14/07/2026
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారిది సింగరేణి భరోసా యాత్ర కాదు... కార్మికుల నయవంచిన యాత్ర...
మెండె శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి
ఈరోజు ఉదయం 7 గంటలకు జీడీకే 2&2A పిట్ కమిటీ సభ్యులు సమావేశం అనబోయిన శంకర్ అధ్యక్షతన జరిగింది... ముఖ్య అతిథిగా హాజరైన మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు సింగరేణి వ్యాప్తంగా రెండు రోజుల నుంచి భరోసా యాత్ర పేరుతో పర్యటన చేస్తున్నారు... ఈ పర్యటనలో ప్రధానంగా తాడిచర్ల 2 బ్లాక్ కేటాయించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు... 2013లోనే తాడిచర్ల 2 బ్లాక్ యూపీఏ ప్రభుత్వంలో కేటాయించబడ్డదన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక దాన్ని క్లియరెన్స్ ఇవ్వడానికి 13 సంవత్సరాల సమయం పట్టిందని, ఈ కాలయాపన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు... భరోసా యాత్ర పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ మీ కార్యకర్తలకు చెవిలో తామర పువ్వు పెట్టినట్లు కార్మికులకు చెబితే వింటారు అనుకుంటున్నారా, సింగరేణి కార్మికులు అంటే తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన పోరాట యోధులు ఏ హక్కు అయినా పోరాటాలతో హక్కులు సాధించుకున్న చరిత్ర కార్మికులది, బీజేపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు కొంగుబంగారం లాంటి సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు ఈ వేలం ద్వారా కట్టబెడుతూ సింగరేణి సంస్థను దివాలా తీసేందుకు, నిరుద్యోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని... ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులు సైనికులతో సమానమని అందరికీ ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన సంగతి కార్మికులందరికీ తెలుసు అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా సింగరేణి కార్మికుల పై ప్రేమ ఉంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న దాదాపు 17 బ్లాకులు ఈ వేలం లేకుండా భేషరతుగా సింగరేణి కేటాయించి, కార్మికులందరికీ ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తే... అప్పుడు మిమ్ములను కార్మికులు హర్షిస్తారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ గౌరవాధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి, అధ్యక్షులు వంగల శివరాం రెడ్డి, పుప్పాల శ్రీనివాసరావు, అనబోయిన శంకర్, బానోతు రామకృష్ణ, సిహెచ్ లచ్చన్న, గడికొప్పుల దుర్గాప్రసాద్, సుభాష్, సంపత్, లచ్చన్న, సందీప్, తదితరులు పాల్గొన్నారు...
అభినందనలతో...