02/03/2026
భాజపా పార్టీ నిర్వహిస్తున్న జన వారధి కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి మోటుపల్లి అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల గురించి కలెక్టర్ గారికి వివరించడం
జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ , దేవాలయాల కు సంబంధించిన భూములను పరిరక్షించాలని అక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్లో బయో డైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న కంచు పంచలోహ విగ్రహాలను సత్వరమే మోటుపల్లి తీసుకువచ్చి మంచి మ్యూజియం ఏర్పాటు చేసి టూరిజానికి అనుకూలంగా అభివృద్ధి చేయాలని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తద్వారా కల్పించాలని కోరడం జరిగింది.