Indian Red Cross Society Guntur District Branch

Indian Red Cross Society  Guntur District Branch The Indian Red Cross Society (IRCS) is a voluntary humanitarian organization to protect human life and health based in India.

It is part of the International Red Cross and Red Crescent Movement

🩸 A Drop of Awareness Can Save a LifeOn this World Hemophilia Day, we unite for a cause that truly matters — supporting ...
15/04/2026

🩸 A Drop of Awareness Can Save a Life

On this World Hemophilia Day, we unite for a cause that truly matters — supporting individuals living with hemophilia and spreading awareness that can change lives.

We are organizing a State Level Awareness Meeting along with an Awareness Walk to stand in solidarity with patients and their families.

🚶‍♂️ Walk starts at 9:30 AM
📍 From Guntur Collector Office to Bharathiya Vidya Bhavan

This meaningful initiative is brought to you by
Hemophilia Society – Vijayawada Chapter
in association with
Indian Red Cross Society

📅 17th April | ⏰ 10:00 AM onwards
📍 Sri Bommidala Krishna Murthy Auditorium, Guntur

Let’s raise our voices, spread awareness, and build a future where no child suffers in silence.

💜 Because awareness is the first step to care.
🤝 Together, we can make a difference.

నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ వారు వసంత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నందు ప్రధమ చికిత్స అవగాహన తరగ...
02/04/2025

నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ వారు వసంత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నందు ప్రధమ చికిత్స అవగాహన తరగతి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ తరగతి నందు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, పక్షవాతము, కుక్క కాటు, పాము కాటు, అగ్ని ప్రమాదాలు వంటి వివిధ అంశాల మీద వసంత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందికి, కార్మికులకి అవగాహన కల్పించడం జరిగినది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ నందు "స్ఫూర్తి ఎక్స్పో  " ప్రదర్శ...
04/03/2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ నందు "స్ఫూర్తి ఎక్స్పో " ప్రదర్శన కేంద్రం నందు " వార్ ఆన్ సింగిల్ యుజ్ ప్లాస్టిక్ " మీద అవగాహన స్టాల్ ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వలన పర్యావరణమునకు కలుగు అనర్దముల మీద సందర్శకులకు అవగాహన కల్పించి నూలు సంచులు వాడవలసింది గా చైతన్య పరచడం జరిగినది.

రెడ్ క్రాస్ స్టాల్ ను శ్రేష్ఠ హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ డా. G. నాగార్జున, ప్రిన్సిపాల్ డా. S. రమణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు సందర్శించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో నేడు తెనాలి మండలం అంగలక...
01/02/2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో నేడు తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడమైనది. 200 మంది స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడమైనది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ గౌరవాధ్యక్షులైన శ్రీమతి సంజన సింహ, ఐఏఎస్., పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ శ్రీమతి ముమ్మనేని భానుమతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ తెనాలి శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ పావని ప్రియాంక సహకారం అందజేశారు. తెనాలి మండల విద్యాశాఖ అధికారి శ్రీ మేకల లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ తెనాలి శాఖ కోశాధికారి శ్రీ నాలం శ్రీమన్నారాయణ, కమిటీ సభ్యులు శ్రీ కుర్ర శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీ ఎస్కే జానీ రసూల్, స్కూల్ కరస్పాండెంట్ శ్రీ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణం నందు భారత్ సేవా ట్రస్ట్ వారి సహకారంతో రక్త...
30/01/2025

నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణం నందు భారత్ సేవా ట్రస్ట్ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరంలో 60 మంది యువతీ యువకులు రక్తదానం చేశారు. గత 13 సంవత్సరాలుగా మహాత్మ గాంధీజీ వర్ధంతి( జనవరి 30 వ తేది )సందర్భంగా భారత్ సేవ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారత్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ నాగేంద్ర కుమార్, సభ్యులు శ్రీ యోగేశ్వరరావు, శ్రీ ధనుంజయరావు తదితరులు నాయకత్వంలో మంగళగిరి పట్టణంలోని స్వర్ణకారులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేడూరి భాస్కరరావు, రెడ్ క్రాస్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ ఎస్కే జానీ రసూల్ , రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఎస్. చలపతి, రాణి, ఫణి తదితరులు పాల్గొన్నారు.

నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని భారతీయ విద్యా భవన్ పాఠశాల నందు విద్యార్థి...
28/01/2025

నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని భారతీయ విద్యా భవన్ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అంశాల మీద అవగాహన తరగతి ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ కార్యాలయంలో రెడ్ క్రాస్ మేనేజర్ శ్రీ బి పిచ్చిరెడ్డి పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో, నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కాంపౌండ్ నందు గల రెడ్ క్రాస్ కార్య...
28/01/2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో, నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కాంపౌండ్ నందు గల రెడ్ క్రాస్ కార్యాలయం నందు ఫిబ్రవరి 3వ తేది, సోమవారం ఉదయం 5:30 నుండి ప్రతిరోజు ఉచిత యోగ, ధ్యానము, వ్యాయమ తరగతులు నిర్వహించనున్నారు.

ఈ తరగతులలో పాల్గొనకోరు వారు పైన పోస్టర్ నందు గల ఫోన్ నెంబర్లకు సంప్రదించవలసినదిగా మనవి. 🙏

Address

ZP Compound
Guntur
522004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+918866306969

Alerts

Be the first to know and let us send you an email when Indian Red Cross Society Guntur District Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian Red Cross Society Guntur District Branch:

Share