Athmiya Trust

Athmiya Trust helping hands

*Ⓜ️🚩గంజాయి బారి నుండి విద్యార్థులను - యువతను  కాపాడుదాం* ...*యుటి ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ సత...
22/12/2025

*Ⓜ️🚩గంజాయి బారి నుండి విద్యార్థులను - యువతను కాపాడుదాం*
...*యుటి ఎఫ్ కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ సతీష్ కుమార్ గారు*

*బావి భారత పౌరులైన విద్యార్థులను, యువకులను గంజాయి మహమ్మారి నుండి కాపాడి దేశ భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని గౌరవ ఎస్ పి శ్రీ సతీష్ కుమార్ గారు గారు పిలుపునిచ్చారు.*

*ఈ సందర్భంగా SP శ్రీ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ గంజాయి మహమ్మారిని తరిమికొడదాం అనే కరపత్రాన్ని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శులు నారాయణస్వామి , తాహిర్ వలి ,లక్ష్మీనారాయణ, నాయకులు బాబు ఆత్మీయ ట్రస్టు సభ్యులు, హర్జిత్ ప్రణవ్ , తో కలిసి ఆవిష్కరించడం జరిగింది.*

*ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఒకప్పుడు కొన్ని వయసుల వారికి, కొన్ని వ్యవస్థలకే పరిమితమైన మత్తు పదార్థాలుయువతను విద్యార్థులను సైతం బానిసలు చేస్తున్నది. అందులో ముఖ్యంగా గంజాయి ప్రధాన పాత్ర పోషిస్తున్నదని, అభం - శుభం తెలియని చిన్న పిల్లలు సైతం గంజాయికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.*

*రాష్ట్ర కార్యదర్శి జయ చంద్రా రెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడంతోపాటు, దేశ భవిష్యత్తును కాపాడాల్సిన యువత ఈరోజు గంజాయి మత్తుకు బానిసై వినాశకర దోరణల వైపు పయనిస్తోందని, దీనిని ప్రజలందరూ ముక్తకంఠంతో ఎదుర్కోవాలని తెలిపారు.*

*సామాజిక స్పృహ కలిగిన సంఘమైన యుటిఎఫ్ భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడడం కోసం రెండు లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడం అభినందనీయమని ఎస్పీ గారు తెలిపారు*

*ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ జిల్లా కోశాధికారి డి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు తాహిర్ వలి, నారాయణస్వామి, లక్ష్మీనారాయణ, బాబు మరియు ఆత్మీయ ట్రస్ట్ సభ్యులుహరిజీత్ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు*

*Ⓜ️🚩విద్యార్థుల ప్రతిభ ను మార్కుల కొలమానంగా భావించే విద్యా విధానంలో మార్పు రావాలి* *ఉత్తమ ఉపాధ్యాయ పురాష్కర కార్యక్రంలో ...
07/09/2025

*Ⓜ️🚩విద్యార్థుల ప్రతిభ ను మార్కుల కొలమానంగా భావించే విద్యా విధానంలో మార్పు రావాలి*

*ఉత్తమ ఉపాధ్యాయ పురాష్కర కార్యక్రంలో ప్రముఖ సినీనటుడు వెల్లంకి నాగినీడు_*

*సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆత్మీయ ట్రస్ట్ మరియు UTF ధర్మవరం జోన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు ఆదివారం రోజున 68 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు "ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను" అందించడం జరిగింది. ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ మరియు UTF రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ సినీనటుడు వెల్లంకి నాగినీడు గారు హాజరై ప్రసంగిస్తూ ప్రస్తుతం విద్యార్థుల ప్రతిభను మార్కులతో కొలిచే విద్యా విధానంలో మార్పు రావాలని, పాఠశాలలు విద్యార్థులను వారికి నచ్చిన రంగంలో రాణించే నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు కేవలం సిలబస్ గురించి మాత్రమే కాకుండా విద్యార్థి దశ నుంచే వారిలో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాల్ని వెలికితీసే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సూచించారు. 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులను తన చేత సన్మానించే అవకాశాన్ని కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఆ అవకాశాన్ని కల్పించిన ఆత్మీయ ట్రస్ట్ మరియు UTF ధర్మవరం జోన్ వారికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.*

*ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ మరియు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ అవసరాల్లో ఉన్న వారికి, సమాజానికి తమ వంతు సహాయం అందించాలనే లక్ష్యంతో ఆత్మీయ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న 68 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి వారినీ సన్మానించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా UTF రాష్ట్ర సహాధ్యక్షులు కె. సురేష్ కుమార్ గారు, పెనుకొండ DyEO (డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) కె. జాన్ రెడ్డప్ప గారు, ధర్మవరం మండల విద్యాధికారులు శ్రీమతి రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ గారు, చిలమత్తూరు మండల విద్యాధికారి హనుమంత రెడ్డి గారు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఆత్మీయ ట్రస్ట్ మరియు UTF సంయుక్తంగా ఇంత మంది ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని గౌరవించడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భవితకు దిక్సూచిగా మారాలని సూచించారు.*

*ఈ కార్యక్రమంలో jvv రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు SVV రమణయ్య శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యద M. సుధాకర్, భూతన్న, సహధ్యక్షులు GH బాబు, కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు నారాయణ స్వామి, లక్ష్మి నారాయణ, శివ శంకర్, సుబ్బారెడ్డి, నరేష్ కుమార్, నరసింహాప్ప లతా దేవి, రామకృష్ణ నాయక్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మహంతెశ్వర్, రాష్ట్ర కౌన్సిలర్స్ MV మారుతీ శ్రీనివాస్, మేరీ వర కుమారి అనంతపురం జిల్లా సహధ్యక్షులు రామప్ప చౌదరి, ధర్మవరం UTF నాయకులు రామీజాబి, మారుతీ, ఆంజనేయులు, అమరనారాయణ రెడ్డి, జింకా హరి కృష్ణ, రాంప్రసాద్ వెంకట కిషోర్ సకల చంద్ర శేఖర్, సురేష్ H రామాంజినేయులు, సాయి గణేష్, నాగేంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.*

02/09/2025

*66 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కారాలు*

*ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ సహకారంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా ప్రభుత్వ విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న 66 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ మరియు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్ తెలిపారు*

*ఎంపికైన ఉపాధ్యాయ వివరాలను మంగళవారం రోజున ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి రాజేశ్వరి మరియు గోపాల్ నాయక్ ఆత్మీయ ట్రస్ట్ యుటిఎఫ్ సభ్యులతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారి లిస్టును ఆవిష్క రించి వివరాలు తెలియజేయడం జరిగింది.*

*ఈ ఆత్మీయ పురస్కారాలు సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో హోం నందు ఉపాధ్యాయులకు అందజేయబడునని ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలియజేశారు*

*ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ,ఆంజనేయులు, లక్ష్మయ్య ,అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి, నాగేంద్రమ్మ. డాక్టర్ రామకృష్ణ, హరికృష్ణ ,B. రామాంజనేయులు, హెచ్ రామాంజనేయులు ,సాయి గణేష్ , నాగిరెడ్డి, వెంకట కిషోర్, బాలుగొండ్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు*

✍🏻👨🏻‍🏫 *_ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ ధర్మవరం జోన్ సౌజన్యంతో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!_*✍...
06/08/2025

✍🏻👨🏻‍🏫 *_ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ ధర్మవరం జోన్ సౌజన్యంతో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!_*✍🏻👩🏻‍🏫

