డ ఆనంద్ కుమార్ నేతపై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ గారి ప్రోద్బలంతో, దేవరకొండ డి.ఎస్.పి ఆదేశాల మేరకు చింతపల్లి పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బూటకపు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు బీసీ సామాజిక వర్గానికి ఐలయ్య యాదవ్. ఒక యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మన పద్మశాలి బిడ్డపై ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు ఎలా నమోదు చేస్తారు. ఈ అక్రమ కేసు నమోదు ను మనమంతా మూకుమ్మడిగా ఖండించాలి. ఆనంద్ కుమార్ నేతకు అండగా నిలవాలి. ఆనంద్ కుమార్ నేతపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు.ఎమ్మెల్యే
రవీంద్ర కుమార్ గారు ఆయన అనుచరుల చేత ఆనంద్ కుమార్ నేతకు ప్రాణహాని ఉన్నది. పోలీసులు తక్షణమే ఆయనకు భద్రతను కల్పించాలి. ఈ విషయంలో పద్మశాలి కుల పెద్దలు జోక్యం చేసుకొని ఆనంద్ కుమార్ నేతకు అండగా నిలిచేందుకు కృషి చేయాలని కోరుతున్నాం.

15/06/2023
 #ఆగస్ట్ 7న ఛలో ఢిల్లీ #సేలం ర్యాలీలో వెంకన్న నేత పిలుపు #జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మా...
03/05/2023

#ఆగస్ట్ 7న ఛలో ఢిల్లీ

#సేలం ర్యాలీలో వెంకన్న నేత పిలుపు

#జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానం

#పద్మశాలి మహసంగమ సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు

#మహా ప్రదర్శనకు వివిధ పార్టీల జాతీయ నాయకులు - కందగట్ల స్వామి



#జీరో జీఎస్టీ సాధనకై ఆగస్టు 7వ తేదీన ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శనకి దేశవ్యాప్తంగా పద్మశాలి మరియు చేనేత అనుబంధ కులాలు వేలాదిగా తరలిరావాలని ఈరోజు తమిళనాడు, సేలంలో జరిగిన పద్మశాలి మహా సంగమ ర్యాలీలో జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షులు *యర్రమాద వెంకన్న నేత* పిలుపునిచ్చారు. చేనేత పై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయడం దారుణమన్నారు. గత 17 నెలల ఉద్యమాన్ని ఆయన వివరించారు. ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శనకు వివిధ పార్టీల జాతీయ నాయకులు హాజరవుతున్నారని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి తెలిపారు. ఈ సందర్భంగా జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానం చేసింది. తమిళనాడు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు రవీంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సభలోని వేలాది మంది పద్మశాలీలు ఎకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కొక్కుల దేవేందర్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఇంజనీర్స్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండు రంగయ్య, కార్యదర్శి నక్క వేణుమాధవ్, కర్నాటక అధ్యక్షుడు జగదీష్, కేరళ కార్యదర్శి సుధాకరన్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ రావు, కోస్తాంధ్ర అధ్యక్షుడు జీ.వి. నాగేశ్వర రావు, తమిళనాడు నాయకులు తంగరాజన్, వేంకటాచలపతి. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజషన్ సౌత్ ఇండియా ఇంఛార్జి సేతుపతి, రమేష్, గోవిందరాజన్, మహారాష్ట్ర నాయకులు సంకు సుధాకర్, చిలువేరు పురుషోత్తం, ఉమా, హేమలత తదితరులు పాల్గొన్నారు.

🏏 క్రికెట్ క్రీడా ప్రపంచానికి రారాజు ప్రపంచ దిగ్గజం శ్రీ సచిన్ టెండూల్కర్ కి  సిరిసిల్ల  #నేతన్నలు ఈ విధంగా జన్మదిన శుభా...
25/04/2023

🏏 క్రికెట్ క్రీడా ప్రపంచానికి రారాజు ప్రపంచ దిగ్గజం శ్రీ సచిన్ టెండూల్కర్ కి సిరిసిల్ల #నేతన్నలు ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 💐🤝🎂



నేడు తెనాలిలో అఖిలభారత పద్మశాలి సంఘ అనుబంధ సంస్థ కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు  #జీ_వి_నాగేశ్వరరావు గారి అధ్యక్షత...
09/04/2023

నేడు తెనాలిలో అఖిలభారత పద్మశాలి సంఘ అనుబంధ సంస్థ కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు #జీ_వి_నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రదా ప్రధాన కార్యదర్శిలు పాల్గొన్నారు...

మీటింగ్ ఎజెండా :

1. అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు కీ॥శే॥ జి. రామ్మూర్తి, కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కీ॥శే॥ గుర్రం గాంధీ తదితరులకు నివాళులు అర్పించుట.
2 . అఖిల భారత పద్మశాలి సంఘంలో వివిధ పదవులలో నియమితులైన నాయకులను పరిచయం చేయుట.
3.జిల్లా కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలను పరిచయం చేయుట.

4. గత సమావేశపు తీర్మానాలపై సమీక్ష.
5. చేనేతపై '0' జియస్ ఉద్యమంలో మన సంఘం వహించిన పాత్రపై చర్చించుట.
6. ఆగష్టు 7న గౌ॥ ప్రధానమంత్రి వారికి చేనేత మహావస్త్ర లేఖ సమర్పణ మహాప్రదర్శన గురించి.
7. జిల్లా కమిటీలు ఏర్పాటు కాని వాటి గురించి.
8. సంఘ జమాఖర్చుల గురించి చర్చించుట.
9. కమిటీ కార్యవర్గాలకు సభ్యత్వం ఇచ్చుట గురించి.
10. సంఘానికి నిధులు సమకూర్చుట గురించి.
11. మహాసభ ఏర్పాటుకు తేదీ ఖరారు చేయుట.
12. చేనేత సమస్యలు గురించి చర్చించి, ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించుట.
13. అధ్యక్షుని అనుమతితో ఇతర విషయములు గురించి.

Congrats medam
24/03/2023

Congrats medam

Address

Guntur

Alerts

Be the first to know and let us send you an email when పద్మశాలి కుటుంబం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share