15/08/2026
HUDA MUSLIM WELFARE ASSOCIATION
SERVICE * SACRIFICE * DEVELOPMENT * EDUCATION
పత్రికా ప్రకటన
బొబ్బిలి: బొబ్బిలి జామియా మసీదు ఆవరణలో హుడా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి లాలం రామలక్ష్మి గారు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ “భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనం” అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించారు.
వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన కోరాడ వీధికి చెందిన వెంపటాపు షణ్ముఖ సాయి, S/o వెంపటాపు శంకర్రావును ఘనంగా సత్కరించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి లాలం రామలక్ష్మి గారిని పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన చిన్నారులందరికీ బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం సోదరులు, కోరాడ వీధికి చెందిన ప్రజలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Signature: __________________