*2025 సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం, శ్రీ సత్య సాయి ఉమ్మడి జిల్లాలలోని ప్రభుత్వం రంగంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉపాధ్యాయులు 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఆత్మీయ ట్రస్ట్ ధర్మవరం వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. యుటిఎఫ్ ధర్మవరం జోన్ నాయకులతో కలసి ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బోధనలో అద్భుతమైన ప్రతిభతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ, నైతిక విలువలతో తమ సర్వీసులో ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు లోను కాకుండా ఉన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఈనెల 20వ తేదీ లోపల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తులను అందజేయాలని తెలిపారు.*

*మరిన్ని వివరాలకు 9030944717 మరియు 9441734907 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యూటీఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, ఆంజనేయులు, హరికృష్ణ, రాంప్రసాద్, మేరీ వరకుమారి, నాగేంద్రమ్మ, సాయి గణేష్, K. రామకృష్ణ , నాగిరెడ్డి, రామాంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, వెంకట కిషోర్, బి. ఆంజనేయులు, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.*

13/03/2025
*Ⓜ️🚩 నేడు 13/03/2025  గురువారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్  రాష్ట్ర కార్యదర్శి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు, ఆత్మ...
13/03/2025

*Ⓜ️🚩 నేడు 13/03/2025 గురువారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు, ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ అయిన శ్రీ శెట్టిపి జయచంద్రా రెడ్డి గారి సౌజన్యం తో మరియు ముదిగుబ్బ UTF. మండల శాఖ ఆధ్వర్యంలో ముదిగుబ్బ మండల కేంద్రం బాలుర ఉన్నత పాఠశాలలో 84 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ఉచితంగా పంపిణి చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో పాఠశాల HM A. V. B. రాఘవ గారు మాట్లాడుతూ మా విద్యార్థులు కు పరీక్ష సామాగ్రి అందించి ప్రోత్సహించిన UTF, ఆత్మీయ ట్రస్టు వారికీ ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. UTF, మరియు ఆత్మీయ ట్రస్ట్ చేసిన సేవలను కొనియాడారు...*
*👉ఈ కార్యక్రమం లో ఆత్మీయ ట్రస్ట్ డైరెక్టర్ శెట్టిపి జశ్వంత్ రెడ్డి,UTF జిల్లా కార్యదర్శి D.అనిల్ కుమార్ యుటిఎఫ్ ముదిగుబ్బ మండల అధ్యక్షులు K..నారాయణ, ప్రధాన కార్యదర్శి డి బాబా ఫక్రుద్దీన్ రామగిరి మండల యూటీఎఫ్ అధ్యక్షులు బాలగొండ్ల శివయ్య స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు వెంకట శివారెడ్డి, మురళి నాయుడు, రాజశేఖర్, శ్రీనా, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩*

12/03/2025
🎉 *_అనంత బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహణకు ఆత్మీయ ట్రస్ట్ 25 వేల రూపాయల విరాళం..!_*🎉*2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో అనం...
21/01/2025

🎉 *_అనంత బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహణకు ఆత్మీయ ట్రస్ట్ 25 వేల రూపాయల విరాళం..!_*🎉

*2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో అనంతపురం నగరంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే అనంత బాలోత్సవం పిల్లల పండుగ -5 నిర్వహణకు UTF రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, ఆత్మీయ ట్రస్ట్ డైరెక్టర్ నంగి పరమేశ్వర్ రెడ్డి సౌజన్యంతో ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ శెట్టిపి రామి రెడ్డి గారు, శెట్టిపి జశ్వంత్ రెడ్డి, శెట్టిపి హార్జీత్ ప్రణవ్ రెడ్డి మంగళవారం రోజున బాలోత్సవ కమిటీ కన్వీనర్ శ్రీమతి సావిత్రి గారికిమరియు రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబెర్ రమణయ్య గారికి రూ. 25,000 విరాళం అందజేశారు. బాలబాలికలలో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికి, శాస్త్ర సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించడానికి 36 అకాడమిక్, 26 సాంస్కృతిక విభాగాల్లో మొత్తం 62 ఈవెంట్లలో జరిగే అనంత బాలోత్సవ పిల్లల పండుగను విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆత్మీయ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు.*

⛹🏻 *_ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా శెట్టిపి జయచంద్రా రెడ్డి..!_*⛹🏻‍♀️*ఉమ్మడి జిల్లా  బాస్కెట్బాల్ అసోస...
30/12/2024

⛹🏻 *_ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా శెట్టిపి జయచంద్రా రెడ్డి..!_*⛹🏻‍♀️

*ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ (అనంతపురం, సత్య సాయి జిల్లాలు కలిసి ఉన్న అసోసియేషన్) ధర్మవరం ప్రాంతమునకు సముచిత స్థానం లభించింది. ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రా రెడ్డిని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.*

*ధర్మవరం పట్టణం నుండి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ బాస్కెట్బాల్ రాష్ట్ర జట్టుకు వరుసగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ధర్మవరం పట్టణంలో బాస్కెట్బాల్ క్రీడాభివృద్ధికి 22 సంవత్సరాల నుండి ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులతో, సభ్యులు తో కలిసి బాల, బాలికలను జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో తీర్చిదిద్దడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నిరంతరం కృషిచేస్తున్న శెట్టిపి జయచంద్రా రెడ్డి ని ఆదివారం రోజున ఉమ్మడి జిల్లా అసోసియేట్ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, యుటిఎఫ్ నాయకులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకం పట్ల జయచంద్రా రెడ్డి ఉమ్మడి జిల్లా అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.*

🩸 *_స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి - UTF జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపు..!_*🩸*రక్తదానం...
25/12/2024

🩸 *_స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి - UTF జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపు..!_*🩸

*రక్తదానం సులువైనది, విలువైనది, మరువలేనిది. స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి - రక్తదాతలుగా సంసిద్ధులు కండి. రక్తదానం మనుషుల ప్రాణాలతో పాటు మానవతా విలువలను కాపాడుతుందని UTF జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు.*

*ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(UTF) ధర్మవరం జోన్ మరియు ఆత్మీయ ట్రస్ట్, ధర్మవరం సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదానం ఆవశ్యకత గురించి ప్రజలందరికీ తెలియపరచే ఉద్దేశంతో ముద్రించిన కరపత్రాలను బుధవారం రోజున స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో స్థానిక UTF నాయకులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులతో కలసి బుధవారం రోజున UTF జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆవిష్కరించారు.*

*ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ UTF నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, , సకల చంద్రశేఖర్, సాయి గణేష్, గడ్డం రామ్మోహన్, హరిశంకర్, వెంకట కిషోర్ మరియు ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు జశ్వంత్ , ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.*

⛹🏻‍♀️ *_ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం  బాలిక ఎంపిక _*⛹...
27/11/2024

⛹🏻‍♀️ *_ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక _*⛹🏻‍♂️

* *జాతీయ స్థాయిలో ఈ నెల నవంబర్ 29 తేదీ నుండి డిసెంబర్ 05 తేదీ వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరంలో జరిగే 39వ యూత్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు నందు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి బాస్కెట్బాల్ క్రీడాకారిణి ఎంపికయ్యారని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ @ UTF శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు.*

*ఈ సంవత్సరం మే 21వ తేదీ నుండి 24 వరకు విజయవాడ నగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల నందు ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు నందు ఎంపికై ఉమ్మడి జిల్లా జట్టులో చక్కగా రాణించి రాష్ట్ర జట్టుకి ఎంపిక అవడం హర్షనీయమని అభినందనీయమని వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు . కిరణ్మయి జాతీయ స్థాయిలో రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు... బాలికల ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టులో కిరణ్మయి ఒక్కరే జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ఎంపిక కావడం ధర్మవరం పట్టణానికి గర్వకారణం అని అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు..*

Address

14-552 , PRT Street
Dharmavaram
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when Athmiya Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Athmiya Trust:

Share